/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు Yadagiri Goud
తెలుగు రాష్ట్రాలలో భారీగా పెరిగిన చికెన్ ధరలు

సంక్రాంతి వేళ తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి.

హైదరాబాద్ లో నిన్నటి వరకు కేజీ స్కిన్ లెస్ ధర రూ.180-200 మధ్య ఉండగా..

ఇవాళ రూ.220లకు చేరింది. ఖమ్మంలోని కొన్ని ప్రాంతాల్లో నిన్న రూ.160-180 మధ్య ఉన్న ధర ఈరోజు రూ.200లకు చేరింది.

ఏపీలోని చాలా ప్రాంతాల్లో కూడా రూ.200-230 మధ్య చికెన్ ధర కొనసాగుతోంది.

రాజన్న జిల్లాలో నేడు కేటీఆర్‌ పర్యటన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేటీఆర్‌ పర్యటించనున్నారు.

ముందుగా సిరిసిల్ల నియోజకవర్గంలోని ఆరు మండలాల సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకి వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం మల్యాల గ్రామంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆహ్వానిత వాలీబాల్ టోర్న మెంట్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు.

ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్య క్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, వేములవాడ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనర సింహారావు తదితరులు పాల్గొంటారు...

ఈడీ ముందుకు కవిత: హాజరు కానున్నారా?

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఇవాళ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు ఈడీ నోటీసులపై స్పందించిన కవిత విచార ణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు.

ఇదే విషయంలో సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని.. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేవరకు తాను విచారణకు హాజరుకాకూడ దని నిర్ణయించుకున్నట్లు లేఖలో తెలిపారు. గతంలో మూడు సార్లు కవితకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.

దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను విచారించిన అధికారుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు.

మహిళలను ఇంటి దగ్గర లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరిపేలా ఆదేశాలివ్వాలని కోరారు. అయితే గతేడాది మార్చి లోనే కవితను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అధికారులు పలుమార్లు విచారించారు.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్‌ గ్రూప్‌కు సంబంధిం చిన వ్యవహారాల్లో కవిత లీడ్‌ చేశారని ఈడీ ఆరోపిస్తోంది. అరుణ్ రామచంద్ర పిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా చేసుకుని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

కవిత విచారణకు రానని తేల్చిచెప్పడంతో సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు ఈడీ అధికారులు వెయిట్‌ చేస్తారా లేక విచారణకు రావాల్సిందేనని మరోసారి నోటీసులు ఇస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది...

నాసిన్ క్యాంపస్ ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఏపీలో పర్యటించనున్నారు. సత్యసాయి జిల్లా పాలస ముద్రంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) నూతన భవన సముదా యాన్ని మంగళవారం ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్ అండ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్సెస్) 74, 75వ బ్యాచ్ ల ట్రైనీ ఆఫీసర్లతోనూ, రాయల్ సివిల్ సర్వీస్ ఆఫ్ భూటాన్ ట్రైనీ ఆఫీసర్లతోనూ మాట్లాడనున్నారు

మోదీ తన పర్యటన సందర్భంగా NACIN క్యాంపస్ లోని పురాతన వస్తువుల అక్రమ రవాణా అధ్యయన కేంద్రం, నార్కోటిక్స్ అధ్యయన కేంద్రం, వైల్డ్ లైఫ్ క్రైమ్ డిటెక్షన్ సెంటర్ లను సందర్శించనున్నారు.

NACIN ప్రాంగణంలో మోదీ ఓ మొక్కను నాటనున్నారు. అక్కడి భవన నిర్మాణ కార్మికులతో ముచ్చటించ నున్నారు..

కాగా, ఈ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్ కూడా పాల్గొననున్నారు. ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత లేపాక్షిలోని వీరభద్ర ఆలయాన్ని సందర్శించనున్నారు.

కాగా, రాష్ట్ర విభజన చట్టం-2014 కేటాయింపుల్లో భాగంగా ఏపీకి NACIN అకాడమీని కేటాయించారు.

ఈ అకాడమీ నిర్మాణానికి 2015లో అప్పటి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. NACINకి దేశంలోనే ఇది రెండో క్యాంపస్. దీన్ని రూ.730 కోట్ల వ్యయంతో నిర్మించారు.

Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం

ఢిల్లీలో దట్టమైన పొగమంచు వల్ల చల్లని గాలులు వీస్తున్నాయి. దీని వల్ల ఢిల్లీ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. అయితే, పొగమంచు వల్ల విజిబిలిటీ తక్కువగా ఉంది..

ఈ పొగమంచు వల్ల పలు రైళ్లు రాకపోకలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇప్పటికే 17 విమానాలను క్యాన్సిల్ అయ్యాయి. విమాన సర్వీసుల ఆలస్యం, రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైల్వే స్టేషన్ ల్లోనూ ప్రయాణికులు రద్దీ ఎక్కువగా కొనసాగుతుంది..

