/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Rekha Naik : బీఆర్ఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ రేఖానాయక్ సంచలనం.. Yadagiri Goud
Rekha Naik : బీఆర్ఎస్‌పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ రేఖానాయక్ సంచలనం..

ఆదిలాబాద్ : బీఆర్ఎస్ పై ప్రతి కారం తీర్చుకుంటామంటుని ఎమ్మెల్యే రేఖా నాయక్ దంపతులు అంటున్నారు. ఖానాపూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాలపై గురి పెట్టనుబోనన్నారు..

ఖానాపూర్ పై రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుంచి ఆమె భర్త శ్యాం నాయక్ దృష్టి పెట్టారు.

అవకాశం ఇస్తే రెండు చోట్లా పోటీ చేస్తామని వెల్లడించారు. ఏదో ఒక టికెట్ ఇస్తామని కాంగ్రెస్ ముఖ్య నేతలు హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో పోటీ చేసేందుకే ఇటీవల రేఖా భర్త శ్యామ్ నాయక్ వీఆర్ఎస్ తీసుకున్నారు.

అసలు ఎస్టీయే కాని జాన్సన్ నాయక్‌కు టికెట్ ఇచ్చారని రేఖా నాయక్ ఆరోపించారు.

జాన్సన్ నాయక్ కన్వర్టెడ్ క్రిస్టియన్, ఆయన ఎస్టీ ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏమిటో చూపిస్తానని రేఖా నాయక్ అన్నారు.

Chandrababu: మీరు నిండు నేరుళ్లు ఆరోగ్యంగా ఉండాలి.. చిరుకు చంద్రబాబు బర్త్‌డే విషెస్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలియజేశారు..

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకున్నారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబు చిరుకు బర్త్‌డే విషెస్ తెలిపారు. 

"స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి సీనీ అభిమానుల హృదయాలలో చిరంజీవిగా చిరస్థానాన్ని పదిలపరుచుకున్న మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

సినీ పరిశ్రమ భవిష్యత్తును, సినీ కార్మికుల సంక్షేమాన్ని సదా కోరుకునే మీరు.. నిండు నూరేళ్లు ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

SB NEWS

SB NEWS

Chandrayaan-3: లాంచింగ్‌ నుంచి ల్యాండింగ్‌ వరకు.. 60 సెకన్లలో చంద్రయాన్‌-3 ప్రయాణం

కోట్లాది మంది భారతీయులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న చారిత్రక క్షణాలు చేరువయ్యాయి. మరికొద్ది గంటల్లో మన వ్యోమనౌక జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది..

జులై 14న శ్రీహరికోటలోని షార్‌ ప్రయోగ వేదిక నుంచి రోదసిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్‌-3 (Chandrayaan-3).. బుధవారం (ఆగస్టు 23) సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్‌ ల్యాండ్‌ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే వెల్లడించింది.

ఈ క్రమంలోనే 40 రోజుల చంద్రయాన్‌-3 ప్రయాణాన్ని 60 సెకన్లలో చూపిస్తూ PIB (ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో) ఓ వీడియో రూపొందించింది..

ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలు చంద్రయాన్‌-3 (Chandrayaan-3)ను రూపొందించినప్పటి నుంచి షార్‌ వేదిక వద్ద ప్రయోగం, రోదసిలోకి దూసుకెళ్లడం, భూకక్ష్యలో నుంచి చంద్రుడి కక్ష్యలోకి మారడం వంటివి ఇందులో చూపించారు. చివరగా జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ అడుగుపెట్టినట్లు ఆ వీడియోలో ఉంది.

విక్రమ్‌ ల్యాండర్‌ కిందకు దిగగానే అందులోని ప్రజ్ఞాన్‌ రోవడ్‌ జారుకుంటూ బయటకు వచ్చినట్లు ఊహాజనితంగా యానిమేషన్‌ రూపంలో వీడియోలో చూపించారు.

