అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి:తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. విజయలక్ష్మి
అంగన్వాడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
పి జయలక్ష్మి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నూతనంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంచడం ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి కోరారు
మంగళవారం దొడ్డి కొమరయ్య భవన్ ,లో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) నల్లగొండ జిల్లా కమిటీ సమావేశము జిల్లా అధ్యక్షురాలు పొడిశెట్టి నాగమణి అధ్యక్షత న జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వం సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను వెంటనే నూతన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని, అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు కార్యాలయాల దగ్గర ప్రాజెక్టు మీటింగులు సెక్టార్ మీటింగ్లో వలె మండలాల వారిగా జరపడం సరైనది కాదని, గతంలో వలే ప్రాజెక్టు మొత్తం ఒకే రోజు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఈ ప్రాజెక్టు మీటింగ్ లకు కనీస వసతులు కల్పించాలని కోరారు. అంగన్వాడీలకు 24 రోజుల సమ్మె కాలం వేతనాలు వెంటనే చెల్లించాలని, రెండో పిఆర్సి , ఐ అర్, అంగన్వాడి ఉద్యోగులకు వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీచేయాలని, రెండో పిఆర్సి ఫైనల్ చేసేటప్పుడు పేస్కేలు కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని కోరారు. రిటర్మెంట్ బెనిఫిట్ టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్లకు లక్ష ,ఆసరా పెన్షన్ 60 సంవత్సరాలు దాటిన వారికి విఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లించాలన్నారు కనీస వేతనాలు ఇతర సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తుందని తెలిపారు
సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహజ్యోతి మహాలక్ష్మి ఇందిరమ్మ ఇండ్లు పెన్షన్ రేషన్ కార్డులు ఆరోగ్యశ్రీ తదితర సంక్షేమ పథకాలు అంగన్వాడీ ఉద్యోగులకు వర్తింపచేయాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలకు హాజరవుతున్న అంగన్వాడీ ఉద్యోగులకు టీఏడీఏలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శ బి పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె. విజయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు అంబటి మణెమ్మ, మణిరూప, ప్రకృతాంబ, సునంద జి రాధాబాయి, రాశిదా ఏ.యాదమ్మ , బి శ్రీదేవి, కే సుదా లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు
Dec 29 2023, 08:22