NLG: ఎన్జీ కళాశాలలో నేషనల్ మ్యాథమేటిక్స్ డే సెలబ్రేషన్స్
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకొని గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస్ రామానుజన్ 136వ జయంతి వేడుక ను కళాశాల గణిత విభాగం ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ప్రిన్సిపల్ ఉపేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా గణిత శాస్త్ర విభాగాధిపతి నక్క నరసింహ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రామానుజన్ తమిళనాడులో పుట్టి, అతి పేద స్థాయి నుంచి వారు భారతదేశం గర్వపడేలా గణిత మేధావిగా ఎంతో కృషి చేశారని, తన జయంతి ని భారత ప్రభుత్వం అధికారికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 22 రోజున నిర్వహించుకుంటున్నామని, వారు గణితశాస్త్రంలో ముఖ్యంగా సంఖ్యా శాస్త్రము, గణిత విశ్లేషణ, అనంత శ్రేణులు, అవిరామ భిన్నాలు లాంటి గణిత విభాగాలలో విశేష కృషి చేశారని, ముఖ్యంగా రామానుజన్ నంబర్ 1729 ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని, ప్రస్తుతం మానవ సమాజంలో గణితం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉందని అదేవిధంగా పోటీ పరీక్షల్లో కూడా వీటి పైన ప్రత్యేకంగా ప్రశ్నలు వస్తాయని వారు చేసినటువంటి గణిత శాస్త్ర అభివృద్ధికి చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకొని, కంపిటేషనల్ మ్యాథమెటిక్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంకా ఎన్నో పరిశోధనలు కొనసాగించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ సయ్యద్ మునీర్, అధ్యాపకులు యాదగిరి రెడ్డి, దీపిక , జ్యోత్స్న, దుర్గాప్రసాద్, మధుకర్, కనకయ్య, రజిని, బాల, సిద్దేశ్ ,వెంకటేష్, కృష్ణ, సరిత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
Dec 24 2023, 15:55