అన్ని అనుకూలిస్తే రేపు సాయంత్రం జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ కాలుమోపనుంది. ఆ తర్వాత రెండు వారాల పాటు ల్యాండర్‌, రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు సాగిస్తాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత జాబిల్లిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుంది. ఇక, దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా సరికొత్త చరిత్రను లిఖించనుంది..

PM Modi: బ్రిక్స్‌లో బలమైన సహకారంపై చర్చిస్తాం: మోదీ

బ్రిక్స్‌(BRICS) సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అభిప్రాయపడ్డారు.

ఆయన మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు.

ఈ సారి బ్రిక్స్‌ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు.

''పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, బహుళపక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చంచడానికి బ్రిక్స్‌ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నాను'' అని ప్రధాని మోదీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతరం ప్రధాని ఎక్స్‌ (ట్విటర్)లో ఓ పోస్టు చేశారు.

''జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళుతున్నాను. బ్రిక్స్‌-ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్‌ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారింది'' అని ట్వీట్‌లో పేర్కొన్నారు..

నేడు వామపక్షాల కీలక సమావేశం

పొత్తు అంశం ప్రస్తావన లేకుండానే సీఎం కేసీఆర్ 115 అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.

మునుగోడు ఎన్నికల సందర్భంగా వామపక్షాలు గులాబీ పార్టీకి మద్దతు తెలిపాయి.

ఇక, వామపక్ష పార్టీలతో పొత్తు లేదని సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు నేడు కీలక సమావేశం జరగనుంది.

భవిష్యత్ కార్యచరణపై సీపీఐ, సీపీఎం చర్చించనున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచనలో సీపీఐ, సీపీఎం ఉన్నట్లు తెలిసింది.

ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలిసింది.

అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్ కార్యచరణపై భేటీలో చర్చించనున్నారు.పొత్తులో భాగంగా కొత్తగూడెం, పాలేరు టికెట్లను వామపక్షాలు కోరాయి...

అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి

పెద్దపల్లి జిల్లా:

మంథని నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ ఊహించినట్లు జరగలేదు పుట్ట మధుకు వ్యతిరేకంగా తిరుగుతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే జట్టు కట్టారు.

చల్ల నారాయణరెడ్డితోపాటు ఇతర నాయకులు మధుకు టికెట్ ఇస్తే సహకరించమని ఇప్పటికే హెచ్చరించారు. ఎన్నికల వరకు వాళ్ల సహకారం అందకుంటే మధు గెలుపు నల్లెరు మీద నడకే అవుతుందా? వ్యతిరేక వర్గానికి తన సత్తా చాటుతాడా? వేచి చూడాలి మరి

వేములవాడలో రమేష్ బాబుకు టికెట్ కేటాయించకపోవడంతో రమేష్ బాబు వర్గం నేతలు చల్మెడ లక్ష్మీనర్సింహరావుకు ఎంత వరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

నియోజకవర్గంలో మోజార్టీ ప్రజాప్రతినిధులు సహకరించకుంటే లక్ష్మీనర్సింహరావు విజయతీరాలకు వెళ్లడం కష్టమే. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాంచడంతో అసంతృప్తి నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతారా? లేక పార్టీని వీడుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. పాడి తీరును వ్యతిరేకిస్తున్న నేతలు పార్టీ మారుతారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇలా జరిగితే కౌశిక్ రెడ్డి ఓటమి మూటకట్టుకోక తప్పుదు.

రామగుండంలో చందర్ తీరుకు వ్యతిరేకంగా గళం విప్పిన నేతలు గడిచిన కొన్ని రోజులుగా వ్యతిరేకిస్తున్న జెడ్పీటీసీ సంధ్యరాణి, మాజీ మేయర్లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్నేత రాజిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఇప్పుడు చందర్‌కు ఎంత వరకు సహకరిస్తారనేది? చర్చనీయాంశంగా మారింది.

