తుమ్మలకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి తీవ్ర నష్టం: కోలేటి భవాని శంకర్
తుమ్మలకు టికెట్ కేటాయించకపోతే పార్టీకి తీవ్ర నష్టం
- పాలేరు టికెట్ తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించాలి
- ముఖ్యమంత్రి కేసీఆర్ పునరాలోచన చేయాలి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారాస పార్టీ అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ అభ్యర్థన
పినపాక : 2023 తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మాజీ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించాలని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారత రాష్ట్ర సమితి అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. శనివారం భవాని శంకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే గెలిచిందని, పినపాక నియోజకవర్గం లో 28 వేల ఓట్లు వచ్చాయని, మిగతా నియోజకవర్గాల్లో 5000 వరకు మాత్రమే ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల నాగేశ్వరరావుని, ముఖ్యమంత్రి కెసిఆర్ పిలిచి, మంత్రి పదవి ఇచ్చి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తుమ్మల ద్వారా టిఆర్ఎస్ పార్టీని మరింత పటిష్టం చేశారన్నారు. 2018 ఎన్నికల్లో కూడా ఒక్క ఖమ్మం నియోజకవర్గంలో మాత్రమే టిఆర్ఎస్ పార్టీ గెలవగా, మిగతా అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయింది అన్నారు. దానికి కారణం కాంగ్రెస్ పార్టీకి ఇతర అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడమేనన్నారు. కాంగ్రెస్ టిడిపి కమ్యూనిస్టులు అందరూ కలిసినా కేవలం 3 నుండి 5000 ఓట్ల మెజారితో మాత్రమే వారు గెలుపొందారన్నారు. తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతికి పది సీట్లు గెలిపించాలని తప్పనతో పనిచేస్తున్నప్పటికీ, పార్టీలో ఉన్న కొన్ని వ్యతిరేక శక్తులు ఆయనకు వెన్నుపోటు పొడిచి ఓడిపోయే విధంగా చేశారన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో కూడా ఐదువేల ఓట్లు లేవని, అలాంటి పార్టీకి తుమ్మల అన్ని నియోజకవర్గాల్లో 90000 ఓట్లకు పైగా ఓటు బ్యాంకు ను సృష్టించారన్నారు. జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా తుమ్మల నాగేశ్వరరావుకు ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయని, రాష్ట్రములో ఆయన శిలాఫలకం వేయని గ్రామం లేదని అన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ మరొకసారి పునరాలోచన చేసుకొని తుమ్మలకు పాలేరు టికెట్ కేటాయిస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది నియోజకవర్గాలు భారీ మెజార్టీతో గెలిపించే సత్తా తుమ్మల తీసుకుంటారన్నారు. కందల ఉపేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి పార్టీని కాపాడాలని కోరారు.
తుమ్మల నాయకత్వాన్ని తుమ్మల బలగాన్ని అంత తేలికగా తీసుకోవద్దన్నారు. ప్రస్తుత రాజకీయాలు చాలా చాలా ఇబ్బందిగా ఉన్నాయని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోటీలో ఉండే ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా వాస్తవ పరిస్థితులు తెలుసుకొని తుమ్మలకు పాలేరు టికెట్ కేటాయించే విధంగా కేసీఆర్ కు విన్నవించాలని కోరారు. తుమ్మలను వదులుకున్నట్లయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని, కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ తుమ్మల నాగేశ్వరరావుకు పాలేరు టికెట్ కేటాయించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Aug 26 2023, 16:33