/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఇండియాతో ఫైనల్‌కు వచ్చే జట్టు అదే.. కానీ ... Miryala Kiran Kumar
ఇండియాతో ఫైనల్‌కు వచ్చే జట్టు అదే.. కానీ ...

ఇండియాతో ఫైనల్‌కు వచ్చే జట్టు అదే.. కానీ అక్కడ మాత్రం'

వన్డే ప్రపంచకప్‌-2023 రసవత్తరంగా సాగుతోంది. ఈ టోర్నీలో అతిథ్య భారత్‌ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటివరకు 6 విజయాలు సాధించిన టీమిండియా సెమీస్‌ బెర్త్‌ను దాదాపు ఖారారు చేసుకుంది. మరోవైపు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ పరిస్థితి మాత్రం మరీ ఘోరంగా ఉంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో ఐదింట ఓటమిపాలైన ఇంగ్లండ్‌.. సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. 

కాగా పాయింట్ల పట్టికలో టాప్‌-4లో వరుసగా భారత్‌, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫైనల్‌ పోరుకు అర్హత సాధించే రెండు జట్లను ఆస్ట్రేలియా స్పిన్నర్‌ అస్టన్‌ అగర్‌ ఎంచుకున్నాడు. ఈ మెగా టోర్నీ ఫైనల్లో టీమిండియా, ఆస్ట్రేలియా తలపడతాయని అగర్‌ జోస్యం చెప్పాడు.

వరల్డ్‌కప్‌ ఫైనల్‌ కచ్చితంగా భారత్‌- ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. అయితే టీమిండియా టైటిల్‌ ఫేవరేట్‌ అంతా భావిస్తున్నారు. కానీ స్వదేశంలో వరల్డ్‌కప్‌ జరుగుతుండడంతో భారత జట్టుపై కచ్చితంగా ఒత్తడి ఉంటుంది.

ఒత్తడి ఎంత పెద్ద జట్టు అయినా తప్పులు చేస్తుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసి భారీ స్కోర్‌ సాధిస్తే.. ప్రత్యర్ధిపై పై చేయి సాధించే ఛాన్స్‌ ఉందని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అగర్‌ పేర్కొన్నాడు. కాగా అగర్‌ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు.

బీ.ఆర్.ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా.* బీ.ఆర్.ఎస్ పార్టీ వికలాంగుల రాష్ట్ర నాయకులు,తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్

బీ.ఆర్.ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా.

బీ.ఆర్.ఎస్ పార్టీ వికలాంగుల రాష్ట్ర నాయకులు,తెలంగాణ వికలాంగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్,వి-జేఏసీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్, ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లకొండ కుమారస్వామి.

భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేసి,ప్రజల సంక్షేమం కొరకు ఉద్యమం చేస్తా 

నాపై,మా కుటుంబంపై భూ కబ్జా దారుల దాడి చేస్తే ఇంత వరకు బీ.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పరమార్చించే పాపన లేదు,ఈ దాడిఫై ఎందుకు స్పందించలేరూ!ఆదుకొనే నాయకులు లేరా?

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రానికి చెందిన పల్లకొండ కుమారస్వామి అలియాస్ (టి.ఆర్.ఎస్. కుమారస్వామి) బీ. ఆర్. ఎస్ పార్టీ వికలాంగుల రాష్ట్ర నాయకులు,టి.వి.ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మరియు ఎరుకల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఉండి బీ.ఆర్.ఎస్ పార్టీకి అనుబంధంగా పని చేస్తూ ఇన్ని సం,,రాలుగా బీ.ఆర్.ఎస్ పార్టీలో కొనసాగుతూ వస్తున్నాను.

   నాడు ఉద్యమంలో తెరాస పార్టీ నుంచి నేను గత 2009-2023 వరకు 14 సం,,రాలుగా ఇప్పటి వరకు బీ. ఆర్.ఎస్ పార్టీ తరుపున పని చేస్తున్నాను.కొన్ని రోజుల క్రితం 03.10.2023 మంగళవారం రోజున భూ కబ్జా దారులు జున్నుతుల మహేందర్ రెడ్డి, జున్నుతుల శ్రీధర్ రెడ్డి మరి కొంతమందితో మా ఇంటిని జేసీబీతో కుల్చేసే క్రమంలో మా కుటుంబ సభ్యులు అడ్డుకోగా వారిని కొడుతుండగా నేను ఇంట్లో ఉండి వీడియో తీస్తుండగా నాపై జున్నుతుల మహేందర్ రెడ్డి,జున్నుతుల శ్రీధర్ రెడ్డి,మరి కొంతమందితో వికలాంగుడని తెలిసి కూడ ఇంట్లోకి చొరబడి నన్ను హత్య చేయడానికి వచ్చి విపరీతంగా కొట్టడం వల్ల నా దౌడా ఎముక విరిగి,రెండు పండ్లు రాలిపోవడం వల్ల ఇప్పటికి వరకు కోలుకోలేని స్థితిలో ఉన్నాను.నా నోటి ద్వారా అన్నం తినక,ద్రవ పదార్థాలు మాత్రమే అతి కష్టంగా తీసుకుంటున్నాను.నా ఆరోగ్య పరంగా చాలా నష్ట పోయాను.నోటితో మాట్లాడలేక మాట్లాడుతుంటే విరిగిన దౌడా ఎముక నుంచి రక్తస్రవం అవుతుంది.

