/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి.. రేపే ప్రమాణ స్వీకారం Mane Praveen
తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి.. రేపే ప్రమాణ స్వీకారం

తెలంగాణ సీఎం ఎవరన్నది తేలిపోయింది. నరాలు తెగే ఉత్కంఠకు కాంగ్రెస్ తెరతీసింది. ఎట్టకేలకు నిన్న, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే ఫైనల్ చేస్తూ అధికారికంగా ప్రకటించిన కేసి వేణుగోపాల్. తెలంగాణకు రేవంత్ రెడ్డి రెండో ముఖ్యమంత్రిగా నియామకం అయ్యారు.

ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ ఉండటంతో అధిష్టానం అందరి సీనియర్ నాయకుల తో రెండ్రోజుల పాటు సుధీర్ఘ మంతనాలు జరిపి రేవంత్ రెడ్డిని ఫైనల్ చేసింది. ఈ నెల 7న రేవంత్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

TS: నాల్గవ స్థానంలో బర్రెలక్క

కొల్లాపూర్: నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన కర్నే శిరీష (యూట్యూబ్ ఫేం బర్రెలక్క) 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు 93, 609 ఒట్ల తో .. బీఆర్ఎస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి(63678 ఓట్లు) పై దాదాపు 30 వేల ఓట్ల ఆధిక్యత తో గెలుపొందారు. బిజెపి అభ్యర్థి సుధాకర్ రావు 20,389 ఓట్లు సాధించి మూడో స్థానంలో ఉన్నారు.

నిరుద్యోగి అయిన బర్రెలక్క నిరుద్యోగుల పక్షాన నిలబడి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇదే సందర్భంలో నిరుద్యోగుల మద్దతు, కొంతమంది ప్రముఖుల మద్దతు కూడా లభించింది. ఈ నేపథ్యంలో ముందు ముందు తన రాజకీయ జీవితం ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సిందే.

BREAKING: రేపు కొత్త సీఎం ప్రకటన

TS: తెలంగాణ నూతన ముఖ్యమంత్రి పేరును రేపు ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించింది. సీఎం అభ్యర్థిపై సుదీర్ఘంగా చర్చలు జరిపినా నిర్ణయం కొలిక్కి రాలేదు. దీంతో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కను ఏఐసీసీ ఢిల్లీకి పిలిచింది. రేపు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో వీరు సమావేశమవుతారు. ఈ సమావేశం తర్వాత సీఎం ప్రకటన ఉంటుంది.

TS: అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల లిస్ట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 119 నియోజకవర్గాల శాసనసభ్యులు

