/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png
ఇకపై భారత్ పర్యాటకులు వీసా లేకుండానే ఇరాన్ లో పర్యటించవచ్చు!
భారతీయ పర్యాటకులు ఇకపై వీసా లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
భారత్ నుండి వచ్చే పర్యాటకుల వీసా నిబంధనలను ఏకపక్షంగా రద్దు చేయాలని ఇరాన్ క్యాబినెట్ నిర్ణయించింది.
TS: సీఎం కాన్వాయ్ తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దు: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
హైదరాబాద్: సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు.
సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించి, తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బంది కలవకుండా ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ పోలీస్ అధికారులకు సూచించారు.
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తాను ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సీఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంట్లో కూర్చోవడం తనకు సాధ్యం కాదని సీఎం రేవంత్ అన్నారు.
TS: ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నియామకం
తెలంగాణ ప్రభుత్వం నలుగురు ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్ లుగా నియమించింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్ లను ప్రభుత్వ విప్ లుగా నియమించింది.
TS: కొత్తగా ఇల్లు నిర్మించుకునే పేదలకు ఐదు లక్షలు, ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు: గవర్నర్
తెలంగాణలో కొత్త ఇల్లు నిర్మించుకునే పేదలకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని గవర్నర్ తమిళసై తెలిపారు. అదేవిధంగా కొత్తగా ఇల్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. అసైన్డు, పోడు భూములకు త్వరలోనే పట్టాలు పంపిణీ చేస్తామని గవర్నర్ తెలిపారు.
కాలేశ్వరం, మేడిగడ్డ, అన్నారం మ్యారేజీల్లో అవినీతిపై విచారణ జరిపిస్తామని గవర్నర్ తమిళసై అన్నారు.
కృష్ణా జలాలలో రాష్ట్రానికి దక్కాల్సిన వాటా సాధనకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. అమరవీరుల కుటుంబాలకు 250 చ.గజాల ఇంటి స్థలం, గౌరవభృతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు
శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని గమనించిన దక్షిణ మధ్య రైల్వే గురువారం సాయంత్రం కీలక నిర్ణయం తీసుకుంది.
అయ్యప్ప భక్తుల సౌకర్యార్ధం వందే భారత్ రైలు ను నడపాలని నిర్ణ యించింది.వారంలో రెండు రోజులు పాటు చెన్నై- కొట్టాయం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలును నడుపుతున్నట్టు ప్రకటించింది.
వందే భారత్ రైలు (06151 నెంబరు) డిసెంబరు 15, 17,22, 24 తేదీల్లో చెన్నై నుంచి, డిసెంబరు 16,18, 23,25 కొట్టాయం నుంచి బయలుదేరుతుంది.
డిసెంబర్ 15, 17, 22, 24 తేదీల్లో చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి నుంచి తెల్లవారు జామున 4.15గంట లకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 4.15 గంటలకు కొట్టాయం చేరుకోనుంది.
తిరుగు ప్రయాణంలో ఇదే వందేభారత్ శబరి రైలు డిసెంబర్ 16, 18, 23, 25 తేదీల్లో కొట్టాయం నుంచి ఉదయం 4.40 గంటలకు బయల్దేరి అదే రోజు సాయంత్రం 5.15 గంటలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు పేర్కొన్నారు.
కాట్పడి, సేలం, పాలక్కడ్, అలువా స్టేషన్లలో ఈ రైలుకు స్టాపులు ఉంటాయని తెలిపారు.
TS: మేడారం జాతరకు ఏర్పాట్లు
రూ. 75 కోట్ల నిధులు మంజూరు
ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం జాతర
జాతర ఏర్పాట్లపై త్వరలో మంత్రుల సమీక్ష.
TS: తెలంగాణలో నేటి నుండి జీరో టికెట్.. ఆధార్ కార్డు తప్పనిసరి
తెలంగాణలో ప్రభుత్వం.. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం.. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో నేటి నుండి జీరో టికెట్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ పథకం వల్ల ఆర్టీసీ నష్టపోయే ఆదాయాన్ని ప్రభుత్వం రియంబర్స్మెంట్ ద్వారా సమకూర్చనుంది. బస్సు ప్రయాణాలలో మహిళలు కండక్టర్ కు తప్పనిసరిగా ఆధార్ లేదా అందుకు సమానమైన గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రాంతం వాళ్లకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. సంబంధిత గుర్తింపు కార్డు జిరాక్స్ చూపించిన సరిపోతుందని అధికారులు తెలిపారు.
నల్లగొండ: ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు.. ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థి ఎంపిక
నల్లగొండ పట్టణం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కు చెందిన విద్యార్థిని అక్షిత.. చదరంగంలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కు ఎంపిక కాబడిందని కళాశాల ఇన్చార్జి ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. రాజారామ్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గన్ శ్యామ్ మరియు అధ్యాపకులు ఆమెను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
TS: మహాలక్మి పథకం వల్ల లాభాలు: ప్రొఫెసర్ నాగేశ్వర్
మహిళలకు, ఆడపిల్లలకు బస్సులో ఉచిత ప్రయాణం తో ప్రైవేట్ వెహికల్స్, సొంత వెహికల్స్ ను తగ్గించే అవకాశం ఉంది. దాంతో పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గనుంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
మహిళలకు రక్షణ ఉండే అవకాశం ఉంది.
పెట్రోల్, డీజిల్ ఖర్చు తగ్గటం తో తెలంగాణ కుటుంబాలకే కాదు దేశానికి కూడా పరోక్షంగా మేలు జరిగే అవకాశం ఉంది.
ఇక దీని నిర్వహణకయ్యే ఖర్చు
రైతుబంధు మొత్తం 1 కోటి 43 లక్షల ఎకరాల భూమికి ప్రతి ఆరు నెలలకు చెల్లించే 7 వేల కోట్ల 15 లక్షల రూపాయలు అయితే ఇందులో కేవలం సాగు యోగ్యమైన భూమి 53 లక్షల 51 వేల ఎకరాలు మాత్రమే దీనికి 2 వేల కోట్ల 67 లక్షలు మాత్రమే ఖర్చవుతుంది ఇక దున్నే భూమికే గనక మనం రైతుబంధు ఇచ్చినట్లయితే దాదాపుగా 4000 కోట్ల రూపాయలు రైతుబంధు ద్వారా మిగులుతుంది.
ఇక మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా రోజుకు 4 కోట్లు అంటే నెలకు 120 కోట్లు 6 నెలలకు కేవలం 720 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. పైగా దీని ద్వారా మహిళా ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులకు సగటున నెలకు 2000 నుండి 7000 రూపాయల వరకు ఆదా అవుతుంది.
Dec 15 2023, 22:09