నేడు ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోదీ.. సత్యసాయి జిల్లాలో పర్యటన..

సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం దగ్గర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు..

అలాగే లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయాన్ని దర్శించి పూజ చేస్తారు.

షెడ్యూల్ ఇదీ:

ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం 1.30కి వీరభద్ర స్వామి ఆలయంలో పూజ చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3.30కి సత్యసాయి జిల్లాలోని పాలసముద్రానికి వెళ్లి నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (NACIN) కొత్త క్యాంపస్‌ను ప్రారంభిస్తారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. IRS లోని కస్టమ్ అండ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ విభాగానికి చెందిన 74, 75 బ్యాచ్‌ల ఆఫీసర్ ట్రైనీలతో మాట్లాడతారు. అళాగే భూటాన్‌కి చెందిన రాయల్ సివీల్ సర్వీస్ విభాగ ఆఫీసర్ ట్రైనీస్‌తో కూడా ముచ్చటిస్తారు..

నేడు బాబుకి జడ్జిమెంట్‌ డే

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో నేడు సుప్రీం కోర్టు తీర్పు!

స్కిల్‌ కేసులో అరెస్ట్‌ అయ్యి 52 రోజలు జైల్లో ఉన్న చంద్రబాబు

మధ్యాహ్నాం ఒంటి గంటకు తీర్పు వెల్లడించిన ద్విసభ్య ధర్మాసనం

17ఏ తనకు వర్తిస్తుందని చంద్రబాబు వాదన

వర్తించదని ఏపీ సీఐడీ వాదనలు

వాదనలు విని.. తీర్పు రిజర్వ్‌ చేసిన బెంబ్‌

తెలంగాణ బడ్జెట్ పై 2024-25 కసరత్తు.. ఈనెల 18 నుంచి శాఖల వారీగా సమీక్షలు..

ఆర్ధిక సంవత్సరాని(2024-25)కి ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు షురూ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ ప్రతిపాదనలు కోరింది..

ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపిన ఆయా శాఖలు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ప్రత్యేకంగా ప్రాధాన్యమిచ్చినట్లు తెలిసింది..

మరోవైపు బడ్జెట్ ప్రతిపాదనలపై అన్నిశాఖలతో ఆర్ధికశాఖ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించనుంది. బడ్జెట్ కసరత్తులో భాగంగా అన్ని శాఖలతో ఆర్థికశాఖ సమావేశాలు ఈనెల 18వ తేదీ నుంచి నుంచి ప్రారంభం కానున్నాయి. మంత్రులు, అధికారులతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. రోజుకు ఇద్దరు చొప్పున మంత్రులకు సంబంధించిన శాఖలతో డిప్యూటీ సీఎం సమావేశం జరగనుంది..

ఈ సమావేశాల్లో గ్యారంటీలు, ఎన్నికల హామీల అమలుకు పద్దు కేటాయింపులపై చర్చించనున్నారు. అలాగే ఉద్యోగ నియామాకాలపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న తరుణంలో రాష్ట్రప్రభుత్వంఓటాన్ అకౌంట్‌కు వెళ్తుందా లేదా పూర్తిబడ్జెట్ ప్రవేశపెడతారా అన్న విషయమై స్పష్టత రావాల్సి ఉంది..

Sabarimala: నేడు శబరిమలలో మకర జ్యోతి దర్శనం..

శబరిమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ఇవాళ మకర జ్యోతి దర్శనం కోసం లక్షల సంఖ్యలో అయ్యప్ప స్వాములు వేచి చూస్తున్నారు. అత్యధిక మంది భక్తులు చేరుకోవడంతో శబరి కొండలు స్వామి శరణం అయ్యప్ప నినాదాలతో మారుమోగిపోతున్నాయి..

ప్రతి ఏటా మకర సంక్రాంతి రోజున శబరిమలలో మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. ఈ జ్యోతి దర్శనం చేసుకునేందుకు అయ్యప్ప భక్తులు లక్షల సంఖ్యలో అనేక రాష్ట్రాల నుంచి చేరుకోవడం సంప్రదాయంగా వస్తుంది. మకర జ్యోతి దర్శనం చేసుకుంటే తమకు మోక్షం లభిస్తుందని అయ్యప్ప భక్తులు భావిస్తారు..

PM Modi: 16న లేపాక్షిని సందర్శించనున్న ప్రధాని మోడీ

ఏపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు. జనవరి 16వ తేదీన శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని పర్యటించనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లేపాక్షిని ప్రధాని నరేంద్రమోడీ పర్యటించనున్నారు..

పాలసముద్రంలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్, ఇన్‌డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ను సందర్శించనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొననున్నారు. ప్రధాని పర్యటనకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సీఎస్‌ జవహర్‌ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. ప్రధాని పర్యటనలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం జగన్‌ కూడా పాల్గొనే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. ప్రధాని పర్యటనకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని డీజీపీని ఆదేశించారు..