TS: పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగింది: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము
సంస్కృతి సంప్రదాయాల్లో చేనేత ఒకటని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము అన్నారు. శీతాకాల విడిది సందర్భంగా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి, నేడు యాదాద్రి జిల్లా పోచంపల్లి లో పర్యటించారు. ఈ సందర్భంగా పోచంపల్లి లో ఫేమస్ అయిన చేనేత పరిశ్రమ గురించి ఆమె తెలుసుకున్నారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే సంతోషం కలిగిందని.. తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తుందని కొనియాడారు.
పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావడం.. యూఎన్ఏ భూదాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమన్నారు. చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందన్నారు. చేనేత వస్త్రాల కృషి గొప్పదని కొనియాడారు. ప్రభుత్వం ద్వారా చేనేత కళాకారులకు మద్దతు దొరుకుతుందని, చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత వృత్తులను కాపాడుకోవాలని, చేనేత రంగ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మాటిచ్చారు. మా ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.





తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది. ప్రస్తుతం మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు ఉన్నట్టు పేర్కొంది. తెలంగాణ ఏర్పడే నాటికి రూ. 72,658 కోట్లు ఉండగా, పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగినట్లు శ్వేత పత్రం ద్వారా తెలిపింది. రెవిన్యూ రాబడి ద్వారా రుణాల చెల్లింపు భారం 34 శాతం, ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కొరకు 35 శాతం కేటాయించినట్లు పేర్కొంది.





Dec 20 2023, 20:24
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
17.8k