నల్లగొండ:డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు స్వాధీన పరచాలి:సిపిఎం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు స్వాధీన పరచాలి-------- సిపిఎం
అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించి డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబల్ బెడ్రూమ్ ఇల్లు స్వాధీన పరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 2017లో 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా గత ప్రభుత్వం వదిలి వేసిందని అన్నారు. నిర్మాణం పూర్తయిన మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ స్వాధీనపరచలేదని అన్నారు. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తిచేసి డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే స్వాధీన పరచాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో వేలాదిమంది ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న పేదలను గుర్తించి ప్రభుత్వం కొనుగోలు చేసి మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఇంటి స్థలం ఇస్తూ పేదలందరికీ ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
*సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, మైల యాదయ్య మధుసూదన్ రెడ్డి, అరుణ, లింగమ్మ, మారగొని నగేష్, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Dec 18 2023, 08:04