TS: తెలంగాణ జట్టు కెప్టెన్ గా నల్గొండ పట్టణానికి చెందిన రాచూరి వెంకట సాయి
ఈనెల 28 వ తేదీ నుండి జనవరి 5వ తేదీ వరకు అండమాన్ నికోబార్ కేంద్ర పాలిత రాష్ట్రంలో జరిగే అండర్ 17 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయస్థాయి బాలుర ఫుట్బాల్ పోటీలకు నల్గొండ చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కు చెందిన రాచూరి వెంకట సాయి తెలంగాణ జట్టు కెప్టెన్ గా ఎన్నికైనాడని క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామం స్వస్థలమైన రాచూరి వెంకటసాయి చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్ శిక్షణలో మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో నిరంతరం క్రమశిక్షణ, పట్టుదల, సమయపాలన, పాటిస్తూ ఈ నెలలోనే జడ్చర్ల లోజరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ ను కనబరచడం ద్వారా SGF తెలంగాణ ఫుట్బాల్ జట్టుకు ఎంపిక కావడమే కాకుండా రాష్ట్ర జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడని తెలిపారు.
ఈ సందర్భంగా బొమ్మ పాల గిరిబాబు మాట్లాడుతూ.. ఎంపికైన రాచూరి వెంకట సాయి లో ఉన్న సహజమైన ఫుట్బాల్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తిస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి శ్రీ కుంభం రాంరెడ్డి గారికి మరియు SGF జాతీయ ఫుట్బాల్ జట్టు కోచ్ వడేన్న కు క్లబ్ తరఫున కృతజ్ఞతలు అని తెలిపారు.
ప్రస్తుతం నల్గొండ పట్టణంలోని దేవరకొండ రోడ్ లో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రాచూరి వెంకట సాయి గతంలో శ్రీనిధి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ క్లబ్ లో చేరి అక్కడ జాతీయ అంతర్జాతీయ కోచ్ ల సహకారంతో తన క్రీడా నైపుణ్యాన్ని అంచెలంచలుగా పెంపొందించుకొని, ఈ సంవత్సరం తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో జాతీయ BC రాయ్ ట్రోఫీ ఫుట్బాల్ పోటీల్లో కూడా పాల్గొనడం జరిగిందని తెలియజేస్తూ, రాచూరి వెంకట సాయి భవిష్యత్తులో కూడా నిబద్దతతో, క్రమశిక్షణ, నిరంతరం సాధనతో ముందుకు వెళ్తే తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత స్థాయి ఫుట్బాల్ క్రీడాకారుడిగా తయారయ్యే అవకాశం ఉందని బొమ్మపాల గిరి బాబు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఫుట్బాల్ క్రీడాకారులు, క్రీడాభిమానులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్ లు రాచూరి వెంకట సాయికి అభినందనలు తెలియజేశారు.
Dec 28 2023, 17:02