    హన్మకొండ,వరంగల్ హాస్పిటల్ లో అడ్మిట్ కాగా అన్ని టెస్ట్ లు చేసిన విరిగిన దౌడాకి సర్జరీ చేస్తే తట్టుకోలేవని డాక్టర్స్ సర్జరీ చేయలేమని తెలిపారు.హైదరాబాద్ నిమ్స్ కి వెళ్లి సర్జరీ చేయించుకోవాలని సూచించారు.కనీసం రెండు లక్షలు సర్జరీకి కావాలని చెప్పారు.డబ్బులు లేక సర్జరీకి వెళ్ళలెకపొయాను.ఇంత పెద్ద దాడి సంఘటన జరిగిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి,వికలాంగుల రాష్ట్ర చైర్మన్ వాసుదేవ రెడ్డి,పెద్ది స్వప్న మేడం మరియు చెన్నారావుపేట మండల నాయకులు వచ్చి ఇంత వరకు నన్ను పరామర్చించే పాపన రాలేదు.నన్ను ఆదుకొనే నాథుడే లేడు,నా ఇంటి స్థలంకు రక్షణకు అడ్డు పడితే నన్నే కొట్టారూ.నేను ఏ పాపం చేశాను.ఉద్యమం నుంచి గత 14సం,రాలు తెరాస పార్టీకి మీకు శిశునిగా ఉండి నేను ఎప్పుడు ఎలాంటి పదవులు కావాలని అడిగాలేదే.ఇప్పటి వరకు పార్టీ పరంగా పదవులు ఇవ్వాలని అడగలేదు.

    14సం,రాల క్రితం అప్పుడు ఉద్యమంలో జెండా పట్టుకొని ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న నాయకులు అప్పుడు ఉన్నారని ఎమ్మెల్యేని కోరుతున్నా,మేం పార్టీకి అండగా ఉంటూ సోచల్ మీడియాలో సంక్షేమ పతకాలు గురించి ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేస్తూ అసెంబ్లీ ఎన్నికలో మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించుకున్నాం.ఇప్పుడు మేం మీకు ఏ అన్యాయం చేశాం.నాపై దాడి జరిగితే,దాడి చేసిన వారిపై ఎందుకు నోరు విప్పలేక పోయారని అడుగుతున్న.కనీసం ఫోన్ లో కూడ పలకరింపు లేని నాయకులు ఉన్నారా? ఈ బీ. ఆర్.ఎస్. పార్టీలో మా లాంటి వికలాంగులపై దాడి జరిగితే ఎందుకు మీరు స్పందించలేరు.ఈ తక్కువ జాతికి చెందిన వికలాంగులు మీ పార్టీలో ఉండటం దూర దృష్టకరమా? లేదా తక్కువ జాతి కులమా భవిస్తున్నారా?మీ పార్టీ జెండా పట్టుకొని మీ గెలుపు కోసం ఎంతో కష్టపడ్డం,నన్ను ఆదుకోలేకపోయారే?నాపై,మా కుటుంబంపై జరిగిన దాడికి మనస్తపం చెంది 

ఈ బీ.ఆర్.ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను,త్వరలో ప్రజల కొరకు,ప్రజల సంక్షేమం కోసం భవిష్యత్తు కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటాను.

రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి:వి. కృష్ణ మోహన్ నేషనల్ చైర్మన్కాన్ఫెడరేషన

రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో పలువురు సిబ్బంది, ప్రయాణికులు మరణించడం, గాయాలపాలవడం బాధాకరం.

ఆగని రైల్వే ప్రమాదాలు - ప్రయాణికుల భద్రతకై నేర్వాల్సిన పాఠాలు.

రైల్వేలో 3,15,780 సాంక్షనై ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయండి.

బడ్జెట్ లో కోతలు, చార్జీల పెంపు, స్లీపర్ కోచ్ ల తగ్గింపు, రైళ్ళలో రద్దీ, జాప్యం, రాయితీల ఎత్తివేత, శానిటేషన్, పార్కింగ్ దోపిడీ తదితర సమస్యలను పరిష్కరించండి.

కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలి. భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలి.

రైలు ప్రమాదాలపై సుప్రీంకోర్టు ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తో స్వతంత్ర విచారణ జరిపించాలి.

 జూన్ నెలలో అత్యంత ఘోరమైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదంలో 291 మంది మరణించి 1100 మందికి పైగా గాయపడిన ఘటన మరువక ముందే దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు దుర్ఘటనలను ఉద్యోగుల, ఆఫీసర్ల,పెన్షనర్ల జాతీయ నేత వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి తాజాగా వ్రాసిన లేఖలో పేర్కొంటూ భద్రతా లోపాలను ఎత్తి చూపారు. 

కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫెడరేషన్ (సీ.సీ.జీ.జీ.ఓ.ఓ), దాని అనుబంధ గుర్తింపు పొందిన ఇండియన్ రైల్వే ప్రమోటీ ఆఫీసర్స్ ఫెడరేషన్ (ఐ.ఆర్.పి.ఓ.ఎఫ్) తదితరులు పలుమార్లు వివిధ అంశాలపై సమర్పించిన వినతి పత్రాలను, కాగ్ నివేదికలను జత చేశారు. రైల్వే భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను పరిష్కరించాలని, వ్యవస్థాగత లోపాలను సరిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐ.ఆర్.ఎమ్.ఎస్) పేరిట ఇటీవల ప్రవేశపెట్టిన స్కీం పట్ల పునరాలోచన చేయాలని కోరారు.

హౌరా- విశాఖపట్నం - విజయవాడ - చెన్నై మార్గంలో 2011-12లో అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ రైలు రక్షణ వ్యవస్థ 'కవచ్' నెలకొల్పక పోవడం, సిగ్నలింగ్ టెలీ కమ్యూనికేషన్ కింద కేటాయించిన బడ్జెట్లో అత్యధికంగా ట్రాఫిక్ ఉన్న రైల్వే మార్గంలో ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్, సెంట్రలైజ్డ్ ట్రాఫిక్ కంట్రోల్ తదితరములకు ఒక్క పైసా కూడా ఖర్చు చేయక పోవడం, రైల్వే లైన్లు, సిగ్నల్ వ్యవస్థ, ట్రాకుల ఆధునీకరణ చేపట్టకపోవడం శోచనీయమన్నారు.

రైల్వేలలో కనీస అవసరాలకు ప్రాధాన్యత నివ్వకుండా, సాధారణ ప్రయాణికుడిని విస్మరిస్తూ ఆదాయాన్ని గడిస్తున్న రైల్వే శాఖలో 3.11 లక్షల గ్రూప్ సి పోస్టులు, 3,018 గెజిటెడ్ క్యాడర్ సాంక్షన్ అయిన పోస్టులు ఖాళీగా వున్నా భర్తీకి నోచుకోకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉండటంతో మిగిలిన ఉద్యోగులపై తీవ్రమైన పనిభారం పడుతున్నదని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో చాలా మంది మహిళా లోకో పైలట్లు, ఇతర సిబ్బంది రోజుకు 12 గంటలకు మించి సెలవు లేదా విశ్రాంతి లేకుండా నిద్రలేమి, బిజీ షెడ్యూల్స్ తో పని చేస్తున్నారని తెలిపారు. 

ప్రభుత్వ వాదనలు దాని స్వంత ఆడిటర్‌ అయిన కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గతేడాది నివేదికలో చెప్పిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. రైలు భద్రతపై కాగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ట్రాక్‌ల పునరుద్ధరణకు నిధుల కేటాయింపు తగ్గిందనీ, కేటాయించిన నిధులను కూడా పూర్తిగా వినియోగించడం లేదని పేర్కొన్నది. 2017-2021 మధ్య జరిగిన రైల్వే ప్రమాదాలపై కాగ్‌ విశ్లేషణ ప్రకారం.. ఈ కాలంలో మొత్తం 2017 ప్రమాదాలు జరిగాయి. అందులో పట్టాలు తప్పినవి 1392 ప్రమాదాలు (69 శాతం). అంటే పట్టాలు తప్పి ఢీ కొనటం వంటి రైల్వే ప్రమాదాలే అధికంగా ఉండటం గమనార్హం. అయితే ఈ ప్రమాదాలకు కారణం ‘మానవ తప్పిదం’ అని నిందించటం ఏండ్లుగా ఒక సాధారణ ధోరణిగా మారిందనీ, అయితే కాగ్‌ నివేదిక ప్రభుత్వ వాదనలు తప్పని నిరూపిస్తున్నదని తెలిపారు.

ట్రాక్ ల నిర్వహణ, బడ్జెట్ కేటాయింపులు, వ్యయం, పోస్టుల ఖాళీలపై కేంద్రానిది తీవ్ర నిర్లక్ష్యమని కాగ్ 2022 సెప్టెంబర్ నివేదికలో అక్షింతలు వేసినా, రైలు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినా, లోపాలు ప్రస్తావించినా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.

