చర్ల:మీచౌంగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
మీచౌంగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
గత వారం రోజుల కిందట కురిసిన మీచౌoగ్ తుఫాను వలన నష్టపోయిన మిర్చి రైతులని ఆదుకోవాలని కౌలు రైతులకి నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మండల నాయకులు కనితి భాను ప్రకాష్ నష్ట పోయిన మిర్చి పంటలను పరిశీలించారు అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు చర్ల మండలంలోని ఉన్న వున్న మిర్చీ పంటలు తుఫాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలన చేయడం జరిగిందని అన్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాత్రింబవళ్లు కష్టపడి వడ్డీలకి అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టుకున్న మిర్చి పంటలు తుఫాను కారణంగా ఒక్కసారి నేలమట్టం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు కష్టపడి సాగు చేసుకున్న పంట ఒక్కసారి నేలమట్టం కావడంతో రైతు ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ప్రభుత్వమే రైతులను అదుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేశారు అధికారులు తక్షణమే దెబ్బతిన్న పంటలను సర్వే చేయాలని కౌలు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మిర్చి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు దేశానికి వెన్నుముక ఆ రైతే అని ప్రలాభాలు పలకటం కాదు ఈ ప్రభుత్వాలు నేల రాలుతున్న ఈ రైతన్నల పంటలను చూసి ఎందుకు ఈ ప్రభుత్వాలు చలిచట్లేద అని ప్రశ్నించారు తక్షణమే నష్టపోయిన పంటలకు సర్వే నిర్వహించి తక్షణమే నష్టపరిహాన్ని రైతులకు అందించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని పంట నష్ట వివరాల కోసం అధికారులను ఆదేశించాలని కోరారు కార్యక్రమంలో చిరిగిడి నరేష్ బుర్ర సమ్మక్క ఇర్ఫా సమ్మక్క బాయఅమ్మ అలవాల రమణ రాణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Dec 15 2023, 08:09