/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఇంటి దగ్గర నుండి ఓటేసే అవకాశం ఉన్న... స్పందన కరువు.. Miryala Kiran Kumar
ఇంటి దగ్గర నుండి ఓటేసే అవకాశం ఉన్న... స్పందన కరువు..

ఎన్నికల్లో వృద్ధులకు దివ్యాంగులకు లైన్‌లో ఉండి ఓటు నమోదు చేసుకోవాలంటే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల కమిషన్‌ ఇంటి వద్ద నుంచే ఓటు నమోదు చేసుకునే విధంగా సువర్ణ అవకాశాన్ని కల్పించింది. మంచాన పడ్డ వారు, కదులలేని, బయటకు రాలేని పరిస్ధితులున్నా... అలాంటి వారితోనూ ఓటు వేయించడం ద్వారా ఓటింగ్‌ శాతం పెంచే సరికొత్త ఆధికారులు ఈసారి రూపొందించారు. సంబంధిత వ్యక్తుల నుంచి అంతగా స్పందన లేకపోవడం గమనార్హం. అధిక శాతం పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి ఇష్టపడుతుండగా, సుముఖంగా ఉన్న కొద్దిమంది నుంచి అవసరమైన ధృవీకరణ పత్రాలు వస్తున్నాయి. చాలా మంది వృద్ధులు, దివ్యాంగులు సైతం పోలింగ్‌ కేంద్రాల వద్దకే వచ్చేందుకు ఇష్టపడుతున్నట్లు తెలస్తుంది.

13 వేల పైచిలుకు గుర్తింపు...

80 ఏళ్లు నిండిన వృద్ధులు, నడువలేని దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఎన్నికల కమిషన్‌ ఇచ్చింది. మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈలాంటి వారు మొత్తం 13,076 మందిని అధికారులు గుర్తించారు. వారిలో 80 ఏళ్లు నిండిన వృద్ధులు 10031 మంది, దివ్యాంగులు 3045 మంది ఉన్నారు. వారికి 12-డీ ఫామ్‌లను ఇప్పటికే పంపిణీ చేసి వారి అభిప్రాయాలను సేకరించారు. దీన్ని ఆర్‌వో ఎన్‌.రవికిరణ్‌, నోడల్‌ అధికారి సుధ లింగాలలు పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 13,076 లో కొంత మంది మరణంచగా, వీరిలో వృద్ధులు 103 మంది, దివ్యాంగులలో 15 మంది మాత్రమే సుముఖతను వ్యక్తం చేస్తూ లేటర్‌లను ఇచ్చారు.

ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు

బ్యాలెట్‌ పత్రాలు ముద్రించాక కలెక్టర్‌ ఆదేశాల ప్రకారం. పోలింగ్‌కు ముందే దీని కోసం ప్రత్యేకంగా నియమించే పోస్టల్‌ బ్యాలెట్‌ బృందం బ్యాలెట్‌ బాక్స్‌తో పోలీసులు, అన్ని రాజకీయ పార్టీల ఏజెంట్లతో సహా ఆయా ఇళ్లకు వెళ్లి వృద్దులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తారు. ఈ ప్రక్రియనంతా వారి ఇంటి వద్దకు అధికారులు వెళ్లినప్పటినుంచి రహస్యంగా సదరు వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునే వరకు వీడియో రికార్డ్‌ చేస్తారు.

ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రం దాఖలు చేసిన నల్గొండ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి

నేడు..నల్లగొండ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా.. కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. నామినేషన్ దాఖలు...

 ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా నామినేషన్ పత్రం దాఖలు...

 రెండు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కంచర్ల....

 ఉదయం తమ స్వగ్రామం ఉరుమడ్ల గ్రామంలో రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పూజలు...

 సరిగ్గా ఉదయం 9.20 గంటలకు...

