NLG: మృత కుటుంబానికి పగడాల ముత్తు అండ.. పదివేలు ఆర్థిక సహాయం
నల్లగొండ జిల్లా,మర్రిగూడ మండలం వట్టిపల్లి గ్రామానికి చెందిన తుప్పరి మహాలక్ష్మి (అమ్ములు) (14) తీవ్రమైన డెంగ్యూ జ్వరంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచింది. ఆ చిన్నారి మృతితో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఎదిగిన కూతురి మరణం గ్రామ ప్రజల చేత కూడా కంటతడి పెట్టించింది. తండ్రి తుప్పరి సత్తయ్య వికలాంగుడు కావడంతో ఆర్థిక సమస్యలు ఉన్నట్లు సహచరుల ద్వారా సమాచారం తెలుసుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు.. బాధిత కుటుంబాన్ని అక్కున చేర్చుకున్నారు. అంతిమ సంస్కారాలు నిర్వహించుటకు గాను రూ. 10,000/- పదివేలు మృతురాలి తండ్రికి అందించారు. భవిష్యత్తులో ఏ ఇబ్బంది ఉన్నా తనను సంప్రదించాలని కోరారు. దిక్కు తోచని వారి కుటుంబానికి బాసటగా నిలిచిన పగడాల ముత్తు కు ఆ గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. ఫౌండేషన్ వైస్ ఛైర్మెన్ మాడ్గుల శిరీష, ట్రెజరీ పగడాల కళ్యాణ్, మొగిలి కిషన్, ఉప సర్పంచ్ శ్రీను, పాపయ్య, జాల గణేష్, తదితరులు ఉన్నారు.
Dec 22 2023, 13:27
నల్లగొండ జిల్లా : మునుగోడు మండలం, చీకటి మామిడి గ్రామంలో స్వచ్చందంగా బెల్టుషాపులు మూసి వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గ్రామస్థులు. గ్రామాల్లో బెల్టుషాపుల వల్ల యువత మద్యానికి బానిసలుగా మారుతున్నారన