చర్ల మండలంలో జనాభా ప్రాతిపదికన మీసేవ కేంద్రాలని పొడిగించాలని న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
చర్ల మండలంలో జనాభా ప్రాతిపదికన మీసేవ కేంద్రాలని పొడిగించాలని న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
చర్ల మండలంలో సుమారు 50 వేల మంది జనాభాకు రెండు మీసేవ కేంద్రాలు నడిపిస్తున్నారని దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చర్ల మండలంలో మీసేవ కేంద్రాలను పెంచాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మండల్ నాయకులు చిరిగిరి నరేష్ లు మాట్లాడుతూ 50వేల జనాభా గలిగిన చర్ల మండలంలో రెండే మీసేవ కేంద్రాలు ఉండటంతో విద్యార్థుల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఆధార్ అప్డేట్ చేయించుకోవడం సర్టిఫికెట్లు అప్లై చేయడం, ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడం ఏదైనా మీ సేవ కేంద్రాల లోనే చేయించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకి 500 నుండి 1000 మంది వరకు లైనులు కట్టి పనులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. కావున మండల అధికారులు స్పందించి మీసేవ కేంద్రాలను పొడిగించే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. విద్యార్థులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఈ మండల అధికారులకు ఉన్నదని తెలియజేస్తున్నాం కావున స్పందించి మీసేవ కేంద్రాలను పొడిగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ గా కోరుతున్నామని ఈ సమస్యలను పరిష్కరించని యెడల ఉన్నతాధికారులకు నేరుగా ఈ సమస్యలను తెలియజేయాల్సి వస్తుందని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ మండల నాయకులు కనితి భాను ప్రకాష్ బుర్ర సమ్మక్క సబ్కా నాగలక్ష్మి పోడియం రామలక్ష్మి కురసం సమ్మక్క కల్లూరు భవాని అలవాల రమేష్ చిట్టి తదితరులు పాల్గొన్నారు
Dec 17 2023, 19:29