కుటుంబ సభ్యులు, సోదరీమణులు... మంగళ హారతులు పట్టి విజయ తిలకం దిద్దగా.. మాతృమూర్తి కౌసల్య, సోదరులు కంచర్ల కృష్ణారెడ్డి గారి ఆశీర్వాదాలు తీసుకున్న... భూపాల్ రెడ్డి గారు... ముఖ్య నాయకులు.. వివిధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు వెంటరాగా...తాను నివాసముంటున్న... బీటీ కాలనీలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో... ప్రత్యేక పూజలు నిర్వహించారు... అనంతరం తన ఇష్ట దైవం... రామలింగేశ్వరుడికి  ఛాయా సోమేశ్వరాలయంలో... అభిషేకం నిర్వహించి పూజలు చేశారు...

 ముఖ్య నాయకులు కార్యకర్తలతో కలిసి ఆర్డివో కార్యాలయం చేరుకొని

నిబంధనల మేరకు ఐదుగురు.. నాయకులు వెంట రాగా.. నల్లగొండ నియోజకవర్గ ఆర్ వో గారికి.. రుసుము చెల్లించి.. నామినేషన్ పత్రం అందచేశారు...

అనంతరం వెలుపల మీడియా తో మాట్లాడుతూ..

# నల్లగొండ పునర్నిర్మాణం కోసం ఆలోచనతో ఓటు వేయండి..

#అభివృద్ధిని కొనసాగించేందుకు మరోసారి అవకాశం ఇవ్వండి.

# కడుపు నింపే కేసీఆర్ కావాలా కడుపు కొట్టి కాంగ్రెస్ కావాలో నిర్ణయించుకోండి.

# కోమటిరెడ్డిని తరిమేస్తేనే నల్లగొండలో ఖాళీ జాగాలు మిగులుతాయి.

# ఐదేళ్లు కనపడని కోమటిరెడ్డి ఇప్పుడు డబ్బు సంచులతో వచ్చి నాయకులను కొనుగోలు చేస్తుండు.

.... కంచర్ల.

 గత 20 ఏళ్లుగా గోస తీసి.. అభివృద్ధి కి నోచుకోక... ఇప్పుడిప్పుడే నల్లగొండ నిర్మాణం చెందుతూ అభివృద్ధి దిశ వైపు పరుగులు తీస్తుంటే... గత ఐదు సంవత్సరాలుగా కనపడని.. నల్లగొండ ప్రజల సమస్యలు పట్టని పట్టించుకోని.. కోమటిరెడ్డి మళ్లీ డబ్బు సంచులతో వచ్చి.. నాయకులను కొనుగోలు చేసి...

 హైప్ క్రియేట్ చేసి... ప్రజలను మభ్యపెట్ట చూస్తున్నాడ ని.. గతంలోల ఆయన మాటలు ఇప్పుడు సాగవని.. ఆయన మాయ మాటలకు మోసపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు... కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం... ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించిందని.. వాటిని మరింత పెంచుతూ మేనిఫెస్టోలో తెలిపిందని

 ఆసరా పెన్షన్లు 3016 నుంచి 5016 కు దివ్యాంగుల పెన్షన్ 6016 రైతుబంధు 12 వేల నుండి 16 వేలకు.. 3016 రూపాయల సౌభాగ్య లక్ష్మి... 400 రూపాయలకే సిలిండర్.. తదితర ప్రజలకు ఉపయోగపడే లాభపడే.. పథకాలు ప్రవేశపెట్టనిందని... ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం పోరాడి తెచ్చిన కేసీఆర్ ద్వారానే ఈ పనులన్నీ... నెరవేరుతాయని...

ప్రజలకు తెలియజేశారు.

 కంచర్ల నామినేషన్ కార్యక్రమంలో..

 మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, ఎంపీపీ కరీం పాషా జెడ్పిటిసి చిట్ల వెంకటేశం, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు చాడ కిషన్ రెడ్డి, నిరంజన్ వలి ,మార్కెట్ కమిటీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, ఎంజి యూనివర్సిటీ సినీనటి సభ్యులు బోయపల్లి కృష్ణారెడ్డి, చిట్యాల సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్ రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటకం సత్తయ్య గౌడ్ , మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు గోలిమా అమరేందర్ రెడ్డి జేఏసీ అధ్యక్షులు జే వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు నేతి రఘుపతి, తిప్పర్తి మాజీ జెడ్పిటిసి తండు సైదులు గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ జెడ్పి కోఆప్షన్ సభ్యులు.. తీగల జాన్ శాస్త్రి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కొండూరు సత్యనారాయణ,జమాల్ ఖాద్రి రంజిత్ ఉద్యమ నాయకులు బక్క పిచ్చయ్య మాలే శరణ్య రెడ్డి సింగం రామ్మోహన్, లక్ష్మి, ఫరీద్ దొద్దిన్ మైనం శ్రీనివాస్,

