/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz బీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దే రూప్‌ సింగ్‌ Miryala Kiran Kumar
బీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దే రూప్‌ సింగ్‌

బీడీ టేకేదారుల్లో ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌దే రూప్‌ సింగ్‌

బిడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టేకేదారులు క్షీరాభిషేకం చేశారు.

బీడీ కార్మికుల తరహాలో టేకేదారులకు ఆసరా పింఛను ఇవ్వడం పట్ల రాష్ట్ర బీడీ టేకేదారుల సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి టేకేదారులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యదర్శి, టేకేదారుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎల్‌ రూప్‌ సింగ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పింఛన్లు అమలు చేసి ఆత్మగౌరవాన్ని నింపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. 6 లక్షల మంది బీడీ కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమను ఆదుకుంటున్న సీఎం కేసీఆర్‌కు యావత్‌ బీడీ కార్మికులు రుణపడి ఉంటారని తెలిపారు.

దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో బీడీ పరిశ్రమలు ఉండగా.. తెలంగాణ మినహా ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీడీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క రూపాయి ఇవ్వడం లేదని రూప్‌ సింగ్‌ తెలిపారు. రకరకాల పేర్లతో బీడీ పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసిన ఎరుకల సంఘం నాయకులు

.

ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసిన ఎరుకల సంఘం నాయకులు

       

          సంగెం మండలం..

నేడు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి నివాసంలో ఎరుకల సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేసి,శాలువతో సన్మానం చేయడం జరిగింది.సంగెం రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరహరి ఆధ్వర్యంలో ఎరుకల వివిధ సమస్యలను ఎమ్మెల్యే గారికీ వివరించారు.అందులో ముఖ్యంగా ఎరుకల పిగ్ ఏంపర్మెంట్ స్కీమ్ కింద 60 కోట్లు ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు.ప్రతి మండల సోసైటీ కి 40 లక్షలు మంజూరైనందున మా మాడలానికి ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఇవ్వాలని ఎరుకల సంఘం మండల నాయకులు పల్లకొండ బిక్షపతి మరియు రాయపురం సాంబ శివ గారు కోరారు.ఈ విషయం పై సానుకూలంగా స్పందించి ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఎరుకల సోసైటీకి ఇప్పించండని స్థానిక ఎంపీపీకి ఎమ్మెల్యే తెలిపారు.ఎరుకల కులస్థులకు గృహ లక్ష్మిలో ప్రాధాన్యత చూపాలని తెలియజేశారు..

   

 ఈ కార్యక్రమంలో ఎరుకల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కేతిరి రాజశేఖర్,హన్మకొండ జిల్లా అధ్యక్షులు లోకిని సమ్మయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిపాటి రమేష్,సంగెం మండల అధ్యక్షులు పల్లకొండ బిక్షపతి, పిగ్ సోసైటీ మండల చైర్మన్ రాయపురం సాంబశివ,ప్రధాన కార్యదర్శి రాయపురం రాజు,ప్రచార కార్యదర్శి పల్లకొండ కుమారస్వామి,డైరెక్టర్లు రాయపురం మల్లేష్,సమ్మయ్య,జనార్దన్,కుమారస్వామి,శ్రీనివాస్,మల్లయ్య,రాజేష్, ఎల్లస్వామి,ఎల్లయ్య,సదానందం,స్వామి,సాంబమూర్తి,సమ్మక్క,యాకమ్మ,సంతోష తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డిలో కేసీఆర్‌కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం

కామారెడ్డిలో కేసీఆర్‌కు బ్రహ్మరథం.. సీఎంకే ఓటేస్తామని పది పంచాయతీల ఏకగ్రీవ తీర్మానం

కామారెడ్డి నుంచి పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు ఆ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పది గ్రామ పంచాయతీలు ఆయనకే ఓటేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు ఆమోదించాయి.

కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన సీఎం కేసీఆర్‌కే ఓట్లు వేస్తామంటూ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి మండలంలో ఉన్న ఎల్లంపేట, అంకిరెడ్డిపల్లి, నడిమి తండా, వెనుక తాండ, బోడగుట్ట తండా, మైసమ్మ చూరు, రాజకన్ పెట్, వడ్డెర గూడెం, గుంటి తండా, దేవునిపల్లి గ్రామపంచాయతీలు సీఎం కేసీఆర్‌కే ఓటేసి, ఆయన్ను గెలిపిస్తామని ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించాయి. శనివారం మాచారెడ్డి మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాసంలో ఆమెను కలిసి సంబంధిత తీర్మాన ప్రతులను అందించారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీలు, కార్యకర్తలు రావడం ఏకగ్రీవ తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకు గజ్వేల్‌తోపాటు కామారెడ్డిలోనూ సీఎం కేసీఆర్ పోటీ చేయాలని పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ఈ నిర్ణయంతో రెండు నియోజకవర్గాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నూతన ఉత్సాహం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కామారెడ్డి రావడంతో కేవలం కామారెడ్డి జిల్లాకే కాక ఉమ్మడి నిజామాబాద్ తోపాటు పొరుగున ఉన్న నాలుగైదు జిల్లాలు అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతాయని తాను విశ్వసిస్తున్నానని స్పష్టం చేశారు.

కామారెడ్డిలో కేసీఆర్‌ పోటీ చేయడాన్ని నిజామాబాద్ బిడ్డగా తాను స్వాగతిస్తున్నానని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. అందరిలాగే తనకూ ఉత్సాహంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ కే ఓట్లు వేస్తామని ఏకగ్రీవంగా తీర్మానాలు చేయడం చాలా అద్భుతంగా అనిపిస్తోందని, ఏకగ్రీవ తీర్మానాలు చేసిన పది గ్రామాల ప్రజలకు కవిత ధన్యవాదాలు తెలియజేశారు. కారుకు ఎదురు లేకుండా సాగిపోయేలా 10 గ్రామ పంచాయతీల ప్రజలు ఉత్సాహాన్ని ఇచ్చారన్నారు. ఇదే ఉత్సాహం ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఉండేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో పోటీ చేస్తే మరింత అభివృద్ధి అవుతుందన్న ఉద్దేశంతో గంప గోవర్ధన్ కేసీఆర్‌ను ఆహ్వానించారని వివరించారు.

పార్టీలకు అతీతంగా మాచారెడ్డి మండలంలోని గ్రామపంచాయతీలు తీర్మానం చేశాయని, షబ్బీర్ అలీ వంటి వారు ఎన్ని మాట్లాడినా ప్రజలు సీఎం కేసీఆర్‌ను పార్టీలు, కులాలు, మతాలకతీతంగానే చూస్తారని తేల్చి చెప్పారు. కామారెడ్డి లోని సబ్బండ వర్గాల ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ బోళా శంకరుడు అని, ఆయనకు ఆయన చేతికి ఎముకంటూ ఉండదని, కాబట్టి కామారెడ్డి తో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. సీఎం కేసీఆర్ గెలుపుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈనెల 28న కామారెడ్డిలో జరిగే భారీ సమావేశంలో తాను కూడా పాల్గొంటానని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు. ఇంటింటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్న విషయాన్ని వివరించాలని నాయకులకు కార్యకర్తలకు కవిత దిశానిర్దేశం చేశారు. కామారెడ్డి ప్రజలు తమ పౌరుషం చూపేందుకు ఇది సరైన సమయం అని తెలిపారు. గజ్వేల్ కన్నా ఒక్క ఓటైనా ఎక్కువ మెజారిటీ తెప్పించి చూపాలని అన్నారు.

అవార్డులు వచ్చిన గ్రామపంచాయతీలకు కవిత అభినందనలు తెలిపారు. రాజకీయంగా మనల్ని వ్యతిరేకిస్తున్న పార్టీలు కూడా మన గ్రామాల అభివృద్ధిని ప్రశంసిస్తున్నాయన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మన పల్లెల అభివృద్ధిని చూసి అవార్డులు సైతం ఇస్తున్నదని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు బాగుండాలన్న కేసీఆర్ పట్టుదల తోనే ఇవన్నీ సాధ్యమయ్యాయని వివరించారు. కామారెడ్డికి కాళేశ్వరం ప్యాకేజీ 22 ద్వారా నీళ్లు వస్తాయని, సిరిసిల్ల నుంచి కూడా నీటిని తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, కార్పొరేషన్ల చైర్మన్లు అయాచితం శ్రీధర్, మఠం బిక్షపతి, మేడే రాజీవ్ సాగర్, మాచరెడ్డి ఎంపీపీ నర్సింగ్ రావ్ , గాంధారి మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యం రావ్, మండల పార్టీ అధ్యక్షుడు బాల్ చంద్రం, కామారెడ్డి సీనియర్ నాయకులు తిరుమల రెడ్డి పాల్గొన్నారు.

