Nara Lokesh: నారా లోకేశ్ అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ సమావేశం
![]()
దిల్లీ: చంద్రబాబు అరెస్టు అక్రమమని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చే ప్రధాన అజెండాగా నేడు దిల్లీలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది..
ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు తెదేపా ఎంపీలు భేటీకానున్నారు..
పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. చంద్రబాబు అరెస్టు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లేలా వ్యూహ రచన చేయనున్నారు. వివిధ పార్టీల మద్దతుతో చంద్రబాబు అరెస్టు అంశం ఉభయసభల్లో చర్చకు తీసుకెళ్లేలా కసరత్తు చేయనున్నారు. కాగా ఇప్పటివరకూ తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతూ వచ్చేది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉండటంతో తొలిసారి లోకేశ్ ఆధ్వర్యంలో జరగనుంది..

						




Sep 16 2023, 13:12
- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
0- Whatsapp
 
								    - Facebook
 
							       
								  - Linkedin
 
								  - Google Plus
 
								 
							   
17.2k