వీరు పార్టీలో ఉంటారా..? పార్టీని వీడుతారా? అనేది తెలియాల్సి ఉంది. చొప్పదండి టికెట్ ఆశించిన నేతల్లో బండపల్లి యాదగిరి తాను టికెట్ రాకుంటే స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించారు. యాదగిరితోపాటు బైరం పద్మయ్య, కౌంసాల శ్రీనివాస్తదితరుల మద్దతు ఎమ్మెల్యే రవి శంకర్‌కు ఉంటుందా? అనేది ప్రశ్నగా మారింది.

మిగిలిన జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్తదితర నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్నిర్ణయాలను బట్టే గెలుపు ఓటములు ప్రభావితం అవుతాయి....

చంద్రయాన్ - 3 కీలక ఘట్టం షురూ !

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. కీలక దశకు చేరుకుంది. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే ల్యాండర్ విడిపోయింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోన్నాయి.

2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో.. ఆ చేదు ఘటన పునరావృతం కాకుండా ఇస్రో అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది. అదే సమయంలో రష్యాకు చెందిన మూన్ మిషన్ లూనా 25 కూడా విఫలం కావడం, క్రాష్ ల్యాండింగ్ కావడం.. వంటి పరిస్థితులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటోంది.దీన్ని దృష్టిలో ఉంచుకుని ల్యాండింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించింది ఇస్రో.

ఎట్టి పరిస్థితుల్లోనూ ల్యాండర్, రోవర్ ల్యాండింగ్‌ను ఖచ్చితంగా విజయవంతం చేసి తీరాలనే పట్టుదలతో ఉంది. లూనా 25 ఎందుకు క్రాష్ ల్యాండింగ్ అయిందనే విషయంపై ఆరా తీస్తోంది. రష్యా స్పేస్ ఏజెన్సీ నుంచి సమాచారాన్ని తెప్పించుకుంటోంది.ముందుగా నిర్దేశించిన షెడ్యూల్.. అంటే ఈ నెల 23వ తేదీన సాయంత్రం 6:04 నిమిషాలకు ల్యాండింగ్ కావాల్సి ఉంది చంద్రయాన్ 3.

ఆ సమయానికి పరిస్థితులు ఏ మాత్రం అనుకూలించకపోయినా ల్యాండింగ్‌ను వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చింది ఇస్రో. మళ్లీ ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి చేపట్టాలని భావిస్తోంది.

ఈ విషయాన్ని ఇస్రో- స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ వెల్లడించారు.

నిర్దేశిత సమయానికి చంద్రుడిపై వాతావరణం అనుకూలించకపోయినా, ఇంకేదైనా అవాంతరాలు చోటు చేసుకున్నా ల్యాండింగ్ ప్రక్రియను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేస్తామని ఆయన స్పష్టం చేశారు.చంద్రయాన్-3 చంద్రునిపై దిగడానికి రెండు గంటల ముందు.. దీనిపై నిర్ణయం తీసుకంటామని దేశాయ్ పేర్కొన్నారు. ల్యాండర్ మాడ్యూల్ పనితీరు, చంద్రుడి ఉపరితలంపై పరిస్థితుల ఆధారంగా నిర్దేశిత సమయంలో దాన్ని ల్యాండ్ చేయడం సరైనదా? కాదా? అనేది ల్యాండింగ్‌కు రెండు గంటల ముందు నిర్ణయిస్తామని అన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనట్టయితే ఈ ప్రక్రియను ఆగస్టు 27వ తేదీకి వాయిదా వేస్తామని పేర్కొన్నారు.

కేటీఆర్ సోపతికి ఎమ్మెల్యే టికెట్ !

- ఎమ్మెల్యే రేఖ నాయక్ గుస్సా

- కాంగ్రెస్ పార్టీలో చేరనున్న రేఖ నాయక్

- జాన్సన్ నాయక్ కు టికెట్ ఖరారు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోమవారం అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. మెుత్తం 115 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో పెట్టారు. పెద్దగామార్పులు చేర్పులు లేకుండా దాదాపు సిట్టింగ్‌లందరికీ టికెట్లు కేటాయించారు.