కంగ్రాట్స్‌ అల్లు అర్జున్‌: సీఎం కేసీఆర్

కంగ్రాట్స్‌ అల్లు అర్జున్‌

తన అత్యుత్తమ నటన ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దకించుకొన్న ప్రముఖ సినీహీరో అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో..

తెలుగు చలనచిత్రాలు సత్తాచాటడంపై ఆయన శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. 69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా అవార్డు దకడం గర్వకారణంగా ఉన్నదని చెప్పారు.

69 ఏండ్లకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు దక్కడం హర్షనీయం

తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు గర్వకారణం

తెలుగు చిత్ర రంగాభివృద్ధికి మరింత కృషి: సీఎం కేసీఆర్‌

తన అత్యుత్తమ నటన ద్వారా జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దకించుకొన్న ప్రముఖ సినీహీరో అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో.. తెలుగు చలనచిత్రాలు సత్తాచాటడంపై ఆయన శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తంచేశారు. 69 ఏండ్లలో తొలిసారి తెలుగు హీరోకి ఉత్తమ నటుడిగా అవార్డు దకడం గర్వకారణంగా ఉన్నదని చెప్పారు. నాటితరం గొప్పనటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా, విలక్షణ నటులైన చిరంజీవి స్ఫూర్తితో నేటితరం నటుడిగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్‌ కృషి గొప్పదని కొనియాడారు.

తన సృజనాత్మక రచనతో సినీపాటల సాహిత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ఆసార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్‌కు ఉత్తమ సినీ సాహిత్యానికి జాతీయ అవార్డు దకడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తంచేశారు. చంద్రబోస్‌కు శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు. ఉత్తమ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌, ఉత్తమ ప్లేబ్యాక్‌ సింగర్‌ కాళభైరవ, ఉత్తమ ఫిల్మ్‌ క్రిటిక్‌ పురుషోత్తమాచార్యులతోపాటు ఆయా విభాగాల్లో జాతీయ అవార్డులు పొందిన పలు సినిమాలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు, సాంకేతిక సిబ్బందికి సీఎం కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. తెలుగు చలనచిత్ర రంగం హైదరాబాద్‌ కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో తన ప్రతిభను చాటుతుండటం గొప్ప విషయమని పేర్కొన్నారు.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షాదరణ పొందుతూ, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌లో తెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలువడం గర్వ కారణమని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో హైదరాబాద్‌ కేంద్రంగా తెలుగు సినిమా భారతీయ సినిమాతో పోటీపడుతుండటం అభినందనీయమని అన్నారు. తెలుగు చిత్ర రంగాభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కృషి కొనసాగిస్తూనే ఉంటుందని భరోసా ఇచ్చారు. విభిన్న సంస్కృతుల మేళవింపుతో భవిష్యత్తులో తెలుగు సినిమా విశ్వవ్యాప్తంగా మరింతగా విస్తరించాలని ఆకాంక్షించారు.

నల్లగొండ స్థానిక హనుమాన్ దేవాలయం లోని మహాలక్ష్మి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల

 

నేడు నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు.. స్థానిక తులసి నగర్ హనుమాన్ దేవాలయం లో... నూతనంగా నిర్మాణం చేసిన మహాలక్ష్మి దేవాలయ లక్ష్మీ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు...

 ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, స్థానిక కౌన్సిలర్ మారగోని నవీన్ గౌడ్.. ఆలయ కమిటీ చైర్మన్ నేలపట్ల రమేష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

కోటి వృక్షార్చన హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్గొండ లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నేడు కోటి వృక్షార్చన హరితహారం కార్యక్రమంలో భాగంగా....

 రైల్వే స్టేషన్ సమీపంలో... వివిధ రకాల మొక్కలనునాటారు... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి... ముఖ్య అతిథులుగా పాల్గొని... వివిధ రకాల మొక్కలు నాటారు...