పెఱిక ఉమామహేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ లు వంగాల సహదేవరెడ్డి ఆలకుంట నాగరత్నం రాజు, దోటి శ్రీనివాస్ ,పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్,తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్రెడ్డి దేప వెంకట్ రెడ్డి, అయితగోని యాదయ్య..

 తిప్పర్తి కనగల్ మాడులపల్లి నల్లగొండ వైస్ ఎంపీపీలు.. ఏనుగు వెంకట్ రెడ్డి రామగిరి శ్రీధర్ రావు, రామగిరి శ్రీధర్ రావు, జిల్లా పరమేష్... సింగిల్ విండో వైస్ చైర్మన్ లు, కందుల రేణుక లక్ష్మయ్య, తవిటి కృష్ణ...

 పట్టణ మండలం పార్టీ.కార్యదర్శులు సందినేని జనార్ధన్ కాసం శేఖర్,జాఫర్,వనపర్తి నాగేశ్వరరావు కందిమల్ల నరేందర్ రెడ్డి, ఇరుగంటిపల్లి శేఖర్ రెడ్డి,బడుపుల శంకర్, పలువురు కౌన్సిలర్లు కో ఆప్షన్ సభ్యులు ఎంపీటీసీలు సర్పంచులు ముఖ్య నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

భారత విప్లవ ప్రతిఘటనోద్యమ నిర్మాత చండ్ర పుల్లారెడ్డి స్పూర్తితో పోరాడుదాం:సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ

భారత విప్లవ ప్రతిఘటనోద్యమ నిర్మాత చండ్ర పుల్లారెడ్డి స్పూర్తితో పోరాడుదాం

             సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ

భారత విప్లవోద్యమ వేగుచుక్క, ప్రతిఘటన పోరాట అగ్రగణ్యులు చండ్ర పుల్లారెడ్డి 39 వ వర్ధంతి సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో బొమ్మిడి నగేష్ అధ్యక్షతన సంస్మరణ సభ నిర్వహించి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

   ఈ సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఇందూరు సాగర్, మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, ఈదేశ విముక్తి కోసం ప్రతిఘటన పోరాటమే మార్గంగా తుదివరకు పోరాడి , ఈ దేశ విప్లవోద్యమానికి వేగుచుక్కగా నిలిచిన అగ్రనాయకుడు కామ్రేడ్ చండ్రపుల్లారెడ్డి అని, పేద ప్రజల బ్రతుకులు మారాలని తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసి అడవిబాట పట్టిన వాడని అన్నారు.ఈ దేశంలో జరుగుతున్న ప్రజా,విప్లవోద్యమంలో అనేకమంది విప్లవకారులు తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించారని, బూటకపు ఎన్కౌంటర్లలో, ప్రభుత్వాలు పాలకులు ప్రయోగించిన రాజ్య హింసలో, దోపిడీ ముఠాల గుండాల చేతులలో హత్య గావించబడిన అనేకమంది విప్లవకారులు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. ఈదేశంలో నూతన ప్రజాస్వామ్యక విప్లవాన్ని నిర్మించాలని నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమంలో అనేకమంది విప్లవ వీరులు వర్గ సమాజ నిర్మూలన కోసం పోరాడారన్నారు. ప్రస్తుతం దేశంలో హిందూ మతోన్మాద బిజెపి పాసిస్టు పాలను కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేకమైన దొరపాలన కొనసాగుతుందన్నారు. 10ఏళ్ల పాలనలో అమలు చేయని హామీలు ఎన్నికలు వచ్చాయని మళ్ళీ అబద్ధాల హామీలతో ఓట్లు అడగడానికి వస్తున్నారని అన్నారు కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి రూపొందించిన ప్రతిఘటన పోరాట, బూర్జువా,భూస్వామ్య, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా తిరుగుబాటులకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

  ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు బొంగరాల నర్సింహా, బి.వి చారి,పోలె పవన్,జానపాటి శంకర్, అయోధ్య,ప్రవీణ్, వీరేశ్ తదితరులు పాల్గొన్నారు.

