చర్ల:మీచౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ న్యూ డెమోక్రసీ డిమాండ్
మీచౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ న్యూ డెమోక్రసీ డిమాండ్.
గత వారం రోజుల కిందట మీ చౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని తడిసిన పత్తిని, దెబ్బతిన్న పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ భాగంగా ఈరోజు చర్లలో పత్తి చేను పరిశీలన చేయడం జరిగింది అత్యంత నష్టపోయో రైతులను వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అనంతరం మండల నాయకులు సిరిగిరి నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముసలి సతీష్ మాట్లాడుతూ గత వారం రోజుల కిందట భారీ తుఫానుల వల్ల పత్తి చేలు మొత్తం తీవ్రంగా నష్టపోయి అడ్డం పడ్డాయని పత్తి మొత్తం నల్ల పడిపోయిందని దీనితో కొనేవారు లేక రైతులు కన్నీరుగా వినిపిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు సిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్ సతీష్ రాజు రాము సింగయ్య ఉంగడు బుర్ర సమ్మక్క సబ్కా నాగలక్ష్మి భద్రమ్మ ఇర్ఫా సమ్మక్క రవణ అలవాల అలవాల విజయలక్ష్మి కాక సావిత్రి పోడియం రామలక్ష్మి బుర్ర సీతమ్మ ఇరుపదుర్గ తదితరులు పాల్గొన్నారు
Dec 13 2023, 17:29