మహాత్మ జ్యోతిరావు పూలే భారత దేశ మొదటి సంఘసంస్కర్త : ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్
నల్లగొండ జిల్లా:
కొండమల్లేపల్లి: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, మంగళవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మహాత్మ జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి సందర్భంగా.. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, ఉపాధ్యక్షులు యేకుల సురేష్, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు చిట్యాల గోపాల్ మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిరావు పూలే భారతదేశ మొదటి సంఘసంస్కర్త అని కొనియాడారు. పూలే అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు . 1873 సెప్టెంబరు 24న, పూలే తన అనుచరులతో కలిసి, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ (సొసైటీ ఆఫ్ సీకర్స్ ఆఫ్ ట్రూత్) ను ఏర్పాటు చేసి ,అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేసిన మహనీయుడు అని తెలిపారు. అదేవిదంగా అన్ని మతాలు, కులాల ప్రజల కోసం పాటుపడిన సామాజిక సంస్కరణ ఉద్యమకారుడు పూలే అని కొనియాడారు. పూలే, అతని భార్య సావిత్రిబాయి ఫులే భారతదేశంలో మహిళా విద్యకు మార్గదర్శకులు. అతను మహిళలకు, తక్కువ కుల ప్రజలకు విద్యను అందించే ప్రయత్నాలు మొదలు పెట్టిన మొట్ట మొదటి మహాను బావులు అని పూలే సేవలను కొనియాడారు. అదేవిదంగా ఫులే బాలికల కోసం మొదటి పాఠశాలను 1848లో పూణేలో ప్రారంభించాడన్నారు. అతను వితంతువుల కోసం ఒక గృహాన్ని కూడా స్థాపించి వారిని అన్ని విధాలుగా ఆదుకున్న మహనీయుడని కొనియాడారు.
అదేవిదంగా భారతదేశ బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించిన మొట్టమొదటి స్థానిక భారతీయులు మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. విద్య యొక్క విశ్వీకరణను సమర్థించిన మొదటి సంస్కర్త కూడా ఆయనే అని ఈ సందర్బంగా గుర్తుచేసారు. ఈలాంటి గొప్ప మహాత్ముని దేశ ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకొని అయన ఆచరణలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్షిత్ కుమార్, ఠాగూర్, రమేష్, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
Nov 30 2023, 07:19