TS: ఆర్టీసీ బస్సుల్లో ఒకే రోజులో 51.74 లక్షల మంది ప్రయాణం
తెలంగాణలో ఆర్టీసీ బస్సులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆర్టీసీ బస్సులు మునుపటి లాగా జనంతో కిక్కిరిసిపోతున్నాయి.
ముఖ్యంగా మహాలక్ష్మి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండడంతో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ లలో సీట్లు దొరకని వారు నిలుచుని మరీ ప్రయాణం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య పెరిగింది.
మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత సోమవారం రోజు రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఏకంగా 51.74 లక్షల మంది ప్రయాణాలు చేశారు.
వీరిలో 30.16 లక్షల మంది మహిళలు కావడం గమనార్హం.







తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రస్తుతం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 72,658 కోట్లు ఉండగా, పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగినట్లు శ్వేత పత్రం ద్వారా తెలిపింది. రెవిన్యూ రాబడి ద్వారా రుణాల చెల్లింపు భారం 34 శాతం, ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కొరకు 35 శాతం కేటాయించినట్లు పేర్కొంది.


Dec 20 2023, 21:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
26.0k