TS: నేటి నుంచి అమల్లోకి మహాలక్ష్మి పథకం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు లాంఛనంగా మహాలక్ష్మి పథకంను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నేడు సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ను అమల్లోకి తీసుకురానుంది. అయితే వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్క మహిళలకు, బాలికలకు టిఎస్ఆర్టిసి బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.. అదేవిధంగా ట్రాన్స్ జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన టి.ఎస్.ఆర్.టి.సి పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, బస్సులలో, పట్టణ పరిధిలోని సిటీ బస్సులకు సంబంధించిన ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుండి ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉచిత ప్రయాణం కోసం మహిళలు తమ వెంట ఆధార్ కార్డు కానీ, ప్రభుత్వ వారిచే జారీ చేయబడిన ఏదైనా గుర్తింపు కార్డును ప్రయాణాలలో తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా ఫ్రీగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే లగ్జరీ, డీలక్స్, ప్రైవేట్ బస్సులలో ప్రయాణాలకు డబ్బులు చెల్లించాల్సిందే. రాష్ట్ర పరిధి దాటిన టిఎస్ఆర్టిసి బస్సులలో డబ్బులు చెల్లించాల్సిందే. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయినా టిక్కెట్టు రుసుము లేకుండా ఫ్రీ ప్రయాణం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం పథకం పట్ల పలువురు మహిళలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.
Dec 09 2023, 13:42