NLG: కార్మికులకు ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం అమలు చేయాలి: పల్లా దేవేందర్ రెడ్డి
నల్లగొండ: గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని AITUC రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నల్లగొండలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్ బెరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లో చేర్చిన విధంగా అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించాలని, కనీస వేతన చట్టాలు సక్రమంగా అమలు చేయాలని, శ్రమ దోపిడీని అరికట్టాలని రాష్ట్ర నూతన ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని PF, ESI సక్రమంగా అమలు చేయాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నూనె రామస్వామి అధ్యక్షత వహించగా జిల్లా ఆఫీస్ బేరర్స్ ఎండి సయ్యద్, కె ఎస్ రెడ్డి, నూనె వెంకటేశ్వర్లు , దోటి వెంకన్న, పానేమ్ వెంకటరావు, దోనకొండ వెంకటేశ్వర్లు బరిగల వెంకటేష్, విశ్వనాధుల లెనిన్ తదితరులు పాల్గొన్నారు.
Dec 13 2023, 18:57