/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1691086889514603.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1691086889514603.png StreetBuzz ఎలక్షన్స్ అప్డేట్: కాంగ్రెస్‌ లో గెలిచి బీఆర్‌ఎస్‌ లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓటమి Mane Praveen
ఎలక్షన్స్ అప్డేట్: కాంగ్రెస్‌ లో గెలిచి బీఆర్‌ఎస్‌ లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓటమి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ హవా సాధిస్తోంది.

2018లో కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌ లో చేరిన 9మంది ఎమ్మెల్యేలు ఓటమి చెందారు. తాజాగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారిలో 8 మంది విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో (2023) కొల్లాపూర్, కల్వకుర్తి, నకిరేకల్, తుంగతుర్తి, ఖమ్మం, పాలేరు, పినపాక, ఇల్లందు, జగిత్యాల, ఖానాపూర్‌ అభ్యర్థులు గెలుపొందారు.

NLG: చండూరులో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు (వీడియో)
చండూరు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ దిశగా ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో పటాసులు పేల్చి, జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గం లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టమైన ఆధిక్యత ఉన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చండూరు: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ దిశగా ఉండడంతో ఆ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో పటాసులు పేల్చి, జై కాంగ్రెస్ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ

TS: కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘన విజయం

కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఘనవిజయం సాధించారు. 32800 ఓట్ల మెజారిటీ పొందారు.

మునుగోడు నియోజకవర్గం 14వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి 25వేల పైచిలుకు లీడ్

నకిరేకల్ నియోజకవర్గం 13వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం 35 వేల లీడ్

మిర్యాలగూడ నియోజకవర్గం 14వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి 35558 లీడ్

నాగార్జునసాగర్ నియోజకవర్గం 13వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు జైవీర్ రెడ్డి 33899 లీడ్

TS: రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన డిజిపి (JUST IN)

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే దిశగా దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి .. రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ వెళ్లారు. రేవంత్ రెడ్డికి మరింత భద్రత పెంచినట్లు తెలుస్తోంది. డీజీపీ తో పాటు పలువురు ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు.

ఎన్నికల కౌంటింగ్: 8వ రౌండ్ ముగిసే సమయానికి 13,020 మెజారిటీ లో రాజగోపాల్ రెడ్డి

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా, మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎనిమిదవ రౌండ్ మూసే సమయానికి 13,020 ఓట్ల ఆధిక్యత తో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. 11.05am

TS: అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్: మెజారిటీ లో మ్యాజిక్ నెంబర్ ను దాటిన కాంగ్రెస్

అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్: 

మెజారిటీలో మ్యాజిక్ నెంబర్ ను దాటిన కాంగ్రెస్..

అసెంబ్లీ ఎన్నికలు 2023 కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 11 గంటల సమయానికి..

కాంగ్రెస్ 67 లీడ్

బిఆర్ఎస్ 38 లీడ్

బిజెపి 11 లీడ్

ఎంఐఎం 3 లీడ్

అసెంబ్లీ ఎన్నికలు: నల్లగొండలో ఆధిక్యతలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

10:30am

నల్లగొండలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 17350 ఓట్ల ఆధిక్యతతో ముందంజలో ఉన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు.

హుజూర్నగర్ లో ఉత్తంకుమార్ రెడ్డి 12 వేల ఓట్ల మెజారిటీ లో ఉన్నారు.

ఇక తుంగతుర్తిలో మందుల సామెల్ ముందంజలో ఉన్నారు

తెలంగాణ ఎన్నికల ఫలితాలు తాజా వార్తలు

10:00am

తెలంగాణ ఎన్నికల ఫలితాలు తాజా వార్తలు

మునుగోడు నాల్గవ రౌండ్

కాంగ్రెస్ 5929

బిఆర్ఎస్ 3539

బీజేపీ 1951

హుజూర్ నగర్ లో ఉత్తమ్ 5 వ రౌండ్ లో 2707 ఆధిక్యం

మొత్తం..15,264 ఆధిక్యం లో ఉత్తమ్

మిర్యాలగూడ నాలుగో రౌండ్ 

సిపిఎం 120

బిఆర్ఎస్ 2770 

కాంగ్రెస్ 5547

దేవరకొండ 3వ రౌండ్

కాంగ్రెస్ -5037

బిఆర్ఎస్ -3886

లీడ్ -1151 కాంగ్రెస్

నకిరేకల్ 4వ రౌండ్ ముగిసేసరికి 9992 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశం. భారీ మెజార్టీ దిశగా కాంగ్రెస్ అభ్యర్థి.

సూర్యాపేట సెకండ్ రౌండ్

బిఆర్ఎస్ గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ..4465

కాంగ్రెస్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి..3805

బి ఎస్ పి: వట్టే జానయ్య..1980

 బిజెపి: సంకినేని వెంకటేశ్వరరావు..1065

మిర్యాలగూడ 3వ రౌండ్ 

కాంగ్రెస్ -5433

బిఆర్ఎస్ -3181

లీడ్ -2252 కాంగ్రెస్

TS: ముగిసిన నాగార్జునసాగర్ వివాదం.. పరిస్థితులు సద్దుమణిగినట్లే..

నాగార్జున సాగర్ జలాల వివాదం నిన్నటితో ముగిసింది. డ్యామ్ నిర్వహణను కృష్ణా రివర్ వాటర్ బోర్డు మేనేజ్‌మెంట్ కు అప్పగించడానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. నవంబరు 28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని నిర్ణయించాయి. కేంద్ర హోంశాఖ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. సీఆర్పీఎఫ్ దళాలకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు సుముఖత వ్యక్తం చేశాయి. 

కృష్ణా జలాల్లో 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణ పంచుకోవాలన్న నిర్ణయాన్ని ఇకపై కృష్ణా రివర్ వాటర్ బోర్డు మేనేజ్‌మెంట్ అమలు చేస్తుంది. మూడు రోజుల క్రితం ఏపీ తన పరిధిలో ఉన్న 3 గేట్లను ఎత్తి కిందకు నీటిని విడుదల చేసుకోవడంతో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.

TS: రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదు

ఉమ్మడి నల్లగొండ జిల్లా:

నల్లగొండ జిల్లాలోని నల్లగొండ, నకిరేకల్, మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాలలో 85.49% పోలింగ్ నమోదయింది. 

నల్గొండ కేంద్రంలోని మిర్యాలగూడ రోడ్డు దుప్పలపల్లి గోదాం లో ఈవీఎంలను భద్రపరిచారు, అక్కడే కౌంటింగ్ ఉంటుంది.

సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట, హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గాలలో 84.83 % పోలింగ్ నమోదయింది. 

సూర్యాపేట జిల్లా లోని నాలుగు నియోజకవర్గాల EVM లు సూర్యాపేట లోని వ్యవసాయ మార్కెట్ లో స్ట్రాంగ్ రూం కు తరలించారు. అక్కడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాలు భువనగిరి, ఆలేరు లలో 90.03% పోలింగ్ నమోదు అయింది. రాష్ట్రంలోనే అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలింగ్ నమోదు అయింది. భువనగిరి లోని ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈవీఎంలను భద్రపరిచారు అక్కడే కౌంటింగ్ జరుగుతుంది