NLG: మ్యాన్ ఆఫ్ ద మిలియనియం పద్మశ్రీ కళ్యాణ సుందరం ను కలిసిన గ్రంథ పాలకుడు దుర్గాప్రసాద్
నల్లగొండ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాల గ్రంథపాలకుడు డాక్టర్ దుర్గాప్రసాద్.. నేడు చెన్నైలో పద్మశ్రీ అవార్డు అందుకున్న పలని కళ్యాణ సుందరం (మ్యాన్ ఆఫ్ మిలియనియం) ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ.. కళ్యాణ సుందరం 36 సంవత్సరాలు గ్రంథ పాలకులుగా గ్రంధాలయ సమాజ సేవ చేసి పదవి విరమణ పొందారు. వారు పదవీ విరమణ తరువాత వచ్చిన 18 లక్షల రూపాయలను అనాధాశ్రమాలకు, పేదల విద్య కోసం దానం చేశారు. అమెరికా ప్రభుత్వం ఇతను చేసిన సేవకు గాను మ్యాన్ ఆఫ్ మిలీనియం అవార్డును కళ్యాణ సుందరం కు బహుకరించింది. అప్పటి అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్ తను చేసిన సేవకు మన దేశానికి వచ్చి క్యాష్ 30 కోట్ల రూపాయలను బహూకరించారు. కళ్యాణ సుందరం గారి అమ్మ చెప్పినట్లుగా ఎప్పుడు సహాయం చేయాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి, సమాచార మరియు విద్యకు సేవలో పాటుపడాలని చెప్పిన నినాదంతో వారు సర్వీస్ లో ఉన్నప్పుడు మరియు రిటైర్ అయిన తర్వాత కూడా శాలరీని పేదలకు అనాధాశ్రమాలకు దానం చేశారు.
అమెరికా ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం కూడా దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి అనాధాశ్రమాలయాలకు వారు దానం చేశారు. ఇతని గ్రంథాలయ సేవలను చూసి భారత ప్రభుత్వం జనవరి 2023 లో పద్మశ్రీ అవార్డును బహుకరించింది. అవార్డును ఇండియన్ ప్రెసిడెంట్ ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా స్వీకరించడం జరిగింది. ఇప్పుడు కళ్యాణ సుందరం వయస్సు 85, యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా అవుట్ స్టాండింగ్ పర్సన్స్ ని 17 మందిని ఎంపిక చేయగా ఆసియా ఖండం నుంచి ఎంపికైన ఏకైక సమాజ సేవ సమాచార సేవకుడు కల్యాణ సుందరం అని తెలిపారు.
కళ్యాణ సుందరం జీవిత చరిత్రను తెలుగులో రాస్తున్నానని కళ్యాణ సుందరంను వ్యక్తిగతంగా కలిసి.. బాల్యం, తన విద్య, గ్రంథాలయ సేవ, సమాజ సేవ లను తెలుసుకున్నానని, వారిని కలవడం ద్వారా ఎంతో స్ఫూర్తిని పొందానని, వారి యొక్క జీవితం భారతదేశ ప్రజలందరికీ కూడా ఒక సందేశం. ఒక సందేశాత్మకంగా సమాజంలో ఒకరికొకరికి సహాయంలో తోడ్పడటంలో విద్యాభివృద్ధిలో వారి సేవ ఎంతగానో ఉపయోగపడిందని డాక్టర్ ఆనంద్ దుర్గాప్రసాద్ తెలిపారు.
Dec 24 2023, 21:24