హైదరాబాద్; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి: హరీష్ రావు
హైదరాబాద్; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది.. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు.. ఈ నివేదికను ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో తయారు చేయించారు.. సీఎం గురువు దగ్గర పనిచేసిన మాదీ అధికారులతో ఈ నివేదిక వండివార్చినట్లు ఆధారాలున్నాయి.. నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదు.. అప్పులు పెరిగాయంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనడం అబద్ధం.. గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పే తప్పుడు ప్రయత్నం ఇది.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు రావు.. రూ.72 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు ఇచ్చాం.. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇవి శ్వేతపత్రాలా? హామీలు ఎగ్గొట్టేందుకు వేస్తున్న ఎత్తుగడలా?. -హరీశ్‌రావు
Dec 20 2023, 19:53