అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి
పెద్దపల్లి జిల్లా:
మంథని నియోజకవర్గంలో సెకండ్ క్యాడర్ ఊహించినట్లు జరగలేదు పుట్ట మధుకు వ్యతిరేకంగా తిరుగుతున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే జట్టు కట్టారు.
చల్ల నారాయణరెడ్డితోపాటు ఇతర నాయకులు మధుకు టికెట్ ఇస్తే సహకరించమని ఇప్పటికే హెచ్చరించారు. ఎన్నికల వరకు వాళ్ల సహకారం అందకుంటే మధు గెలుపు నల్లెరు మీద నడకే అవుతుందా? వ్యతిరేక వర్గానికి తన సత్తా చాటుతాడా? వేచి చూడాలి మరి
వేములవాడలో రమేష్ బాబుకు టికెట్ కేటాయించకపోవడంతో రమేష్ బాబు వర్గం నేతలు చల్మెడ లక్ష్మీనర్సింహరావుకు ఎంత వరకు సహకరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
నియోజకవర్గంలో మోజార్టీ ప్రజాప్రతినిధులు సహకరించకుంటే లక్ష్మీనర్సింహరావు విజయతీరాలకు వెళ్లడం కష్టమే. హుజూరాబాద్‌లో కౌశిక్ రెడ్డికి టికెట్ కేటాంచడంతో అసంతృప్తి నేతలు బీఆర్‌ఎస్ పార్టీలో కొనసాగుతారా? లేక పార్టీని వీడుతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. పాడి తీరును వ్యతిరేకిస్తున్న నేతలు పార్టీ మారుతారనే ప్రచారం సైతం జరుగుతోంది. ఇలా జరిగితే కౌశిక్ రెడ్డి ఓటమి మూటకట్టుకోక తప్పుదు.
రామగుండంలో చందర్ తీరుకు వ్యతిరేకంగా గళం విప్పిన నేతలు గడిచిన కొన్ని రోజులుగా వ్యతిరేకిస్తున్న జెడ్పీటీసీ సంధ్యరాణి, మాజీ మేయర్లక్ష్మీనారాయణ, టీబీజీకేఎస్నేత రాజిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఇప్పుడు చందర్‌కు ఎంత వరకు సహకరిస్తారనేది? చర్చనీయాంశంగా మారింది.
వీరు పార్టీలో ఉంటారా..? పార్టీని వీడుతారా? అనేది తెలియాల్సి ఉంది. చొప్పదండి టికెట్ ఆశించిన నేతల్లో బండపల్లి యాదగిరి తాను టికెట్ రాకుంటే స్వతంత్ర్య అభ్యర్ధిగా పోటీ చేస్తానని ప్రకటించారు. యాదగిరితోపాటు బైరం పద్మయ్య, కౌంసాల శ్రీనివాస్తదితరుల మద్దతు ఎమ్మెల్యే రవి శంకర్‌కు ఉంటుందా? అనేది ప్రశ్నగా మారింది.
మిగిలిన జగిత్యాల, కోరుట్ల, హుస్నాబాద్తదితర నియోజకవర్గాల్లో సెకండ్ క్యాడర్నిర్ణయాలను బట్టే గెలుపు ఓటములు ప్రభావితం అవుతాయి....
Aug 22 2023, 12:37