మీ చాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాలను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ డిమాండ్
మీ చాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాలను ఆదుకోవాలని న్యూడెమోక్రసీ నాయకుడు ముసలి సతీష్ డిమాండ్
గత రెండు రోజులుగా కురుస్తున్న మీసాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన పంటలను రైతులను ఆదుకోవాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు.
రాత్రింబవళ్లు కంటికి రెప్పలా కాపాడుకొని సాగు చేసుకుంటున్న పంటలు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ తుఫాను వల్ల నేలమట్టం అయిపోయి పనికిరాకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను తాకిడికి దెబ్బతిన్న పంటలు చూసి రైతన్నలు బోరున విలవిల ఏడుస్తున్నారని ఆరుకాలం కష్టపడ్డ శ్రమంత వృధా అయిపోయిందని దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదే ఉందని వారు అన్నారు. మిరప వరి పత్తి మొత్తం నేలమట్టం అయిపోయాయని దేనికి పనికిరాకుండా అయిపోయాయని ఎకరానికి మిరప పత్తికి 50,000 వరికి 25000 చెల్లించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీచాంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతుల వివరాలను సేకరించి పంటకు తగునష్టపరిహారం చెల్లించాలని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల్ నాయకులు కనితి భాను ప్రకాష్
పి వై ఎల్ మండల నాయకులు చిరిగిడి నరేష్ రమేష్ రాజు ప్రతాప్ విజయ్ తదితరులు పాల్గొన్నారు
Dec 06 2023, 16:53