TS: సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని స్వాగతించిన ఉస్మానియా యూనివర్సిటీ మలిదశ ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుకుందామని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ మలిదశ ఉద్యమకారిణి డాక్టర్ రేష్మ హుస్సేన్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో 2010లో రాష్ట్ర సాధన కోసం మలిదశ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో బుల్లెట్ గాయాలపాలైన రేష్మ హుస్సేన్ (బుల్లెట్ రాణి) ఆదివారం మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినారు. ఆ నిర్ణయాన్ని ఉస్మానియా మలిదశ ఉద్యమకారినిగా ఆమె స్వాగతిస్తున్నట్లు, యువత పెడదారి పడకుండా పాఠశాల, కళాశాల మరియు సమాజంలో డ్రగ్స్ ను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని.. యాంటీ డ్రగ్స్ టీం గా కొంతమంది యువకులు స్వచ్ఛందంగా పనిచేసి డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని, యూత్ నిర్దిష్ట లక్ష్యం ఏర్పరచుకొని సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
Dec 24 2023, 16:27