 

ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ మానవ మనుగడకు ప్రకృతి సమతౌల్యం అవసరమని... ఇప్పటికే అడవులు నశించిపోయి... వర్షాలు కురవక అతివృష్టి అనావృష్టిలు ఏర్పడుతున్నాయని... అందుకే కెసిఆర్ పట్టుదలతో హరితహారాన్ని చేపడుతున్నారని.... చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి..కాపాడు కోవాలనన్నారు...ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకుంటున్న చర్యలఫలితంగానే... రాష్ట్రం లో.. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అడవుల శాతం పెరిగిందన్నారు...

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.వి రమణాచారి... మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్య శ్రీనివాస్..కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాసరెడ్డి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు తదితరులు వెంట ఉన్నారు

ఈనెల 28న నల్గొండ లేబర్ ఆఫీస్ ముందు ధర్నాకు పిలుపునిచ్చిన చిన్నపాక లక్ష్మీనారాయణ

ప్రభుత్వం ప్రకటించిన మోటారు సైకిళ్లను వెంటనే విడుదల చేయాలి

పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ ను సత్వరమే పరిష్కారం చేయాలి 

28న లేబర్ ఆఫీస్ ముందు ధర్నా

చిన్నపాక లక్ష్మీనారాయణ

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి 

రాష్ట్ర ప్రభుత్వం 2022లో భవన నిర్మాణ కార్మికులకు అసెంబ్లీలో ప్రకటించిన లక్ష మోటార్ సైకిళ్లను వెంటనే ఇవ్వాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ;(సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  

      

శనివారం నల్లగొండ పట్టణ కమిటీ సమావేశం దొడ్డి కొమురయ్య భవన్ లో సలివోజు సైదాచారి అధ్యక్షతన జరిగింది.  ఈ సందర్భంగా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి మే డే సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు లక్ష మోటారు సైకిళ్ళు ఇస్తామని ప్రకటించి నేటికీ సంవత్సరం కావస్తున్న ఒక్క మోటార్ సైకిల్ కూడా ఇవ్వకపోవడం కార్మికుల పట్ల వారి కపట ప్రేమకు, చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. మోటార్ సైకిల్ వస్తుందని ఆశపడిన కార్మికునికి అడియాసే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే మోటార్ సైకిల్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలను రూపొందించి పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రమాదాలు, సహజ మరణాలు, పెళ్లి కానుక, ప్రసూతి సహాయం తదితర అనేక నష్టపరిహారాలు పెండింగ్ లో ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. కొత్తగా తీసుకువచ్చిన తంబు సిస్టం వలన కార్మికులు పనిచేసే చేతి వేళ్లపైన గీతలు అరిగిపోయి తంబులు రాకపోవడం వలన అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ఆలోచించి ఐరీస్ ను కూడా పరిగణలోకి తీసుకోవాలని అన్నారు. ఈనెల 28వ తేదీన సోమవారం రోజున జిల్లా లేబర్ అధికారి కార్యాలయం ముందు జరిగే ధర్నాకు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున* పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

    ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నల్లగొండ పట్టణ ప్రధాన కార్యదర్శి అద్దంకి నర్సింహ్మ, ఉపాధ్యక్షులు బోడ ఇస్తారి, ఎండి సుల్తాన్, సీత వెంకటయ్య, మీసాల శంకర్, భైరోజు ఆంజనేయులు, కావునపల్లి సురేష్, తదితరులు పాల్గొన్నారు.

చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న తెలంగాణ మహిళ

చంద్రుడిపై ఎకరం స్థలం కొన్న తెలంగాణ మహిళ

చంద్రుడిపై మానవ నివాసానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. చంద్రుడిపై స్థలం విక్రయానికి యూఎస్ ఎంబసీ 'లూనార్ రిజిస్ట్రీ' అనే వెబ్సైట్ తీసుకురాగా... తెలంగాణ పెద్దపల్లి జిల్లాకు చెందిన సాయివిజ్ఞాత తన తల్లి, కూతుర్ల పేరుతో చంద్రుడుపై ఎకరం స్థలాన్ని 2022లో కొనుగోలు చేసింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఆమెకు ఈనెల 23న అందాయి. చంద్రమండలంలో ఎకరం స్థలం రూ.35 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.

