పవర్లూమ్ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ,ఇండ్లు నిర్మించి ఇవ్వాలి,వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి..
పవర్లూమ్ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ,ఇండ్లు నిర్మించి ఇవ్వాలి
వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి
రాష్ట్రంలో పవర్లూమ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక కోటా ద్వారా 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య లు తెలిపారు
శనివారం తెలంగాణ పవర్ లుం వర్కర్స్ యూనియన్ (సిఐటియు ) పద్మనగర్ ఏరియా కమిటీ సమావేశం పద్మనగర్ మార్కండేయ గుడి దగ్గర జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య రాష్ట్రవ్యాప్తంగా పవర్లూమ్ కార్మికులు లక్ష మంది పైగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది యజమానులు వేసిన షెడ్లలో నివాసం ఉంటూ రోజుకు 14 గంటలు పని చేస్తున్నారు. చేసిన కష్టానికి తగిన ఫలితం రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. అప్పుల బాధలతో అనేక ఇబ్బందులు పడుతున్న పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం కార్మికుడిని యజమాని చేయాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రకటించి సిరిసిల్లకే పరిమితం చేసిందని, ఆ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖలకు ఉపయోగపడే వస్త్రాలన్నింటిని రాష్ట్రంలో కార్మికుల చేత చేయించి ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రయత్నం చేయాలని కోరారు. టెక్స్టైల్ అఫరల్ పార్క్ నిర్మాణం వెంటనే పూర్తిచేసి ఉపాధి కల్పించాలని, పవర్లూమ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ ఎస్ ఐ పి ఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. త్రిఫ్ట్ పథకాన్ని చేనేత కార్మికుల తరహాలో పవర్లూమ్ కార్మికులకు కూడా డబుల్ డబ్బులు ఇవ్వాలని కోరారు.
పద్మనగర్ ఏరియా అధ్యక్షుడు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి యోగానందం పద్మనగర్ ఏరియా కార్యదర్శి సూరపల్లి భద్రయ్య కోశాధికారి వై ఆంజనేయులు, షేక్ జానీ సురేష్ ,గంజి చంద్రయ్య, వెంకన్న, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు
Dec 30 2023, 22:06