చంద్రయాన్ - 3 విజయవంతం !
- యావత్ దేశం గర్వం
- చరిత్ర సృష్టించిన భారత్ దేశం
ఇస్రో ( శ్రీహరికోట ) ; విజయంతంగా లాండ్ అయిన చంద్రయాన్ - 3 .ల్యాండింగ్ కోసం ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన ఈ వ్యోమనౌక.. 40 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నేడు చంద్రుడ్ని ముద్దాడనుంది. ఇందుకు ఇస్రో ఏర్పాట్లును పూర్తిచేసింది.
ప్రస్తుతం ల్యాండర్ జాబిల్లికి 24 కి.మీ. దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆటోమేటిక్ ల్యాండింగ్ సీక్వెన్స్‌ను ప్రారంభించేందుకు అంతా సిద్ధంగా ఉందని, విక్రమ్ ల్యాండర్ నిర్దేశిత ప్రాంతానికి సాయంత్రం 5.44 గంటలకు చేరుకుంది.
అదే సమయానికి ఆటోమేటిక్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.ఎటువంటి అవరోధాలు లేకుండా ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యింది. దీంతో ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది.
చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన నాలుగో దేశంగానూ ఘనత సాధించింది. చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. 140 కోట్ల మంది భారతీయులు గర్వపడే అపురూప క్షణాలని మోదీ అన్నారు.
చంద్రుడిపై చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ అయిన తర్వాత విక్రమ్ ల్యాండర్ దాని లోపల ఉన్న ప్రగ్యాన్ రోవర్ ఏం పని చేస్తాయి అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ల్యాండర్, రోవర్ పని గురించి ఇస్రో అధికారులు వెల్లడించారు. ల్యాండింగ్ ప్రక్రియ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి కాగానే.. విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రగ్యాన్ రోవర్ బయటికి రావడానికి 10 నిమిషాల సమయం పట్టనుంది.
Aug 23 2023, 20:53