TS: ఒరిజినల్ గుర్తింపు కార్డు ఉంటేనే ఉచిత ప్రయాణం: సజ్జనార్
తెలంగాణలోని కొన్ని డిపోలకు చెందిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ లతో ఆర్టీసీ ఎం.డి సజ్జనార్ బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఎం.డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కు మంచి స్పందన వస్తోంది.ఈ పథకాన్ని మహిళలు,బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు పెద్ద ఎత్తున ఉపయోగించుకుంటున్నారు.
కొందరు మహిళలు తమ ప్రయాణ సమయంలో గుర్తింపు కార్డులు తీసుకు రావడం లేదని సంస్థ దృష్టికి వచ్చింది. గుర్తింపు కార్డుల ఫొటో కాపీలను తెస్తున్నారని, స్మార్ట్ ఫోన్‌లలో సాప్ట్ కాపీలు చూపిస్తున్నారని తెలిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆధార్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర గుర్తింపుకార్డు లలో ఏదో ఒకటి ఒరిజినల్ చూపించి జీరో టికెట్లను తీసుకోవాలని మహిళలను కోరుతున్నట్లు తెలిపారు.
జిరాక్స్ కాపీలు, స్మార్ట్ ఫోన్ల లో ఐడీలు చూపిస్తే ఉచిత ప్రయా ణానికి అనుమతి ఉండదు. గుర్తింపు కార్డుల్లోనూ ఫొటో లు స్పష్టంగా కనిపించాలి. చాలా మంది ఆధార్ కార్డుల్లో చిన్నతనం నాటి ఫొటో లు ఉన్నాయి. వాటిని అప్ డేట్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలకే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల మహిళలు విధిగా చార్జీలు చెల్లించి టికెట్ తీసుకోవాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు.









తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రస్తుతం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 72,658 కోట్లు ఉండగా, పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగినట్లు శ్వేత పత్రం ద్వారా తెలిపింది. రెవిన్యూ రాబడి ద్వారా రుణాల చెల్లింపు భారం 34 శాతం, ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కొరకు 35 శాతం కేటాయించినట్లు పేర్కొంది.
Dec 21 2023, 14:01
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
33.8k