తెలంగాణా శాసన సభ్యుల జాబితా - గెలుపొందిన రాజకీయ పార్టీ

1 సిర్పూర్ పాల్వాయి హరీష్ బాబు బీజేపీ

2 చెన్నూరు గడ్డం వివేకానంద్ కాంగ్రెస్

3 బెల్లంపల్లి గడ్డం వినోద్ కాంగ్రెస్

4 మంచిర్యాల కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్

5 ఆసిఫాబాద్ కోవా లక్ష్మీ బీఆర్ఎస్

6 ఖానాపూర్ వెడ్మ భొజ్జు కాంగ్రెస్

7 ఆదిలాబాద్ పాయల్ శంకర్ బీజేపీ

8 బోథ్ అనిల్ జాదవ్ బీఆర్ఎస్

9 నిర్మల్ మహేశ్వర్ రెడ్డి బీజేపీ

10 ముథోల్ రామారావు పవార్ బీజేపీ

11 ఆర్మూర్ పైడి రాజశేఖర్ రెడ్డి బీజేపీ

12 బోధన్ పి.సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్

13 జుక్కల్ తోట లక్ష్మీకాంతరావు కాంగ్రెస్

14 బాన్సువాడ పోచారం శ్రీనివాస రెడ్డి బీఆర్ఎస్

15 ఎల్లారెడ్డి కె. మదన్ మోహన్ రావు కాంగ్రెస్

16 కామారెడ్డి వెంకట రమణా రెడ్డి బీజేపీ

17 నిజామాబాద్ అర్బన్ సూర్యనారాయణ బీజేపీ

18 నిజామాబాద్ రూరల్ రేకులపల్లి భూపతి రెడ్డి కాంగ్రెస్

19 బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి బీఆర్ఎస్

20 కోరట్ల కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్

21 జగిత్యాల టి. జీవన్ రెడ్డి కాంగ్రెస్

22 ధర్మపురి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్

23 రామగుండం మక్కన్ సింగ్ రాజ్ థాకూర్ కాంగ్రెస్

24 మంథని దుద్దిళ్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్

25 పెద్దపల్లి చింతకుంట్ల వినయ రమణ రావు కాంగ్రెస్

26 కరీంనగర్ గంగుల కమలాకర్ బిఆర్ఎస్

27 చొప్పదండి మేడిపల్లి సత్యం కాంగ్రెస్

28 వేములవాడ ఆది శ్రీనివాస్ కాంగ్రెస్

29 సిరిసిల్ల కేటీఆర్ బీఆర్ఎస్

30 మానకొండూరు కె.సత్యనారాయణ కాంగ్రెస్

31 హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్

32 హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్

33 సిద్ధిపేట హరీశ్ రావు బీఆర్ఎస్

34 మెదక్ మైనంపల్లి రోహిత్ రావు కాంగ్రెస్

35 నారాయణ్‌ఖేడ్ పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్

36 ఆందోల్ దామోదర రాజనర్సింహ కాంగ్రెస్

37 నర్సాపూర్ సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్

38 జహీరాబాద్ కె.మాణిక్ రావు బీఆర్ఎస్

39 సంగారెడ్డి చింతా ప్రభాకర్ బీఆర్ఎస్

40 పటాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్

41 దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్

42 గజ్వేల్ కేసీఆర్ బీఆర్ఎస్

43 మేడ్చల్ చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్

44 మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఆర్ఎస్

45 కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద్ బీఆర్ఎస్

46 కూకట్‌పల్లి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్

47 ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్

48 ఇబ్రహీంపట్నం మల్‌రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్

49 ఎల్బీ నగర్ డి.సుధీర్ రెడ్డి బీఆర్ఎస్

50 మహేశ్వరం సబితా ఇంద్రారెడ్డి బీఆర్ఎస్

51 రాజేంద్రనగర్ టి.ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్

52 శేరిలింగంపల్లి అరెకపూడి గాంధీ బీఆర్ఎస్

53 చేవెళ్ల కాలె యాదయ్య బీఆర్ఎస్

54 పరిగి తమ్మన్నగారి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్

55 వికారాబాద్ గడ్డం ప్రసాద్ కుమార్ కాంగ్రెస్

56 తాండూరు బి.మనోహర్ రెడ్డి కాంగ్రెస్

57 ముషీరాబాద్ ముఠా గోపాల్ బీఆర్ఎస్

58 మలక్ పేట్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా ఎంఐఎం

59 అంబర్‌పేట కాలేరు వెంకటేశ్ బీఆర్ఎస్