కలలో దేవుడు కనిపించి పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా..!

కర్ణాటక: కలలో దేవుడు కనిపించి పొలంలో గొయ్యి తవ్వమన్నాడు.. తీరా తవ్వి చూడగా..!


బెంగళూరుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి టెక్కారిలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే అతనికి కలలో అతను కొన్న భూమి పక్కనే ముస్లిం వ్యక్తి హమద్ బావాకు చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు కల వసీచింది. ఈ విషయాన్ని లక్ష్మణ్ గ్రామ ప్రజలకు తెలియజేశాడు. అనంతరం గ్రామస్థులు అందరూ కలిసి జ్యోతిష్కులను సంప్రదించారు. అప్పుడు కూడా అతనికి భూగర్భంలో దేవుడి ఉనికి గురించి సూచన వచ్చింది.


ఇందుగలడు అందులేడని సందేహం వలదు.. ఎందెందు వెదికినా దేవుడు కనిపిస్తాడని హిందువుల నమ్మకం. అందుకు మరోసారి నిదర్శనంగా నిలిచింది దక్షిణ కన్నడ జిల్లాలో జరిగిన ఓ ఘటన. బెల్తంగడి తాలూకా తెక్కరు గ్రామంలోని బత్రాబైల్‌లోని ఓ ముస్లిం వ్యక్తికి చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు మరొక వ్యక్తికి కల వచ్చింది. దీంతో ఆ ముస్లిం వ్యక్తి అనుమతితో జేసీబీతో భూమిని తవ్వగా వందేళ్ల క్రితం నాటి గోపాలకృష్ణుడి విగ్రహం లభ్యమైంది. దీంతో ఆ ముస్లిం వ్యక్తి తన ఆధీనంలో ఉన్న భూమిని ఆలయానికి ఇచ్చేశాడు.


బెంగళూరుకు చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తి టెక్కారిలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే అతనికి కలలో అతను కొన్న భూమి పక్కనే ముస్లిం వ్యక్తి హమద్ బావాకు చెందిన వ్యవసాయ భూమిలో దేవాలయం ఉన్నట్లు కల వసీచింది. ఈ విషయాన్ని లక్ష్మణ్ గ్రామ ప్రజలకు తెలియజేశాడు. అనంతరం గ్రామస్థులు అందరూ కలిసి జ్యోతిష్కులను సంప్రదించారు. అప్పుడు కూడా అతనికి భూగర్భంలో దేవుడి ఉనికి గురించి సూచన వచ్చింది. దీంతో జేసీబీతో భూమిని తవ్వారు. పదుల అడుగుల తవ్విన తర్వాత విరిగిన గోపాలకృష్ణుడి విగ్రహం కనిపించింది.

దీని ప్రకారం విగ్రహం దొరికిన స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించగా.. హమద్ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని విడిచిపెట్టారు. హమద్ తన పూర్వీకుల నుండి వ్యవసాయ భూమిని వారసత్వంగా పొందాడు. సర్వే చేయగా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు తేలింది.

వందల సంవత్సరాల క్రితం.. గోపాలకృష్ణ దేవాలయంపై టిప్పు సుల్తాన్ దాడి చేసినట్లు చెబుతారు. గ్రామంలో పదేళ్ల క్రితం ఓ దేవాలయం ఉందనే విషయం వెల్లడైంది. అంతేకాదు ఓ ముస్లిం వ్యక్తి స్థలంలో గుడి ఉందన్న సమాచారం అందుకున్న కొంతమంది పెద్దలు కలిసి గోపాలకృష్ణ ఆలయ ట్రస్టు ఏర్పాటు చేశారు. గుడి గురించి అన్వేషణ ప్రారంభించారు. అయితే ఎక్కడనే విషయంపై సరైన సమాచారం లేకపోవడంతో గ్రామస్థులు మౌనంగా ఉండిపోయారు.

