నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్పార్టీ అభ్యర్థిగా కంచర్లను ప్రకటించిన నాటి నుండి.. వెల్లువలా ప్రజల నుండి మద్దతు...
నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం బిఆర్ఎస్పార్టీ అభ్యర్థిగా కంచర్లను ప్రకటించిన వాటి నుండి.. వెల్లువలా ప్రజల నుండి మద్దతు...
పలు ప్రజాసంఘాలవారు... మేధావులు యువకులు యువకుల నుండి విశేష స్పందన.
నల్లగొండ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరి మద్దతు తనకు ఉంటుంది...
నిన్న....ఈరోజు పలు వార్డులు గ్రామాల నుండి భారీ సంఖ్యలో చేరికలు....
ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల కరస్పాండెంట్స్ కంచర్లను కలిసి తమ మద్దతు ప్రకటన..
బిఆర్ఎస్ పార్టీ నల్గొండ నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా.. ముఖ్యమంత్రి ప్రకటించిన నాటి నుండి... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారికి... పలు ప్రజా సంఘాలు, యాజమాన్యాలు, మేధావులు యువకులు, తమ మద్దతు తెలియజేస్తూన్నారు... గత మూడు రోజుల నుండి కూడా కంచర్ల నివాసం... కోలాహలంగా మారింది... ప్రైవేట్ పాఠశాలలు కళాశాల యాజమాన్యం తరఫున....పలువురు కరస్పాండెంట్లు విచ్చేసి తమ మద్దతు తెలియజేశారు...
నిన్న ఈరోజు పార్టీలో పలు గ్రామాల నుండి వార్డుల నుండి... వందల సంఖ్యలో వివిధ పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతూన్నారు...
ఈరోజు.. నల్గొండ పట్టణం 9వ వార్డు నుండి... జిట్టా నగేష్, కూతటి రాములు ఆధ్వర్యంలో వెంకటరమణ కాలనీ నుండి 50 కుటుంబాలు... జంగాల కాలనీహనుమంతు పర్వతం,ఆధ్వర్యంలో 25 కుటుంబాలు నడ్డివారిగూడెం వింజమూరు నరసింహ మొండి కత్తి అశోక్ ఆధ్వర్యంలో 15 కుటుంబాలు.... మొత్తం 100 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.. అదేవిధంగా పట్టణం 32 వార్డుకు సంబంధించి.. శ్రీ సాయి కాలనీ నుండి అక్కినేపల్లి గణేష్ నిమ్మల చందు ఆధ్వర్యంలో.. 50 కుటుంబాల వారు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి.. నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారి సమక్షంలో
బిఆర్ఎస్ పార్టీ చేరారు....
ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ.... గత ఎన్నికల్లో నల్లగొండ మార్పుకు సంబంధించి ప్రధానంగా ప్రజలకు చెప్పామని.. ప్రజలు ఏ మార్పు ఆశించి తనను గెలిపించారో.., కెసిఆర్ ఆశీర్వాదంతో ఆ మార్పును చేసి చూపిస్తున్నామని... అన్నమాట ప్రకారం నల్లగొండను దత్తత తీసుకున్న కెసిఆర్ నల్లగొండ నల్లవైపులా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారని 1200 కోట్లతో అభివృద్ధి పనులు శరవేగంగా నడుస్తున్నాయని... ఇప్పటికి 25% పనులు మాత్రమే పూర్తయ్యాయని... నల్లగొండ పట్టణం భవిష్యత్ తరాలకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు చేయవలసి ఉన్నదని ఎన్నో మౌలిక వసతులు కల్పించవలసినదని...కెసిఆర్ నాయకత్వంలో మాత్రమే అది సాధ్యమవుతుందని... అది అర్థం చేసుకున్న చైతన్యవంతులైన నల్గొండ ప్రజలు... తమకు మద్దతు తెలియజేస్తున్నారన్నారు. కొత్తగా పార్టీలో చేరినవారందరికి తాము స్వాగతం పలుకుతున్నామని తన కుటుంబ సభ్యులవలె వారిని ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని... పాత కొత్త వాళ్ళంతా కలిసి పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్ కార్యదర్శి సందినేని జనార్దన్ రావు.. కౌన్సిలర్ వట్టిపల్లి శ్రీనివాస్... 9వ వార్డు ఇంచార్జ్.. వజ్జే శ్రీనివాస్,రాం రెడ్డి,మల్లయ్య, అలుగుబెల్లి కిరణ్ కుమార్ రెడ్డి, సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
Aug 25 2023, 11:35