TS: సంద శ్రీదేవికి బిజినెస్ మేనేజ్మెంట్ లో డాక్టరేట్
నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం, ఇనుపాముల గ్రామానికి చెందిన సంద శ్రీదేవి పీహెచ్డీ పట్టా పొందారు. పీజీ లో ఎంబీఏ పూర్తి చేసిన ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొ. సంపత్ కుమార్ పర్యవేక్షణలో బిజినెస్ మేనేజ్మెంట్ లో "Barriers to career Advancement for women in IT industres" అనే అంశంలో పరిశోధన గ్రంథాన్ని సమర్పించినందుకు సంద శ్రీదేవికి పీహెచ్డీ అవార్డును ప్రధానం చేశారు.
అంతేకాకుండా సంద శ్రీదేవి తన పీహెచ్డీ పరిశోధనలో భాగంగా.. దుబాయ్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు సంద శ్రీదేవిని అభినందిస్తున్నారు.
ఈ సందర్భంగా సంద శ్రీదేవి మాట్లాడుతూ.. ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించి, ఉన్నత ఆశయాలను ఏర్పరచుకొని.. లక్ష్యం కోసం అనునిత్యం కృషి చేస్తే సాధించలేనిది ఏమీ లేదు అని అన్నారు. తాను రాసిన పరిశోధన గ్రంథాన్ని యుక్త వయసులోనే ప్రమాదంలో చనిపోయిన తన అన్న జ్ఞాపకార్ధంగా సంద నాగార్జున కు అంకితమిస్తున్నట్లు తెలిపారు.
ఒకే కుటుంబంలో ఇద్దరికీ పిహెచ్డి
పేదరికంలో పుట్టి పెరిగిన ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు పిహెచ్డి పట్టా పొందడం విశేషం. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల మారుమూల గ్రామంలోని సంద బాలయ్య, తేరోజమ్మ దంపతుల 5వ కూతురు సంద శ్రీదేవి.. ఆమె అక్క సంద రజిత ను ఆదర్శంగా తీసుకొని పిహెచ్డి పొందారు.
సంద బాలయ్య, తేరోజమ్మ దంపతుల రెండవ కూతురు సంద రజిత 11 సంవత్సరాల క్రితమే ఎర్త్ సైన్స్ లో పిహెచ్డి పట్టా, అదేవిధంగా 6 సంవత్సరాల క్రితం పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందారు. అంతేకాకుండా ఈమె తన పోస్ట్ పిహెచ్డి పరిశోధనలో భాగంగా జపాన్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో ఉపన్యాసించారు.
మారుమూల గ్రామంలో పేదరికంలో పుట్టి పెరిగి ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కళాశాలలో చదివిన వారు.. ఉన్నతమైన ఆశయం కోసం, అత్యున్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో, కష్టపడి చదివి పీహెచ్డీ డాక్టరేట్ పురస్కారాన్ని పొందారు. ఈ సందర్భంగా వారు ఉన్నత లక్ష్యాలను చేరాలనుకునే ఎందరో పేదింటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారు.
Dec 21 2023, 19:57