అయితే 10 ఏళ్ల క్రితం బెంగుళూరుకు చెందిన లక్ష్మణ అనే వ్యక్తి టెక్కరు సమీపంలోని కొంత భూమిని కొనుగోలు చేశాడు. ఇప్పుడు భూమి విషయం ఆలోచిస్తుండగా లక్ష్మణ్ సమీప స్థలంలో ఒక ఆలయం ఉందని కల వచ్చినట్లు పేర్కొన్నాడు. అయితే లక్ష్మణుడి స్థలానికి సమీపంలో హమద్ స్థలం ఉంది.

దీని ప్రకారం భూమికి సంబంధించిన రికార్డును పరిశీలించగా అది ప్రభుత్వ భూమి అని తేలింది. ఆ విధంగా బెల్తంగడి ఎమ్మెల్యే హరీష్ పూంజా సహకారంతో ముస్లిం వ్యక్తి స్థలంపై సర్వే చేయించారు. సర్వేలో 25 సెంట్ల భూమి ప్రభుత్వానికి చెందినదని తేలడంతో హమద్ కొబ్బరి తోటను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది.

అనంతరం ఆలయ నిర్మాణానికి స్థలం ఇవ్వాలని గోపాలకృష్ణ ఆలయ ట్రస్టు డీసీని కోరారు. దీని ప్రకారం, జిల్లా కలెక్టర్ ఆలయాన్ని నిర్మించడానికి హిందూ మతపరమైన దేవాదాయ శాఖకు భూమిని రిజర్వు చేశారు. తాజాగా జేసీబీతో తవ్వకాలు జరుపుతుండగా కలలో వచ్చినట్లుగా పది అడుగుల లోతున్న బావిలో గోపాల కృష్ణుడు విగ్రహం కనిపించింది. ప్రస్తుతం హమద్ తన 75 సెంట్ల భూమిని ఆలయ ట్రస్టుకు విక్రయించాడు.


బ్రేకింగ్ న్యూస్* నల్గొండ లో కాంగ్రెస్ కు భారీ షాక్

బ్రేకింగ్ న్యూస్

నల్గొండ లో కాంగ్రెస్ కు భారీ షాక్ 

#మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన నాయకులు

#సీనియర్ కాంగ్రెస్ నేత తండు సైదులు గౌడ్ బి ఆర్ యస్ లో చేరిక

#అదే బాటలో మాజీ జడ్ పి టి సి తుమ్మల లింగస్వామి యాదవ్, నల్లగొండ యం పి పి వైస్ ప్రెసిడెంట్ జిల్లా పరమేష్ తదితరులు.

నల్లగొండ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీకీ భారీ షాక్ తగిలింది.నల్లగొండ, తిప్పర్తి, కనగల్ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకీ రాజీనామాలు చేసి గులాబీ గూటికి చేరారు.పార్టీలో చేరిన వారిలో ఆ పార్టీ సీనియర్ నేత తిప్పర్తి మాజీ జడ్ పి టి సి తండు సైదులు గౌడ్,నల్లగొండ మండల వైస్ యం పి పి పరమేష్ మాజీ యం పి టి సి నాగులంచ లక్ష్మణ్ రావు తదితరులు గులాబీ గూటికి చేరారు.హైదరాబాద్ లో బి ఆర్ యస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక మరియు ఐటీ మంత్రి కలువకుంట్ల తారకరామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నల్లగొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి,జడ్ పి చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తదితరుల సమక్షంలో బి ఆర్ యస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీలో చేరిన నేతలకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి అహ్హనించారు.పార్టీలో చేరిన తండు సైదులు గౌడ్ తిప్పర్తి సర్పంచ్ గా జడ్ పి టి సి గా విధులు నిర్వహించారు.అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకులు తండు నరసింహా గౌడ్ సర్వారం మాజీ యం పి టి సి నాగులంచ లక్ష్మణ్ రావు,పైడిమర్రి మాజీ యం పి టి సి వెంకట్ రెడ్డి,దర్వేశ్ పురం మాజీ చైర్మన్ పాలకూరి గణేష్,తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ యస్ సి సెల్ అధ్యక్షుడు పాల్వాయి సాగర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవరం చల్లా రెడ్డి,తిప్పర్తి గ్రామ కాంగ్రెస్ అద్యక్షుడు నకరబోయిన శ్రీను,బుద్దారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు

ముప్ప మురళీధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లికంటి గంగయ్య,యాపల గూడెం ఉప సర్పంచ్ నక్కా సైదులు,దున్న లతీఫ్,ఎమ్ ఆర్ పి యస్ తిప్పర్తి అధ్యక్షుడు బొజ్జ ఎల్లయ్య,కారింగుల నరేష్ గౌడ్,పల్లె శేఖర్ ,బొంత యాదయ్య, బొంత అంజయ్య, తుమ్మల సైదులు ,దేవురపల్లి మహేష్ రెడ్డి,చింతకుంట్ల చంద్రం,గుర్రం శ్రీనివాస్ రెడ్డి,జక్కలి మల్లేష్ యాదవ్,కొండేటి అంజి,పాలడుగు లింగస్వామి,మందడి మధుసూదన్ రెడ్డి,ఇళ్లేందుల శివ శంకర్, చెదురుపల్లి ప్రకాష్,అలకుంట్ల రమేష్ తదితరులు ఈ రోజు బి ఆర్ యస్ లో చేరిన వారిలో ఉన్నారు.

అభివృద్ధి కొనసాగాలంటే నల్లగొండలో మళ్లీ బిఆర్ఎస్ రావాలి

 బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారి సతీమణి కంచర్ల రమాదేవి నేడు నల్గొండ పట్టణంలోని.. మన ప్రాంతాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. నలగొండ పట్టణంలో 1350 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధిని చూసి.. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాలన్నా ప్రారంభించిన పనులు పూర్తి కావాలన్నా మళ్ళీ కంచర్ల భూపాల్ రెడ్డి గెలవాలని.. అందుకే కారు గుర్తుపై ఓటు వేసి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే కంచర్ల భూపాల్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఇంటింటి చేశారు... ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సమయంలో ప్రజలు ఎదురేగి నుదుట కుంకుమతో ఇంట్లోకి ఆహ్వానించి ఘన స్వాగతం పలికారు.. మాజీ ఆర్ వో మాలే శరణ్య రెడ్డి మందడి లిఖిత సైదిరెడ్డి, , మాజీ కౌన్సిలర్ రావుల రేణుక శ్రీనివాస్ రెడ్డి,కత్తుల సంధ్య, గాలి రాధిక,కంచర్ల విజయ రెడ్డి, కౌన్సిలర్ ఊటుకూరు వెంకటరెడ్డి దోనాల నాగార్జున్ రెడ్డి తదితరులు వెంట ఉన్నారు.

నల్లగొండ 17,35 వార్డులలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మరియు జనంలోకి దూసుకు వెళ్లిన కార్యకర్తల ప్రచార హోరు

నల్లగొండ 17,35 వార్డులలో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ మరియు జనంలోకి దూసుకు వెళ్లిన కార్యకర్తల ప్రచార హోరు 

నల్గొండ 17,35కార్యకర్తలు కలిసి పచ్చ తోరణాలు కట్టి ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకుని, 17వ వార్డు లోని పోచమ్మ గుడిలో కార్యకర్తలు అందరూ కొబ్బరికాయ కొట్టుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, 35 వ వార్డు ఇన్చార్జి తలారి యాదగిరి, నల్గొండ టౌను ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, నల్గొండ టౌన్ కోశాధికారి గంజి రాజేందర్, 17వ వార్డు ఉపాధ్యక్షుడు వనం చంద్రశేఖర్, మూడ వేణు, గంజి లక్ష్మీనారాయణ, జెల్లా శ్రీనివాస్,జెల్లా మధు, దొంత రవి, మిరియాల కిరణ్ కుమార్, కైరం కొండ శివకుమార్, కైరం కొండ అరుణ్,పోశం గిరి, గంజి మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

బిగ్ బ్రేకింగ్... నల్లగొండ 35వ వార్డు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిక...

