Tummala: భారాసకు తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా
![]()
హైదరాబాద్: భారాసకు తుమ్మల నాగేశ్వరావు (Tummala nageswa rao) రాజీనామా చేశారు. భారాసలో తనకు సహకరించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు..
కాగా ఇవాళ సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతున్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మలతోపాటు భాజపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి తదితరులు సైతం కాంగ్రెస్‌లో చేరతారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేటి ఇప్పటికే దరఖాస్తు చేశారు. ఈ రెండు స్థానాల విషయంలో వీరిద్దరి మధ్య సర్దుబాటు చేసేందుకు పార్టీ ప్రయత్నిస్తోంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో తుమ్మల శనివారం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలంగాణ ఉద్యమ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డి తెలిపారు..





Sep 16 2023, 11:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.9k