60 ఖైరతాబాద్ దానం నాగేందర్ బీఆర్ఎస్

61 జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్

62 సనత్‌నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్

63 నాంపల్లి మహ్మద్ మజీద్ హుస్సేన్ ఎంఐఎం

64 కార్వాన్ అమర్ సింగ్ బీజేపీ

65 గోషా మహల్ రాజాసింగ్ బీజేపీ

66 చార్మినార్ మిర్ జుల్ఫికర్ అలీ ఎంఐఎం

67 చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం

68 యాకుత్‌పుర జాఫర్ హుస్సేన్ (ఆధిక్యం) ఎంఐఎం

69 బహదూర్‌పుర మహ్మద్ ముబీన్ ఎంఐఎం

70 సికింద్రాబాద్ పద్మారావు గౌడ్ బీఆర్ఎస్

71 సికింద్రాబాద్ కంటోన్మెంట్ లాస్య నందిత సాయన్న బీఆర్ఎస్

72 కొడంగల్ అనుముల రేవంత్ రెడ్డి కాంగ్రెస్

73 నారాయణపేట చిట్టెం పర్ణికా రెడ్డి కాంగ్రెస్

74 మహబూబ్‌నగర్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్

75 జడ్చర్ల అనిరుధ్ రెడ్డి కాంగ్రెస్

76 దేవరకద్ర ఆళ్ల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్

77 మక్తల్ వాకిటి శ్రీహరి కాంగ్రెస్

78 వనపర్తి తూడి మేఘారెడ్డి కాంగ్రెస్

79 గద్వాల కృష్ణ మోహన్ బీఆర్ఎస్

80 అలంపూర్ విజయుడు బీఆర్ఎస్

81 నాగర్‌కర్నూల్ డాక్టర్ కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి కాంగ్రెస్

82 అచ్చంపేట చిక్కడు వంశీ కృష్ణ కాంగ్రెస్

83 కల్వకుర్తి కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్

84 షాద్‌నగర్ కె.శంకరయ్య కాంగ్రెస్

85 కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్

86 దేవరకొండ నెనావత్ బాలూ నాయక్ కాంగ్రెస్

87 నాగార్జున సాగర్ కుందూరు జయవీర్ రెడ్డి కాంగ్రెస్

88 మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి కాంగ్రెస్

89 హుజూర్‌నగర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్

90 కోదాడ . పద్మావతి రెడ్డి కాంగ్రెస్

91 సూర్యాపేట జగదీశ్ రెడ్డి బీఆర్ఎస్

92 నల్గొండ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్

93 మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్

94 భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్

95 నకిరేకల్ వేముల వీరేశం కాంగ్రెస్

96 తుంగతుర్తి మందుల సామెల్ కాంగ్రెస్

97 ఆలేరు బీర్ల ఐలయ్య కాంగ్రెస్

98 జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్

99 స్టేషన్ ఘన్‌పూర్ కడియం శ్రీహరి బీఆర్ఎస్

100 పాలకుర్తి మామిడాల యశస్విని కాంగ్రెస్

101 డోర్నకల్ జాటోత్ రామచందర్ నాయక్ కాంగ్రెస్

102 మహబూబాబాద్ భుక్యా మురళీ నాయక్ కాంగ్రెస్

103 నర్సంపేట దొంతి మాధవరెడ్డి కాంగ్రెస్

104 పరకాల రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్

105 వరంగల్ వెస్ట్ నాయిని రాజేందర్ రెడ్డి కాంగ్రెస్

106 వరంగల్ ఈస్ట్ కొండా సురేఖ కాంగ్రెస్

107 వర్దన్నపేట కేఆర్ నాగరాజు కాంగ్రెస్

108 భూపాలపల్లి గండ్ర సత్యానారాయణరావు కాంగ్రెస్

109 ములుగు డి.అనసూయ (సీతక్క) కాంగ్రెస్

110 పినపాక పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్

111 ఇల్లందు కోరం కనకయ్య కాంగ్రెస్

112 ఖమ్మం తుమ్మల నాగేశ్వర రావు కాంగ్రెస్

113 పాలేరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్

114 మధిర మల్లు భట్టి విక్రమార్క కాంగ్రెస్

115 వైరా మాలోతు రామ్‌దాస్ కాంగ్రెస్

116 సత్తుపల్లి మట్టా రాగమయి కాంగ్రెస్

117 కొత్తగూడెం కూనంనేని సాంబశివరావు సీపీఐ

118 అశ్వారావుపేట జారె ఆదినారాయణ కాంగ్రెస్

119 భద్రాచలం డాక్టర్ తెల్లం వెంకట్రావ్

NLG: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధం ఘటన లో వ్యక్తి సజీవ దహనం