ఈ విడతలో ఎనిమిది స్థానాల్లో కొత్త ముఖాలకు చోటు కల్పించారు. మంత్రి కేటీఆర్ క్లాస్‌మేట్‌కు ఎమ్మెల్యే టికెట్ లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు సిట్టింగ్‌లను మార్చగా.. ఖానాపూర్ నియోజవర్గం నుంచి భూక్యా జాన్సన్ రాథోడ్ నాయక్‌కు అవకాశం కల్పించారు.జాన్సన్ మంత్రి కేటీఆర్‌కు స్నేహితుడు. జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీంపట్నం తిమ్మాపూర్‌ తండాకు చెందిన భూక్య జాన్సన్‌ నాయక్‌. నిజాం కాలేజీలో బీఎస్సీ డిగ్రీ చదివారు. ఆ తర్వాత ఉస్మానియా యునివర్సిటీ నుంచి కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమో పూర్తి చేశారు.

కొంత కాలం పాటు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు. నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రస్తుత ఐటీ మంత్రి కేటీఆర్‌ జాన్సన్ ఇద్దరు క్లాస్‌మేట్స్‌. దీంతో ఇద్దరి మధ్య బలమైన స్నేహం ఉంది. గతంలో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన కేటీఆర్‌.. జాన్సన్‌ తాను చిన్నప్పటి నుంచి స్నేహితులమని చెప్పారు. ఒకరిపై ఒకరం ఎంతో నమ్మకంగా ఉంటామని.. తనకు సమస్య వచ్చినప్పుడు నేను, నాకు సమస్య వచ్చినప్పుడు జాన్సన్‌ అన్నివిధాలుగా సహకరించేవాడని చెప్పారు.

ఈ నేపథ్యంలో ఖానాపూర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న రేఖా నాయక్‌ను మారుస్తున్నారన్న ప్రచారం జరగ్గాన్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనకు టికెట్ కన్ఫార్మ్ అనే టాక్ వినిపించింది. అందరూ ఊహించినట్లుగానే జాన్సన్‌కు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. దీంతో అతడు తొలిసారి ప్రత్యక్ష రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

కాంగ్రెస్ గూటికి రేఖా నాయక్

ఇక పార్టీ టికెట్ కేటాయించకపోవటంతో ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

రేఖా నాయక్ భర్త అజ్మీరా శ్యామ్ నాయక్‌.. టికెట్లు ప్రకటించిన కాసేపటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రేఖా నాయక్ ఇవాళ బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఖానాపూర్ నుంచి టికెట్ ఇచ్చేందుకు రేవంత్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

తిరుమలలో నేడు పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో నేడు మంగళవారం భక్తుల రద్దీ కాస్త పెరిగింది. నిన్న కేవలం ఒక్క కంపార్ట్‌మెంటులో మాత్రమే భక్తులు వేచి ఉండగా..

నేడు శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 12 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

సోమవారం శ్రీవారిని 69,909 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.37 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 29,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

కాగా.. తిరుమల శ్రీనివాసుడికి ఈఏడాది రెండు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈఏడాది అధికమాసం సందర్భంగా సెప్టెంబరు 18 నుంచి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. స్వయంగా వెల్లడించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది.

ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్‌..

అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా.. 95 శాతం అభ్యర్థుల స్థానాలు సిట్టింగులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కేవలం సింగిల్ డిజిట్ లోనే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆసిఫాబాద్, ఉప్పల్, జనగామ, స్టేషన్ ఘాన్ పూర్, అంబర్ పేట, వరంగల్ తూర్పు,

కొత్తగూడెం, ఖానాపూర్, పెద్దపల్లి, రామగుండం తదితర నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అసంతృప్తుల బుజ్జగింపులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లే తెలుస్తోంది..