నల్లగొండ బి.ఆర్.ఎస్ పార్టీలోకి వలసల జోరు... ఆగకుండా పరిగెత్తుతున్న కారు...

నలగొండ 35వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు పున్న సత్యం కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పున్న సత్యంతో పాటు మూడ శేఖర్, గంజి వెంకన్న, జెల్లా వంశీ 17 వార్డు కు చెందిన యువకులు బి ఆర్ ఎస్ పార్టీ కండువా కప్పుకునీ బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో 35వ వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకన్న, 35 వ వార్డు ఇన్చార్జి తలారి యాదగిరి, నల్గొండ టౌను ప్రధాన కార్యదర్శి జయప్రకాష్, నల్గొండ టౌన్ కోశాధికారి గంజి రాజేందర్, 17వ వార్డు ఉపాధ్యక్షుడు వనం చంద్రశేఖర్, మూడ వేణు, గంజి లక్ష్మీనారాయణ, జెల్లా శ్రీనివాస్,జెల్లా మధు, దొంత రవి, మిరియాల కిరణ్ కుమార్, కైరం కొండ శివకుమార్, కైరం కొండ అరుణ్, పోశం గిరీష్, సురేపెల్లి అంజి, రాపోలు ప్రభాకర్, గంజి మహేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు

రేషన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు పెంపు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు.


 ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని నరేంద్ర మోడీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. శనివారం ఛత్తీస్ గఢ్ పర్యటనలో ఉన్న ప్రధాని ఈ ప్రకటన చేశారు. దేశంలోని 80 కోట్ల మంది పేద ప్రజల కోసం తాను ఈ నిర్ణయం తీసుకున్నానని 2028 వరకు పేదలకు ఉచిత రేషన్ బియ్యం బీజేపీ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. కాగా కరోనా టైమ్ లో పేదల కోసం ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు ఉచితంగా అందజేస్తుంది.

బీఆర్‌ఎస్‌ హయాంలోనే సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

బీఆర్‌ఎస్‌ హయాంలోనే సూర్యాపేట ప్రగతిబాట: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి 

గుర్తుల గుర్తుంచుకో అంటూ మంత్రి జగదీష్ రెడ్డి కి మద్దతుగా సూర్యాపేట లో విస్తృత ప్రచారంచేస్తున్న సునిత జగదీష్ రెడ్డి 

10,12 వ వార్డ్ లో ఇంటిటి ప్రచారం

గడగడపను తడుతూ, జనం తో మమేకమవుతూ సాగుతున్న ప్రచారం

పిల్లలమర్రి శివాలయంలో ప్రత్యేక పూజలు

  

   సూర్యాపేట 

గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో’ అంటూ సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి సూర్యాపేట లో గడపగడపనూ తడుతూ వృద్ధులను ఆత్మీయంగా పలుకరిస్తూ, యువతకు దిశానిర్దేశం చేస్తూ జనంతో మమేకమవుతున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు చేపట్టబోయే పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సూర్యాపేటలోని 10,12 వ వార్డ్ లలో ప్రచారం నిర్వహించిన సునీత జగదీష్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.

కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన ఏదో ఒక పథకం ప్రతి పేదోడి ఇంటికి చేరిందని తెలిపారు.. రాష్ట్రం రాకముందు గ్రామాలు ఎలా ఉన్నాయో, ఎలాంటి బాధలు పడ్డామో అందరికీ తెలుసని, రాష్ట్రం ఏర్పడ్డకా పల్లెలన్నీ ప్రగతిబాటన పయనిస్తు న్నాయన్నారు.మిషన్‌ భగీరథ నీటితో గ్రామా ల్లో నీటి గోస తీర్చిన గులాబీ పార్టీని గుండెల్లో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేసి మరో సారి ఆశీర్వదిస్తే మరింతగా అభివృద్ధి చేయడం ఖాయం ఆన్నారు. అంతకుముందు పిల్లలమర్రి శివాలయం లో ప్రత్యేక పూజలు చేసి, శివయ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని ప్రార్థించారు.