హైదారాబాద్ నుండి చీరాల కు వెళ్ళే శ్రీ క్రిష్ణా ట్రావెల్స్ బస్సు కు, నల్లగొండ జిల్లా మర్రి గూడ బైపాస్ దగ్గర తెల్లవారు జామున 2 గంటల సమయం లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ బస్సు లో మొత్తం 34 మంది ప్రయనించగా అందులో ఒకరు సజీవ దహనమాయ్యారు. స్లీపర్ క్లాస్ కోచ్ అవ్వటం వలన ప్రమాద సమయంలో నిద్ర పోతుండగా బయటికి రాలేకపోవడంతో, ఆ వ్యక్తి చనిపోయాడని తెలుస్తుంది. చనిపోయిన వ్యక్తి ఎముకులు గుర్తించారు. మిగతా ప్రయాణికులకు చిన్న గాయాలే తప్ప ప్రమాదం ఏమీ లేదని, ఈ ప్రమాదం లో ప్రయాణికుల లగేజ్ , బంగారంతో పాటు అమెరికా వెళ్ళాలనే అమ్మాయి వీసా కూడా దగ్ధం అయ్యింది అని చెప్పారు. ఈ ప్రమాదం పై పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

TS: కాసేపట్లో సీఎం పేరు ప్రకటించనున్న కాంగ్రెస్

తెలంగాణ ఎన్నికల్లో 64 సీట్లు సాధించిన కాంగ్రెస్ ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. హైదరాబాదులో కాసేపటి క్రితమే సిఎల్పీ సమావేశం ప్రారంభమైనది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ ఏకవాఖ్య తీర్మానం తో సీఎల్పీ నేతను ఎన్నుకున్నారు. అనంతరం కాంగ్రెస్ జాతీయ అధిష్టానం సీఎం ఎవరు అనేది ప్రకటించనుంది.

TS: 64 సీట్లు సాధించి, ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ పార్టీ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం పూర్తయింది. 

119 స్థానాలకు గాను ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

కాంగ్రెస్ --- 64

బిఆర్ఎస్ - 39

బిజెపి ----- 08

ఎంఐఎం --- 07

సిపిఐ -----  01

కాంగ్రెస్ సిపిఐ అలయన్స్ 65 సీట్లు సాధించినట్లు అయ్యింది.

119 స్థానాలకు 60 లేదా ఆ పైన సీట్లు సాధించిన పార్టీ అధికారాన్ని చేపట్టడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టింది.

ఎలక్షన్స్ అప్డేట్: కాంగ్రెస్‌ లో గెలిచి బీఆర్‌ఎస్‌ లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓటమి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా సాధిస్తోంది.

2018లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌ లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓటమి చెందారు. తాజాగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో 8 మంది విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో (2023) కొల్లాపూర్, కల్వకుర్తి, నకిరేకల్, తుంగతుర్తి, ఖమ్మం, పాలేరు, పినపాక, ఇల్లందు, జగిత్యాల, ఖానాపూర్‌ అభ్యర్థులు గెలుపొందారు.

NLG: చండూరులో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు (వీడియో)
చండూరు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ దిశగా ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో పటాసులు పేల్చి, జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చండూరు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ దిశగా ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో పటాసులు పేల్చి, జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ

TS: కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘన విజయం

కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘనవిజయం సాధించారు. 32800 ఓట్ల మెజారిటీ పొందారు.

మునుగోడు నియోజకవర్గం 14వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 25వేల పైచిలుకు లీడ్

నకిరేకల్ నియోజకవర్గం 13వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 35 వేల లీడ్

మిర్యాలగూడ నియోజకవర్గం 14వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి 35558 లీడ్

నాగార్జునసాగర్ నియోజకవర్గం 13వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి 33899 లీడ్