TS: చిక్కులు లేని భూమి హక్కులు దక్కాలి: భూమి చట్టాల నిపుణులు ఎం.సునీల్‌కుమార్
హైదరాబాద్: తెలంగాణా రెవెన్యూ అధికారుల సమావేశం లో భూమి సమస్యల పరిష్కార మార్గాలపై, ఆదివారం భూ చట్టాల నిపుణులు ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్ కుమార్) పాల్గొని మాట్లాడుతూ.. చిక్కులు లేని భూమి హక్కులు దక్కాలి అని అన్నారు.
భూమి అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే భూమి అని ప్రధానమైన భూ సమస్యను తీర్చకుండా ఏది కూడా పరిష్కారం కాదని భూమి సునీల్ కుమార్ పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలలో భూ సమస్యలు లేని దేశాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నట్టుగా తెలిపారు. భూ పరిపాలన గ్రామ స్థాయిలో ఉండాలన్నారు. భూమి హక్కులకు గ్యారంటీ కూడా గ్రామస్థాయి లోనే ఇవ్వాలన్నారు.
భూమి హద్దుల స్పష్టంగా, హక్కుల కల్పించే పత్రాలు పక్కాగా, హక్కుల మార్పిడి వెంటనే జరిగే వ్యవస్థ ఉండాలన్నారు. చిక్కులు వస్తే గ్రామ స్థాయిలోనే పరిష్కారం కావాలన్నారు.
భూమి హక్కులకు ప్రభుత్వమే గ్యారంటీ ఇవ్వాలన్నారు.
దస్తావేజుల రిజిస్ట్రేషన్ కాదు.. హక్కులకు రిజస్ట్రేషన్ కావాలన్నారు. పక్కనే ఉన్న ఏపీలో ఈ దిశగా చట్టం కూడా చేసుకున్నారని భూమి సునీల్ కుమార్ గుర్తు చేశారు.
Dec 25 2023, 07:40