2017-18లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ రైల్‌ సంరక్ష కోష్‌ (ఆర్‌ఆర్‌ఎస్‌కే) రైల్వే భద్రతా నిధి గురించి కాగ్‌ ఉటంకించింది. 1127 పట్టాలు తప్పగా 289 (26 శాతం) మాత్రమే పునరుద్ధరణ పనులకు నోచుకున్నాయని వివరించింది. ఆర్‌ఆర్‌ఎస్‌కే నుంచి ప్రాధాన్యత-1 పనులపై మొత్తం వ్యయం 2017-18లో 81.55 శాతం నుంచి 2019-20లో 73.76 శాతానికి తగ్గుదల ధోరణిని చూపించిందని పేర్కొన్నది. ట్రాక్‌ పునరుద్ధరణ పనులకు 2018-19లో నిధుల కేటాయింపు రూ.9607.65 కోట్ల నుంచి 2019-20లో రూ.7417 కోట్లకు తగ్గింది అని కాగ్‌ వివరించింది. అత్యంత రద్దీగా ఉండే పశ్చిమ రైల్వే కోసం 2019-20లో మొత్తం వ్యయంలో ట్రాక్‌ పునరుద్ధరణ కోసం ఖర్చు చేసినది 3.01 శాతమే కావటం గమనార్హం. భద్రతకు సంబంధించిన పనులకు ఆర్థిక సాయం అందించటానికి ప్రత్యేక నిధిని సృష్టించే ఏకైక ఉద్దేశ్యం విజయం సాధించ లేకపోయిందని కాగ్‌ పేర్కొన్నది. పట్టాలు తప్పడానికి ప్రధాన కారణం ట్రాక్‌ నిర్వహణ అని వివరించింది. భారత రైల్వే లక్షలాది ఖాళీలతో, నామ మాత్రపు అవుట్‌సోర్సింగ్‌తో కార్యకలాపాలను నిర్వహించిందని కాగ్‌ వెల్లడించింది.

ట్రాక్ ల సమర్థవంతమైన నిర్వహణ, సిగ్నలింగ్ వ్యవస్థ, రోలింగ్ స్టాక్ మొదలైన వాటితో పాటు తగిన సంఖ్యలో నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించడం మరియు అన్నింటికంటే ముఖ్యంగా రైల్వే ఆపరేషన్ యొక్క వివిధ విధుల మధ్య సమర్థవంతమైన సమన్వయంపై ఆధారపడి ఉంటాయి. వీటన్నింటినీ నిర్లక్ష్యం చేయబడ్డాయని తెలిపారు. 2017 లో సమర్పించిన భద్రతపై టాస్క్ ఫోర్స్ సిఫార్సులను, 2015 లో రైల్వే మంత్రిత్వ శాఖ 'శ్వేతపత్రం'ను అమలు చేయలేదు. పాత ట్రాక్ ను యుధ్ధ ప్రాతిపదికన మార్చాల్సి ఉంటుందని, కానీ ఆర్థిక వనరులు లేమి సాకుతో చేయకపోవడంతో బ్యాక్ లాగ్ పెరుగుతూనే ఉన్నదని, అదే సాకుతో పాతబడి పోయిన సిగ్నల్ గేర్ ను కూడా మార్చటం లేదని అన్నారు.

రైల్వేలు ప్రజల ఆస్తియని,మన ప్రజల సొమ్ముతో భారత కార్మికుల కష్టాలతో భారతీయ రైల్వేలు నిర్మించబడ్డాయని పేర్కొన్నారు. రైళ్ళు, రోడ్లు సామాన్య ప్రజలకు సరసమైన రవాణాను అందించడానికి ఉద్దేశించబడినవని, ఇవి ఏ ప్రభుత్వమైనా తన పౌరులకు సరసమైన ధరలకు భద్రతతో అందించాల్సిన సేవలని గుర్తు చేశారు. ప్రైవేటు కార్పొరేట్లకు లాభాలను ఆర్జించే మార్గాన్ని సృష్టించేందుకు భారతీయ రైల్వేలను ప్రైవేటీకరించవద్దని కోరారు.

2017-21 మధ్య కాలంలో 2వేలకు పైగా దుర్ఘటనలు జరిగాయి. వీటి వల్ల జరిగిన ప్రమాదాలు 217 ఉన్నాయి. వీటిల్లో ప్రాణ నష్టం, గాయపడడం, రైల్వే ఆస్తులకు నష్టం వంటివి సంభవించాయి. బృహత్తరమైన రైల్వే వ్యవస్థలో అంతా సవ్యంగా సాగడం లేదు. రైళ్ళు ప్రయాణించే ట్రాక్‌లు, సిగ్నలింగ్‌ వ్యవస్థను నియంత్రించే ఇంటర్‌ లాకింగ్‌ వ్యవస్థలో పొరపాటు కారణంగా బాలాసోర్ ప్రమాదం జరిగిందని రైల్వేబోర్డు, రైల్వే మంత్రి పేర్కొన్నారు. 2017-21 మధ్య కాలంలో రైల్వేస్‌లో రైళ్ళు పట్టాలు తప్పిన ఘటనలపై కాగ్‌ ఇచ్చిన నివేదిక వ్యవస్థలో ఉన్న కొన్ని ప్రమాదకరమైన లోపాలను ప్రముఖంగా ఎత్తిచూపింది. రైల్వే ట్రాక్‌ల్లో నిర్మాణపరమైన లోపాలను, అలాగే పాయింట్లు, లైన్లు, కర్వ్‌లు వంటి అంశాలను తనిఖీ చేసి అంచనా వేసే ట్రాక్‌ రికార్డింగ్‌ కార్ల సోదాలు 30-100 శాతం తగ్గాయని ఆ నివేదిక పేర్కొంది. పట్టాలు తప్పిన 1129 ఘటనల్లో 422 ఘటనలు ఇంజనీరింగ్‌ సమస్యలు (ట్రాక్‌ల నిర్వహణ సరిగా లేక పోవడం (171 కేసులు), ట్రాక్‌ ప్రామాణికాలు పాటించకపోవడం (156 కేసులు) వల్లే జరిగాయని పేర్కొంది. బోగీల చక్రాల్లో లోపాల వల్ల జరిగిన ప్రమాదాలు 182 ఉండగా, పాయింట్లు సరిగా నిర్దేశించక పోవడం, ఇతర పొరపాట్ల కారణంగా 275 ప్రమాదాలు జరిగాయని నివేదిక పేర్కొంది.

జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) రికార్డుల ప్రకారం గడిచిన పదేళ్లలో జరిగిన రైలు ప్రమాదాల్లో 2.6 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 70 శాతం మంది 2017- 21 మధ్య కాలంలో మరణించారని పేర్కొన్నారు.

ప్రారంభించిన రైలునే అట్టహాసంగా మళ్ళీ ప్రారంభించే బదులు సామాన్యులు ప్రయాణించే రైళ్ల బాగోగులు పట్టించుకోవాలని, కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణే అన్నింటికీ పరిష్కారం అనే మానసిక స్థితి నుండి బయటపడి వాస్తవాలను ఆలోచించి ప్రజల భద్రతకు ఏం చేయాలో తెలుసుకుని ఇప్పటికైనా పూనుకోవాలని, దుఃఖితులకు ఓదార్పునివ్వాలని కోరారు. ప్రతి వందేభారత్ కోసం రైల్వే రూ. 115 కోట్లు పైగా వెచ్చిస్తున్నదని, 2027 తర్వాత ప్రారంభమయ్యే బుల్లెట్ ట్రైన్ వంటి అసాధారణ రేట్లుండే రైళ్ళతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఒరిగేదేముంటుందని ప్రశ్నించారు. 

తమ వైఫల్యం, అసమర్థతలను, చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకే ఘోర రైలు ప్రమాదంలో కుట్ర కోణాన్ని తెరపైకి తెచ్చారని, ఎక్కడ పెద్ద ప్రమాదం జరిగినా రైల్వే మంత్రిత్వ శాఖకు ఇది అలవాటేనని ఆయన పేర్కొన్నారు. ఐటీ సెల్‌ లోని పెయిడ్‌ ఆర్టిస్టులు దానికి అన్ని రకాల అబద్ధాలూ గుప్పించి, మతపరమైన మసాలా జోడించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని, దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేసరికి ప్రజలు దాన్ని మర్చిపోతారని ఆయన పేర్కొన్నారు. 

2023 మార్చిలో రైల్వే భద్రతపై పార్లమెంటరీ ప్యానెల్ సమర్పించిన నివేదికలో రైల్వే మంత్రిత్వ శాఖ అలసత్వాన్ని ఎత్తి చూపిందని, రైల్వే భద్రతకు సంబంధించిన నివేదికలు విస్మరించబడుతున్నాయని వివరించిందని తెలిపారు. కమిషన్‌ ఆఫ్‌ రైల్వే సేఫ్టీ (సీఆర్‌ఎస్‌) చేసిన సిఫారసులు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి అత్యంత ప్రాముఖ్యతను పొందవల్సి ఉన్నప్పటికీ అది వాస్తవానికి భిన్నంగా ఉన్నదనీ, తక్కువ శ్రద్ధను కలిగి ఉన్నదని పేర్కొన్నది. రైలు ప్రమాదాలు పునరావృతం కాకుండా ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా ఏటీఆర్‌లను సమర్పించడానికి కాలపరిమితిని నిర్ణయించాలని ప్యానెల్‌ ఆ నివేదికలో సిఫారసు చేసిందని గుర్తు చేశారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు విఘాతం కలిగించే విధానాలను విడనాడాలని,కాగ్, పార్లమెంటరీ ప్యానెల్, నిపుణుల సిఫార్సులను అమలు పరచాలని వి. కృష్ణ మోహన్ ప్రధాన మంత్రికి విజ్ఞప్తి చేశారు.

అభివృద్ధిని చూసి ఆదరించండి: సునీత జగదీశ్వర్ రెడ్డి

రాష్ట్ర సుభిక్షం.. బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

రాష్ట్ర సుభిక్షం.. బీఆర్‌ఎస్‌తోనే సాధ్యం: గుంటకండ్ల సునిత జగదీష్ రెడ్డి

 సూర్యాపేట 

 బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి పట్టం కట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునీత జగదీశ్ రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. సూర్యాపేట పట్టణంలోని 31వ వార్డులో కౌన్సిలర్, మహిళా ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి జోరుగా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి కారుగుర్తుకు ఓటు వేయాలని కోరారు. టిఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ ఆప్యాయంగా పలకరించారు.

. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ జరగని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటిస్థానంలో ఉందన్నారు. ప్రజల శ్రేయస్సుకు, రాష్ర్టాభివృద్ధికి ఎంతో ముందుచూపు ఆలోచనతో సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వివరించారు. ప్రజా సంక్షేమ పథకాలు, సూర్యాపేట అభివృద్ధి ఎవరూ చేశారో ప్రజలకు తెలుసని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీ మరింత అభివృద్ధిని సాధించాలంటే ఎమ్మెల్యే గా జగదీష్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

 

గడపగడపకూ వెళ్లి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కారుగుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. వార్డుల్లో కదిలిన గులాబీదండుతో వార్డులు గులాబీమయంగా మారాయి.

నల్లగొండ మున్సిపల్ చైర్మన్ వార్డులో కదిలిన భూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార రథం.. ఒక పండగల కదిలించిన జన సమూహం..

బి ఆర్ ఎస్ పార్టీ నల్గొండ శాసనసభ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి గారు... 17, 16, 15 వార్డులలో.. విస్తృతంగా తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

 మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి సొంతవార్డు కావడంతో...

 పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు..

 అడుగడుగునా కంచర్లకు జననీరాజనాలు..

 చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు జెండాలు చేత బుని కారు గుర్తు గెలవాలని, మళ్లీ కంచర్ల ఎమ్మెల్యేగా... గెలవాలని నినాదాలు చేస్తూ ముందుకు సాగిన వందలాదిమంది జనం.

 ఆర్జాల బావి, తదితర సమావేశాల్లో మాట్లాడిన కంచర్ల...

 నల్లగొండలో... 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శనవేగంగా కొనసాగుతున్నాయని మరో రెండు సంవత్సరాల్లో అవి పూర్తవుతాయని అవి పూర్తి కావాలంటే మళ్ళీ నల్లగొండలో గులాబీ జెండా ఎగరాలే కెసిఆర్ ప్రభుత్వమే రావాలనిఅన్నారు.

 ఇందుకు మీ సహకారము ఆశీర్వచనాలు కావాలని.. చైతన్యవంతులైన నల్లగొండ ప్రజలు నల్లగొండ అభివృద్ధిని చూసి తనను తప్పక మళ్ళీ గెలిపిస్తారని విశ్వాసం తమకు ఉందని, ఉన్నారు..

 నల్లగొండ ప్రజలు... కరోనాతో విలవిల లాడుతూ హాస్పిటల్ లో వందలాదిమంది... చికిత్స పొందుతుంటే.. తను వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వారిని.. పరామర్శించి ధైర్యం చెప్పానని... వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించాలని... కరోనాతో మరణించిన వారి.. దహన సంస్కారాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయలేకపోతే తానే దగ్గర ఉండి ఆ విధులు నిర్వహించానని... మరి నల్లగొండలో నాలుగు సార్లు గెలిచిన కోమటిరెడ్డి ఎక్కడ ఉన్నాడో ప్రజలు ప్రశ్నించాలని కోరారు.. నిరంతరం ప్రజల మధ్య 365 రోజులు ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ.. మీ మధ్యన ఉన్నానన్నారు.

 గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి.. బత్తాయి మార్కెట్ తెస్తానన్నాడు మెడికల్ కాలేజ్ తెస్తానన్నాడు, ఐటీ మంత్రిగా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తానన్నాడు... వీటిలో ఏ ఒక్కటి తేలేదని, కెసిఆర్ నాయకత్వంలో అవన్నీ తాము తీసుకొచ్చామని,పానగల్ మర్రిగూడ, బైపాస్ రోడ్ ల లో ఫ్లైఓవర్ నిర్మించకుండా...

 పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలు బలిగొన్నాడనన్నారు.

 ఇప్పుడు ఆ రెండు ఫ్లై ఓవర్ ల లో పానగల్ ఫ్లైఓవర్ పూర్తయిందని మర్రిగూడ ఫ్లైఓవర్ శర వేగంగా నిర్మాణం అవుతుందన్నారు.

 

తను నిరంతరం ప్రజలకు ప్రజల మధ్యన ఉంటూ... ప్రజల్ని నమ్ముకున్నానని... కానీ కోమటిరెడ్డి నోట్ల కట్టలతో... నాయకులను కొని వారిని నమ్ముకున్నాడని... అలాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలని కంచర్ల కోరారు.

 

కెసిఆర్ మళ్ళీ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యాక... ఆసరా పెన్షన్లు 3016 నుంచి 5016 వరకు విడతల వారిగా పెంచుతారని, దివ్యాంగుల పెన్షన్ 6016 చేస్తారని, రైతుబంధు 12000 నుంచి 16 వేల వరకు విడుతలవారీగా పెంచుతారని, అర్హులైన మహిళలకు ₹3,000 భృతి అందిస్తారని, గ్యాస్ సిలిండర్ 400 రూపాయలకే అందిస్తారని, బిపిఎల్ కుటుంబాల అందరికీ ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వర్తింప చేస్తామని తెలిపారు. నల్లగొండ అభివృద్ధి కొనసాగాలంటే రెండవసారిగా మీ సేవకుడిగా రక్షకుడిగా .. కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,మోదుగు రాజ వర్ధన్ రెడ్డి, పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, 16వ వార్డు ఇంచార్జ్ దాసరి రమేష్,15 వ వార్డు ఇంచార్జి దొడ్డి రమేష్, యుగంధర్ రెడ్డి ఇస్రం రవి,ముదిరెడ్డి శ్రీనివాసరెడ్డి,కట్టా హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు విచక్షణ తో ఆలోచన చేసి ఓటయ్యాలి...

