నల్లగొండ:కేంద్ర ప్రభుత్వం మెడికల్ సేల్స్ రిప్రజెంటిటీస్ హక్కుల రక్షణ కోసం 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ కచ్చితంగా అమలుచేయాలి: సిఐటియు
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
1976 సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి
మందుల ధరలు తగ్గించాలి
కేంద్ర ప్రభుత్వం మెడికల్ సేల్స్ రిప్రజెంటిటీస్ హక్కుల రక్షణ కోసం 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ కచ్చితంగా అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు
బుధవారం మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ అఖిలభారత పిలుపుమేరకు ఒక రోజు సమ్మె సందర్భంగా పెదగడియారం సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్ యూనియన్ (సీఐటీయూ )నల్గొండ బ్రాంచ్ అధ్యక్షులు చెరుపల్లి నిరంజన్ అధ్యక్షతన జరిగిన సభకు ధర్నా కు హాజరై వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి కుట్రా చేస్తుందని ఆరోపించారు. 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ మెడికల్ రిప్స్ కి కచ్చితంగా అమలు జరపాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటిటీవ్ లకు పనివేళలు, ఉద్యోగ భద్రత కనీస వేతనాలు ఇతర సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చట్టబద్ధ పని విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. జిపిఎస్ విధానం తీసుకొచ్చి మెడికల్ రిప్రజెంటిటీస్ వ్యక్తిగత గోప్యత ను హరించడం సరికాదని అన్నారు. డాక్టర్స్ ని కలవడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ వెళ్లడం నిషేధించడం సరికాదని అన్నారు ప్రజలందరికీ నిత్యవసర వస్తువుగా మారిన మందుల ధరలు పెంచడం వాటిపై జిఎస్టి విధించడం తో సామాన్యులు మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్న విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోని మందులపై జిఎస్టి వేత్తివేసి సామాన్యులకు మందుల ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
డ్రగ్గిస్ట్ అండ్ కెమిష్టి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి పరమాత్మ, హోల్ సేల్ వింగ్ కన్వీనర్ వళ్ళందాస్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాపోలు లక్ష్మీ నారాయణ హాజరై మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీటివ్ యూనియన్ చేసే పోరాటాలు న్యాయసమతమైన అని మీ పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. కార్మికుల సమస్యలతో పాటు ప్రజల డిమాండ్ ను పెట్టి పోరాడడం అభినందనీయమని అన్నారు.
సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి పరిపూర్ణాచారి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ , టీ ఎం ఎస్ ఆర్ యు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ కోటా సుధాకర్ పాల్గొని ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీటివ్స్ చేసే పోరాటాలకు తమ సంఘాల మద్దతు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేనియెడల ప్రజా పోరాటాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ధర్నా అనంతరం పెద్ద గడియారం నుండి యన్ జి కాలేజ్, రామగిరి, ప్రకాశం బజార్, డాక్టర్స్ కాలనీ, ప్రభుత్వా హాస్పిటల్, బస్టాండ్ మీదుగా సిఐటియు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది
ఈ ధర్నా కార్యక్రమంలో టీఎంఎస్ ఆర్ యు నల్గొండ జిల్లా బ్రాంచ్ అధ్యక్షులు చెరుపల్లి నిరంజన్ ప్రధాన కార్యదర్శి రావుల రవికుమార్ కోశాధికారి పోలా రమేష్, ఉపాధ్యక్షులు సిహెచ్ మహేష్ గౌడ్ సిహెచ్ అనిల్ కుమార్ ఉప కార్యదర్శిలు సోమస్వామి పోలిశెట్టి జీవన్ కుమార్, కార్యవర్గ సభ్యులు మరియు 150 మంది కార్మికులు పాల్గొన్నారు.
Dec 24 2023, 08:12