గాయత్రి హైస్కూల్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు, విద్యార్థులకు అవగాహన కల్పించిన డిటిఓ రవీందర్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో గాయత్రి హైస్కూల్ నందు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు . పవిత్రాత్మ, గాయత్రి పాఠశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి జి రవీందర్ హాజరై ,మాట్లాడుతూ... మైనర్లు బైక్ నడపడం నేరం, ఒకవేళ ఆక్సిడెంట్ జరిగిన మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు .ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు కారులో గాని, బైకుల మీద గాని, బయలుదేరినప్పుడు హెల్మెట్ ,సీటు బెల్టు, పెట్టుకొమని కూతురు చెప్తే దాన్ని తప్పకుండా వింటారు, కావున ఈ విషయాన్ని తప్పకుండా.. గుర్తు చేయాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోఫోన్ వాడరాదు .ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులతో అన్నారు .ఈ కార్యక్రమంలో యాజమాన్యం, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Jan 30 2024, 16:20