TS: టాలెంట్ ఆఫ్ ది ఇయర్ 2023లో.. పది రికార్డులు సొంతం చేసుకున్న దళిత రత్న బుర్రి వెంకన్న
నల్గొండ జిల్లా, పిఏ పల్లి మండలం, దుగ్యాల గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, దళిత రత్న బుర్రి వెంకన్న.. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ తో 10 వరల్డ్ రికార్డ్స్ అవార్డ్స్ ల పురస్కారాలను మయూరి ఆర్ట్స్ ద్వారా అందుకున్నారు.
హైదరాబాదులోని భారతీయ విద్యా భవన్ లో మయూరి ఆర్ట్స్ అధినేత రాధా మరియు దత్తు నేతృత్వంలో, టాలెంట్ ఆఫ్ ది ఇయర్ 2023 కార్యక్రమంతో
ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్,
ఇంటర్నేషనల్ కోహినూర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్,
ఇంటర్నేషనల్ డైమండ్ వరల్డ్ రికార్డ్,
ఇంటర్నేషనల్ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్,
ఇంటర్నేషనల్ జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్,
ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డు,
ఇంటర్నేషనల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్,
ఇంటర్నేషనల్ విశ్వం వరల్డ్ రికార్డ్,
ఇంటర్నేషనల్ స్టేట్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియా,
ఇంటర్నేషనల్ ప్లాటినం బుక్ ఆఫ్ రికార్డ్స్ తో
మయూరి ఆర్ట్స్ ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ స్థాయిలో చరిత్రను సృష్టిస్తూ.. అత్యున్నత స్థాయిలో ప్రతిష్టాత్మకంగా, ఈ పది వరల్డ్ రికార్డ్స్ గౌరవ పురస్కార అవార్డులు 290 మందికి వివిధ రంగాలలో ప్రతిభ మరియు సేవలను అందిస్తున్న వ్యక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డా. లైన్ సాయి వెంకట్, సీనియర్ తెలుగు సినిమాల ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్ డా. బింగి నరేందర్ గౌడ్ ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇండియన్ చీప్ కోఆర్డినేటర్, డా.సుభాషిని హైకోర్టు సీనియర్ న్యాయవాది విశ్వం వరల్డ్ రికార్డ్ కోఆర్డినేటర్ సాయి ప్రియ గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్ చీఫ్ కోఆర్డినేటర్ ల చేతుల మీదుగా.. దళిత రత్న బుర్రి వెంకన్న ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర శాఖ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా, నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు, మహనీయులను స్ఫూర్తిగా తీసుకొని వారి జయంతి కార్యక్రమాల ద్వారా చరిత్ర పోరాటాలను సమాజానికి పరిచయం చేస్తూ, ప్రజా హక్కుల పరిరక్షణ కొరకు న్యాయబద్ధంగా పోరాట కార్యక్రమాలు, అంబేద్కర్ ఆశ సాధన కోసం సామాజిక ఉద్యమ కార్యక్రమాలు, నిర్వహిస్తున్నందుకు గాను, గతంలో దళిత రత్న అవార్డు మరియు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డు లను అందుకొని ముందుకెళుతున్న బుర్రి వెంకన్న సేవా కార్యక్రమాల్ని పరిశీలించి.. ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు తో పది వరల్డ్ రికార్డ్స్ గౌరవ అవార్డు పురస్కారాన్ని వెంకన్న కు అందించి ఘనంగా సన్మానించారు. ఈ అవార్డ్స్ ను అందుకున్న దళిత రత్న బుర్రి వెంకన్న సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ అవార్డ్స్ అందించిన మయూరి ఆర్ట్స్ సంస్థ వారికి వివిధ వరల్డ్ రికార్డ్స్ అధినేత లకు అభివందనాలతో కృతజ్ఞతలు తెలిపారు.
Dec 20 2023, 11:02