తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, శ్రీవారి వైకుంఠ దర్శనం ఎప్పటినుండి అంటే...
తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 23న వేకువజామున నుంచి భక్తులకు శ్రీవారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సామాన్యులు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాటు పూర్తిచేసింది. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు.
Dec 20 2023, 14:04