సూర్యాపేట: అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి:కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి
అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి
- కొత్తపల్లి శివకుమార్ సీపీఐ(ఎం.ఎల్)ప్రజాపంథా జిల్లా కార్యదర్శి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన అభివృద్ధి పనుల్లో అవినీతి పై ఎంక్వయిరీ కమిటీ వేసి సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి, అవినీతికి పాల్పడ్డ కాంట్రాక్టర్లను దానికి సపోర్టుగా నిలిచిన అధికారులను, గతంలో ఉన్న అధికార పార్టీ నాయకులను శిక్షించి అవినీతి సొమ్మును ప్రజలకు పంచాలని కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ విక్రమ్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గత ప్రభుత్వంలో తొమ్మిదిన్నర సంవత్సరాలలో అభివృద్ధి పేరుతో వందల కోట్లు ప్రజాధనాన్ని వృధా చేసి, కాంట్రాక్టర్లు అధికారులు కుమ్మక్కై అవినీతికి పాల్పడి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. ఈ పనులన్నీ ఒక్క శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చి అవినీతి కుంభకోణానికి మార్గమేశాల చేశారన్నారు. సూర్యాపేట కేంద్రంలో అభివృద్ధి పనులు జరిగేటప్పుడు వాటిని పరిశీలించి అనేకసార్లు మా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు,ధర్నాలు, పాదయాత్రలు చేశాము. దానికి మా పైన గత ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించారు. కానీ అవినీతి కాంట్రాక్టర్ పైన అధికారుల పైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లనే అభివృద్ధి పనులలో నాణ్యత లోపించి నాలుగు రోజుల కింద ఈ మధ్యన పోస్ట్ ఆఫీస్ దగ్గర రోడ్డు కుంగిపోవడం జరిగిందనీ తెలిపారు.అదేవిధంగా ట్యాంక్ బండ్ పనులు మొత్తం కూడా నాణ్యత లోపంతో ఉన్నాయి. ఇవే కాకుండా పట్టణ కేంద్రంలో జరిగిన ప్రతి అభివృద్ధి పనిలో నాణ్యత లోపం స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు.కాబట్టి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వీటిపైన సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి, అవినీతి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు, అధికారులను కటకటాలకు పంపించి శిక్షించాలని,దోచుకున్న సొమ్మును వెలికి తీసి ప్రజలకు పంచాలని మా పార్టీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు. లేనియెడల ముందు ముందు పోరాటాలను ధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐపికేఎంస్ రాష్ట్ర నాయకులు మట్టిపల్లి అంజయ్య, పిఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక,పిడిఎస్యు రాష్ట్ర సహయ ఎర్ర అఖిల్ కుమార్,పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య, లక్ష్మయ్య , నర్సయ్య, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి భూక్యా రాంజీ, పద్మ, జీవన్ తదితరులు పాల్గొన్నారు.
Dec 30 2023, 08:52