...................

ప్రజలు విచక్షణ తో ఆలోచన చేసి ఓటయ్యాలి...

తుంగతుర్తి ప్రాంతO పోరాటాల గడ్డ.... గత ప్రభుత్వాల హయం లో కరువు బారిన పడ్డది..

ఇవ్వాళ తుంగతుర్తి పచ్చగా మారింది.. కాల్వలు, చెరువులలో కళ కళ లాడుతుOది..గోదావరి జలాలు అద్భుతమైన ప్రగతి తెచ్చింది.. లక్షన్నర ఎకరాల్లో పంటలు పండుతున్నాయి...బునాది గాని కాల్వల ద్వారా నీళ్లు అందిస్తాము...ఈ నియోజకవర్గంలో టోటల్ గా 

2 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాము...

తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కాంగ్రెస్ వంచించింది... మనతో పొత్తు పెట్టుకొని కూడా మోసం చేసింది.. చివరకు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని పోరాటం చేస్తే స్వరాష్ట్రం సాదించుకున్నాం...తెలంగాణ కోసం యువత ఆత్మహత్య చేసుకున్నారు...ఎట్టకేలకు గమ్యాన్ని ముద్దాడాము..

మన ప్రభుత్వం లో

ఆసరా పెన్షన్ పెంచుతూ వచ్చాము.. కల్యాణ లక్ష్మీ పథకం రూపాయలను కూడా పెంచుకుంటూ వచ్చాము.. ఆదాయాన్ని పెంచి, పంచాము...

రైతు బంధు పథకాన్ని స్టార్ట్ చేసాము..సక్సెస్ అయింది...తెలంగాణ లో ఆత్మహత్య లు, వలసలు వుండే.. ఇవ్వాళ అన్నిటికీ చరమగీతం పాడాము...అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాం.. ఇది అందరికి గర్వకారణం....తుంగతుర్తి లో ఎండ కాలంలో కూడా నీళ్లు మత్తడి దుంకుతున్నాయి...UP ముఖ్యమంత్రి వచ్చాడు...మనకు పాఠాలు చెప్తాడు... కర్ణాటక DY ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి రైతులకు 5 గంటలు  ఇస్తున్నాం అంటున్నాడు..

ఇలాంటి మోసకారులు కూడా తెలంగాణ కు వచ్చి నీతులు చెవుతారు... తస్మాత్ జాగ్రత్త....అందరి పట్ల అప్రమత్తంగా ఉండాలి...నల్గొండ దామరచర్ల లో 30 వెల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ కడుతున్నాం....దళిత బంధు పథకం అద్భుతమైన మార్పు తెస్తుంది... దశాబ్దాలుగా దళితులు  మోసానికి గురవుతున్నారు... అందుకే తెలంగాణ లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తునం.. ఈ నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్టుగా తిరుమల గిరి మండలం లో అమలు చేసాము.....ఈ నియోజకవర్గ ములో mla గాదరి కిషోర్ కుమార్ మంచి పనులు చేశారు....గాదరి కిషోర్ ను లక్ష ఓట్ల మెజారిటీ తో గెలిపించండి...ఉద్యమం లో నాతో పని చేసాడు.. గొప్ప పోరాటం చేసాడు... ఈ ఎన్నికల్లో కిషోర్ మంచి మెజార్టీతో గెలిలవాలి....గాదరి కిషోర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో మొత్తం దళిత బంధు అమలు చేస్తాం..

mla గాదరి కిషోర్ యువకుడు, ఉత్సాహవంతుడు... గెలిపించుకోండి...కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తే తెలంగాణ ఆగం అవుతుంది....కరంట్ ఖతం అవుతుంది... కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తాం అంటున్నారు ..అది ఎంత ప్రమాదమో మిరే ఆలోచన చేయాలి... ధరణి రావడం వల్ల అవినీతి అంతం అయింది... ధరణి రద్దు అయితే అవినీతి రాజ్యం వస్తుంది.... మళ్ళీ కొట్లాటలు వస్తాయి... రైతు బంధు కూడా రాదు... ..ధరణి రైతులకు గుండె కాయ లాంటిది...రైతు బంధు వెస్ట్ అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు ...వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి .....

నచ్చిన కారు తీసుకో... ఆర్చర్ సీతల్ దేవికి ఆనంద్ మహేంద్ర ప్రశంస

నచ్చిన కారు తీసుకో... ఆర్చర్ సీతల్ దేవికి ఆనంద్ మహేంద్ర ప్రశంస

తాజాగా ఆసియా పారా గేమ్స్‌ బంగారు పతక విజేత, ఆర్చర్‌ శీతల్ దేవిని ప్రశంసిస్తూ 'ఎక్స్‌' (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టిన ఆనంద్‌ మహీంద్రా తమ కంపెనీ కార్లలో ఆమెకు నచ్చిన కారును తీసుకోవాలని కోరారు. దాన్ని ఆమె నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తామని కూడా చెప్పారు.

