ఏపీ వైపు దూసుకొస్తున్న మీచౌంగ్ తుఫాన్...
మిచౌంగ్ తుఫాన్ ఏపీవైపు దూసుకొస్తోంది..ఇప్పటికే రెండు రోజులుగా నెల్లూరు, బాపట్ల, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలుపడుతున్నాయి..అనంతపురం, కడప ప్రకాశం, జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం పడింది..నిజాంపట్నం హార్బర్‌లో ఏడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు..తుఫాన్ దృష్ట్యా అధికారులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.! బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కాస్తా సాయంత్రానికి తుఫానుగా బలపడి.. దక్షిణ కోస్తా తీరానికి సమాంతరంగా పయనిస్తోంది.రేపు నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు, పడే అవకాశం ఉంది. రానున్న రెండు, మూడు రోజులపాటు, కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిచే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో అన్నదాతల్లో అలజడి కొనసాగుతోంది. మిచౌంగ్ తుఫాన్ ముప్పు భయం వెంటాడు తోంది.
Dec 06 2023, 16:38