విపక్ష కూటమిలోకి ఐఎన్ఎల్డీ ముహూర్తం ఖరారు
ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్,ఇండి-కూటమి,లోకి త్వరలో మరో కొత్త పార్టీ చేరనుంది.
సెప్టెంబర్ 25న మాజీ ఉప ప్రధాని చౌదరి దేవిలాల్ జయంతి సందర్భంగా హర్యానాలోని కైతాల్‌లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్,ఐఎన్‌ఎల్డీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఇండి కూటమిలోని పార్టీల నేతలందరినీ ఆ సభకు ఆహ్వానించింది. విపక్షాల ఐక్యతను చాటే వేదికగా ఈ సభను మార్చి, అదే వేదికపై ఇండి కూటమిలో చేరే విషయంపై స్పష్టతనిచ్చే అవకాశం ఉంది.
దేవీ లాల్ గౌరవార్థం జరు గుతున్న ఈ భారీ సభకు వివిధ విపక్ష నేతలను ఆహ్వానిస్తున్నట్టు ఆ పార్టీ నేత అభయ్ చౌతాలా తెలిపారు. చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన ఓ మీడియా సమావేశంలో అభయ్ చౌతాలా, జేడీయూ,నేత కేసీ త్యాగి సంయుక్తంగా మాట్లాడుతూ..
భారతీయ జనతా పార్టీ బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని తాము కూడా కోరుకుంటున్నామని, త్వరలోనే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను కలుస్తానని ప్రకటించారు.
తాము తలపెట్టిన బహిరంగ సభకు హాజరుకావాల్సిందిగా సోనియా గాంధీ, మల్లి కార్జున ఖర్గేలకు ఇప్పటికే ఆహ్వానం పంపామని తెలిపారు. అయితే వారు హాజరవుతున్నారా లేదా అన్న విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అన్నారు.
కూటమిలో ఉన్న 95% పార్టీలు తమ సభకు హాజరవుతామన్నారని చౌతాలా తెలిపారు. కొన్ని పార్టీల అధి నేతలు నేరుగా హాజరవుతుండగా, మరి కొందరు తమ ప్రతినిధులను పంపిస్తున్నారని అన్నారు.
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ ఆ సమయంలో విదేశాల్లో ఉంటానని చెప్పారని, ఆమె కూడా హాజరైతే బావుండని తాము కోరుకుంటున్నట్టు చౌతాలా అన్నారు..
Sep 17 2023, 12:24