రెండు చేతులూ లేని శీతల్ దేవి ఆసియా పారా గేమ్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు బంగారు పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా అవతరించింది. 'జీవితంలో ఇంకెప్పుడూ చిన్న చిన్న పనికిమాలిన సమస్యల గురించి ఆలోచించను. శీతల్‌దేవీ.. నువ్వు అందరికీ స్ఫూర్తి ప్రదాతవు. నీ నుంచి ఎంతో నేర్చుకోవాలి. మా కంపెనీ కార్లలో నీకు నచ్చినది తీసుకో. దాన్ని నువ్వు నడిపేందుకు వీలుగా తయారు చేసిస్తాం' అని ట్వీట్‌లో రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా. ఆమె కఠోర సాధనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు.

ఈ ట్వీట్‌కు యూజర్ల నుంచి విశేష స్పందన వచ్చింది. చాలా మంది ఆనంద్‌ మహీంద్రను అభినందిస్తూ కామెంట్లు చేశారు.

మూడు రోజుల క్రితం నా చిన్న కూతురు చనిపోయింది.. కనీసం నా రెండు కూతుర్ని కాపాడుకునే ఆర్థిక శక్తి నా దగ్గర లేదు కావున నన్ను ఆదుకోండి ప్రజలారా...

మిత్రులందరికీ నమస్కారం మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మిషన్ స్కూల్ గ్రౌండ్ నందు నా పేరు వట్టం రాజు wo/అనుష మా ఇద్దరి కుమార్తెలు మా యొక్క చిన్న పాప మూడు రోజుల కిందట జ్వరంతోనే మరణించడం జరిగినది అదే విధంగా మా యొక్క పెద్ద కుమార్తె వట్టం ప్రణీత పాప కూడా హైదరాబాద్ బంజారాహిల్స్ లిటిల్ స్టార్ హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నది రక్త కణాలు పడిపోయి బాడీ ఇన్ఫెక్షన్ అయిందని డాక్టర్ గారు చెప్పడం జరిగినది ఈ యొక్క వైద్య నిమిత్త ఖర్చు సుమారు నాలుగు లక్షల నుండి 5 లక్షల వరకు అవుతాయి అని చెప్పడం జరిగినది మాది చాలా నిరుపేద కుటుంబం దాతలు ఎవరైనా మాకు సహకరించగలరని కోరుకుంటున్నాం అన్న పుట్టడి దుఃఖంలో మా యొక్క చిన్న కుమార్తె చనిపోయిన తర్వాత పెద్ద కుమార్తెకు ఇలా ఇవ్వడం జరిగింది పెద్దమనిషి చేసుకొని మా పాపను బతికించగలరని కోరుకుంటున్నాం అన్న                        

  మా యొక్క అకౌంట్ నెంబర్ SBI BANK ACCOUNT NUMBER 39053856697 IFCD CODE SBIN0020162 PHONE pay number 7702888034

ఎన్నికల మేనిఫెస్టోలో చేతి వృత్తిదారుల సమస్యలను చేర్చాలి‌‌

ఎన్నికల మేనిఫెస్టోలో చేతి వృత్తిదారుల సమస్యలను చేర్చాలి‌‌.

_

రాబోయే ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో చేతివృత్తిదారుల సంక్షేమం వృత్తి రక్షణ కోసం జనాభా ప్రాతిపదికన బడ్జెట్లో నిధుల వాటా పెంచాలని వృత్తిదారుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బండ శ్రీశైలం, జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ డిమాండ్ చేశారు.

       

శనివారం నాడు నల్లగొండలో జరిగిన చేతి వృత్తిదారుల సంఘం సమావేశం దొడ్డి కొమురయ్య భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తి దారులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేసి వాటికి పాలకమండలి ఏర్పాటు చేసి విధి విధానాలు ప్రకటించాలని అన్నారు. వృత్తిదారులలో ఉన్న నిరుపేదలకు గృహలక్ష్మి పథకం అమలు చేయాలి ,అన్ని వృత్తుల వారికి బీసీ బందు ఇవ్వాలి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి వృత్తిదారునికి 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి, భూమిలేని వృత్తిదారులందరికీ మూడు ఎకరాల భూమి ఇవ్వాలి ,ప్రతి వృత్తిదారునికి 10 లక్షల రూపాయలు జీవిత బీమా ఇవ్వాలి ,గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయాలి, చేతి వృత్తిదారుల కుటుంబాలకు విద్యా వైద్యం ఉచితంగా అందించాలని పై డిమాండ్లన్నింటినీ వివిధ రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

      

 ఈ సమావేశంలో వృత్తి సంఘాల నాయకులు అవిశెట్టి శంకరయ్య, కందగట్ల గణేష్, కొండ వెంకన్న, శ్రీనివాస్, పెద్దలు, మల్లేశం, ఐలయ్య, కర్నాటి శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు.