ఎరుకల జాతిని గుర్తించిన ఘనత కెసిఆర్ దే: టి. వై. ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు
ఎరుకల జాతిని గుర్తించిన ఘనత కెసిఆర్ దే
టి.వై.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు
తేదీ 19 ఆగస్టు 2023 రోజున మొలుగు జిల్లా కేంద్రంలో తెలంగాణ ఎరుకల సంఘం ములుగు జిల్లా నాయకులు పాలకుర్తి సమ్మయ్య,పల్లకొండ భాస్కర్ ఆధ్వర్యంలో కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకిని రాజు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ గత కాంగ్రెస్,టిడిపి ప్రభుత్వాలు ఎరకల జాతిని గుర్తించలేదని పేర్కొన్నారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత సామాజిక తెలంగాణ దృక్పథంతో ఆలోచించి కేసీఆర్ ఎరుకల జాతిని గుర్తించి గవర్నర్ కోట కింద సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు గౌరవ శ్రీ కుర్ర సత్యనారాయణ గారికి ఎమ్మెల్సీ స్థానాన్ని కల్పించిన గౌరవ శ్రీ కేసీఆర్ గారికి ఎరుకల జాతి తరపున రుణపడి ఉంటామని గుర్తు చేశారు.
అన్ని కులాలను గౌరవించినట్టుగా ఆదివాసి ఎరుకల కులాన్ని గౌరవించి హైదరాబాద్ కేంద్రంగా ఎకరం భూమి ఎరుకల ఆత్మగౌరవ భవన నిర్మాణం కొరకు 3.5 కోట్లు నిధులు మంజూరు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది అని అన్నారు.అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా పందులపై ఆధారపడి జీవిస్తున్న 50 వేల ఆదివాసి ఎరుకల కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ఎరుకల ఎంపవర్మెంట్ స్కీం పథకాన్ని ప్రవేశపెట్టి 60 కోట్లు నిధులు ఇచ్చిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వo కేసీఆర్ గారిది అని అన్నారు.
రాష్ట్ర అధ్యక్షులు కూతాడి రాములు గారికి కూకట్ పల్లి మార్కెట్ చైర్మన్ గా అవకాశం కల్పించి ఎరుకల ఆత్మగౌరాన్ని గౌరవించిన కేసీఆర్ గారికి
గౌరవ శ్రీ హరీష్ రావు గారికి
గౌరవ శ్రీ కేటీఆర్ గారికి గౌరవ శ్రీమతి సత్యవతి రాథోడ్ గార్లకు
ఎరుకల జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంలో
గౌరవ శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు తెలంగాణ వ్యాప్తంగా చదువుకున్న ఆదివాసి ఎరుకల విద్యార్థి విద్యార్థులను గుర్తించి ఉద్యోగ ఉపాధి అవకకల్పించాలని కోరారు.
తెలంగాణ వ్యాప్తంగా కులవృత్తుల నమ్ముకున్న 18 బీసీ కులాలకు లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేసినట్టుగా
తెలంగాణ వ్యాప్తంగా తట్టలు బుట్టలు గంపలు గుమ్ములు అల్లుకుని జీవిస్తున్న నిరుపేద ఎరుకల కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేయాలని గౌరవ శ్రీ కెసిఆర్ గారిని కోరినారు.
ఈ కార్యక్రమంలో
రాష్ట్ర ఉపాధ్యక్షులు
కేతిరి రాజశేఖర్,రాష్ట్ర నాయకులు పల్లకొండ ప్రభాకర్,పల్లకొండ కుమారస్వామి, వరంగల్, హన్మకొండ జిల్లా నాయకులు ఓని సదానందం,జిల్లా ప్రధాన కార్యదర్శి మానుపాటి రమేష్,భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు కేతరి రాజు,కరీంనగర్ జిల్లా కన్వీనర్ కూతాడు శ్రీనివాస్,జిల్లా మహిళా నాయకులు పాలకుర్తి ప్రమీల,కూరాకుల సరోజన,బంగారయ్య,పాలకుర్తి ప్రశాంత్,పాలకుర్తి సురేష్,పాలకుర్తి తిరుపతి, ఎరుకల కులస్తులు,తదితరులు పాల్గొన్నారు.
Aug 20 2023, 08:46