NLG: ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే బాలునాయక్ కు వినతి పత్రం
నల్లగొండ జిల్లా:
దేవరకొండ: ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మేల్యే నేనావత్ బాలునాయక్ కు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, మెస్ ఛార్జీలు విడుదల చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రామావత్ లక్ష్మణ్, బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 7792 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్స్ విడుదల చేయాలని సంక్షేమ హాస్టల్లో బకాయిలో ఉన్న మెచ్చార్జీలు విడుదల చేయాలని, తెలంగాణ నూతన ప్రభుత్వం పెంచిన మెస్ కాస్మోటిక్ చార్జీలు అమలు చేయాలని, మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద విద్యార్థులకు బస్ పాస్ ఉచితంగా అందించాలని, రాష్ట్రంలో అద్దె భవనాలలో ఉన్న గురుకులాలు కస్తూర్బాలు, సంక్షేమ హాస్టల్ లకు సొంతభవనాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు .హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు ట్రంక్ బాక్సులు పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు అందించాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కృష్ణ, అనిల్, కోటేష్, అఖిల్ సంతోష్, సాయి తదితరులు పాల్గొన్నారు.
Dec 29 2023, 22:42