కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలి:కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి
కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములను వెలికి తీసి పేదలకు పంచాలి
- కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా కార్యదర్శి
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో గల కుడకుడ శివారు ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 126, 110 ,160 లు మొత్తం కూడా కబ్జా గురైందని,ఈ భూమిని కబ్జాల నుండి వెలికి తీసి పేదలకు పంచాలని సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివ కుమార్ డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం.ఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వెంకట్ రెడ్డి గారికి వినతిపత్రం జరిగింది.ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ మాట్లాడుతూ సూర్యాపేట పట్టణ సమీపంలో గల కుడకుడ శివారులో సర్వేనెంబర్ 126 లో సుమారు 85 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఈ ప్రభుత్వ భూమి మొత్తం కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పార్టీ నాయకులు మరియు కొంతమంది స్థానిక నాయకులు కలిసి కబ్జా చేసి తప్పుడు దారుల్లో కొంతమంది పట్టాలు సంపాదించారని విమర్శించారు. అదేవిధంగా గత ఆరు సంవత్సరాల నుంచి మా పార్టీ ఆధ్వర్యంలో పేదలు గుడిసెలేస్తే టీఆర్ఎస్ నాయకులు మరియు నిత్యం పేద ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పుకునే ఒక ఎర్రజెండా పార్టీ నాయకులు కలిసి మా మహిళలపై దాడులు చేశారని అన్నారు. ఆ ఇంటి స్థలాలను నేడు వారు, టిఆర్ఎస్ నాయకులు కలిసి ఆక్రమించుకొని దొడ్డి దారిలో పట్టాల పొందారు,మరికొందరు స్వతంత్ర సమర యోధుల పేరుతోటి, ఎక్స్ మిల్ట్రీ వాళ్ళ పేరుతోటి తప్పుడు దారుల్లో గుట్టలను పట్టా చేయించుకొని, వాటిని నేడు ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు.అదేవిధంగా ఉపేందర్ అనే అతను మునిసిపాలిటీలో పనిచేస్తూ అధికార పార్టీ నాయకుల అండదండ తోటి 126 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని అక్కడ ఉన్న పేదలకు అమ్ముతున్నాడు. ఈ కబ్జాదారులను కట్టడి చేయక పోతే ప్రభుత్వ భూమి మొత్తం చివరికి ప్రభుత్వానికి పేద ప్రజలకు లేకుండా పోతుంది అన్నారు. కాబట్టి కబ్జాదారులను శిక్షించి,కబ్జా భూములను వెలికితీసి అర్హులైన పేదలందరికీ 126 గజాల ఇంటి స్థలం ఇచ్చి, ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలని మా పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము అన్నారు. ఇదే విషయం గతంలో ఉన్న కలెక్టర్ గారికి , చివ్వెంల ఎమ్మార్వో గారికి, పోలీసు వారికి,గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారికి మా పార్టీ ద్వారా అనేకసార్లు తెలియజేశాము అయినా ఎలాంటి స్పందన లేకపోగ,మాపై తప్పుడు కేసులు పెట్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. కలెక్టర్ గారు స్పందించి వారం రోజుల్లో కబ్జా భూమిని వెలికి తీసి, కబ్జాదారులను శిక్షించి ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని, లేనియెడల మా పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్, పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రాంజీ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సయ్యద్ హుస్సేన్,పివైఎల్ నాయకులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Jan 04 2024, 16:24