సైదాపూర్: ఓటు నమోదు పై బిఎల్వోలకు శిక్షణ
సిద్దిపేట జిల్లా, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని సైదాపూర్ మండల పరిధిలోని ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తదితర విషయాలపై బుదవారం బూత్ లెవెల్ ఆఫీసర్స్, సూపర్వైజర్ లకు శిక్షణ కార్యక్రమం మండలం తహసీల్దార్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ దూలం మంజుల మాట్లాడుతూ.. భారత రాజ్యాంగంలోని అధికరణ 324, 325, 326 ప్రకారము ఎన్నికల సంఘ నియమావళిని అనుసరించి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని,అర్హత కలిగిన ఏ ఒక్కరిని ఓటరుగా నమోదు చేయకుండా ఉండడం అనేది రాజ్యాంగ విరుద్ధమన్నారు.
స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్-2) ఏర్పాటు చేసి బిఎల్ఓ లకు మాస్టర్ ట్రైనర్ల చే శిక్షణ ఇవ్వడం జరిగిందని, ప్రతి బిఎల్ఓ తమ ప్రాంతంలో ఉన్న అన్ని విషయాలపై సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉండి ఫామ్ 6,7,8 లకు సంబంధించిన ఓటర్ల నమోదు పై అవగాహన ఏర్పరచుకొని క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తప్పులు లేని ఓటర్ల జాబితాను నమోదు చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ మల్లేశం, సీనియర్ అసిస్టెంట్ మమ్మద్ నదీం, ఆర్ ఐ శరత్, జూనియర్ అసిస్టెంట్ రాజు, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది విక్రమ్ రెడ్డి, రవి రాజు, రాధిక, సూపర్వైజర్లు, బిఎల్ఓ లు పాల్గొన్నారు.






తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రస్తుతం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 72,658 కోట్లు ఉండగా, పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగినట్లు శ్వేత పత్రం ద్వారా తెలిపింది. రెవిన్యూ రాబడి ద్వారా రుణాల చెల్లింపు భారం 34 శాతం, ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కొరకు 35 శాతం కేటాయించినట్లు పేర్కొంది.




Dec 20 2023, 20:34
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
25.8k