తుమ్మలకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి తీవ్ర నష్టం: కోలేటి భవాని శంకర్

తుమ్మలకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి తీవ్ర నష్టం

- పాలేరు టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించాలి

- ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచన చేయాలి

- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారాస పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అభ్యర్థన

పినపాక : 2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. శనివారం భవాని శంకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే గెలిచిందని, పినపాక నియోజకవర్గం లో 28 వేల ఓట్లు వచ్చాయని, మిగతా నియోజకవర్గాల్లో 5000 వరకు మాత్రమే ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావుని, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలిచి, మంత్రి పదవి ఇచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల ద్వారా టిఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేశారన్నారు. 2018 ఎన్నికల్లో కూడా ఒక్క ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే టిఆర్ఎస్ పార్టీ గెలవగా, మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయింది అన్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి ఇతర అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడమేనన్నారు. కాంగ్రెస్ టిడిపి కమ్యూనిస్టులు అందరూ కలిసినా కేవలం 3 నుండి 5000 ఓట్ల మెజారితో మాత్రమే వారు గెలుపొందారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికి పది సీట్లు గెలిపించాలని తప్పనతో పనిచేస్తున్నప్పటికీ, పార్టీలో ఉన్న కొన్ని వ్యతిరేక శక్తులు ఆయనకు వెన్నుపోటు పొడిచి ఓడిపోయే విధంగా చేశారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో కూడా ఐదువేల ఓట్లు లేవని, అలాంటి పార్టీకి తుమ్మల అన్ని నియోజకవర్గాల్లో 90000 ఓట్లకు పైగా ఓటు బ్యాంకు ను సృష్టించారన్నారు. జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావుకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని, రాష్ట్రములో ఆయన శిలాఫలకం వేయని గ్రామం లేదని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి పునరాలోచన చేసుకొని తుమ్మలకు పాలేరు టికెట్ కేటాయిస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలిపించే సత్తా తుమ్మల తీసుకుంటారన్నారు. కందల ఉపేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీని కాపాడాలని కోరారు.

తుమ్మల నాయకత్వాన్ని తుమ్మల బలగాన్ని అంత తేలికగా తీసుకోవద్దన్నారు. ప్రస్తుత రాజకీయాలు చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తుమ్మలకు పాలేరు టికెట్ కేటాయించే విధంగా కేసీఆర్ కు విన్నవించాలని కోరారు. తుమ్మలను వదులుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు టికెట్ కేటాయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Ts: కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు

మంచిరేవులలో ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను ప్రారంభించి, కోటి వృక్షార్చన లో భాగంగా మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి

ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా చిల్కూర్ ఫారెస్ట్ బ్లాక్ పరిధిలో మంచిరేవులలో రూ. 7.38 కోట్ల వ్య‌యంతో  256 ఎక‌రాల వీస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ఫారెస్ట్ ట్రెక్ పార్క్ ను

అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, భూగర్భ గనుల, సమాచార శాఖ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. 

అనంతరం సఫారీ వాహనంలో పార్కు అంతా కలియ తిరిగారు.

ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, సీఎస్ శాంతికుమారి, అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, జెడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

అర్బ‌న్ లంగ్ స్పేస్ లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకరమైన వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో అభివృద్ధి చేసిన ఈ పార్క్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గండిపేట, కోకాపేట, మంచిరేవుల పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగర ఆకాశ హర్మాలను వీక్షించేలా ఏర్పాటు చేసిన వాచ్ టవర్ ఈ పార్క్ లో అదనపు ఆకర్షణగా నిలువ‌నుంది. ఈ పార్కులో గ‌జీబో, వాకింగ్ ట్రాక్, ట్రెక్కింగ్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, అంఫి థియేటర్, వాటర్ ఫాల్, త‌దిత‌ర‌ స‌దుపాయాలు క‌ల్పించారు.

పార్క్ ప్రత్యేకతలు

విస్తీర్ణం: 256 ఎకరాలు

వ్యయం: రూ. 7.38 కొట్లు

పొడవు: 5.6 కి. మీ.

మొక్కలు: 50 వేల రకాలు

ట్రెక్కింగ్ ట్రాక్: 2 కి. మీ.

వాకింగ్ ట్రాక్: 4 కి. మీ.

109 అర్బన్ ఫారెస్ట్ పార్కులకు గాను ఇప్పటివరకు 73 పార్కులు అందుబాటులోకి వచ్చాయి. 74 వ పార్కును ఇవాళ ప్రారంభించుకున్నాం.