సీఎం కేసీఆర్‌ను ఓడించడం కష్టం: బీజేపీ నేత మురళీధర్‌రావు
![]()
సీఎం కేసీఆర్‌ను ఓడించడం కష్టం: బీజేపీ నేత మురళీధర్‌రావు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్‌ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓడించం కష్టమని బీజేపీ నేత మురళీధర్‌రావు వ్యాఖ్యానించారు. కొత్తగా సంక్షేమ పథకాల హామీలు ఇచ్చి సీఎం కేసీఆర్‌ను అడ్డుకోలేమని, పథకాల అమలులో ఆయన చాలా ముందున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కర్ణాటకలో కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను మాస్‌లీడర్‌గా అభివర్ణించారు. తాను ఇన్‌చార్జిగా ఉన్న మధ్యప్రదేశ్‌లో బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తున్నదని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలిగింపును సమర్థించారు. బండి సంజయ్‌కి కలుపుగోలుతనం లేదని, ఇతర నేతలను దగ్గరికి రానివ్వలేదని, అందుకే పదవి నుంచి తొలిగించారంటూ వస్తున్న కథనాలకు మురళీధర్‌రావు బలం చేకూర్చినట్టయ్యింది. బీజేపీ ఎంపీ అర్వింద్ సైతం బండి సంజయ్ ఉన్నన్నాళ్లూ పార్టీలో గొడవలు ఉన్నాయని, ఇప్పుడు గ్రూపులు, గొడవలు లేవని ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం గమనార్హం. దీంతో బండి సంజయ్ అభిమానులు మురళీధర్‌రావు, అర్వింద్‌పై గుర్రుమంటున్నారు.



తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీక సీఎం కేసీఆర్
శ్రావణమాస చతుర్వేద పారాయణ మహా కృతువు సందర్భంగాఆర్య సమాజంలో గురువారం ధ్వజారోహణ, నూతన యజ్ఞశాల, చతుర్వేద పారాయణ మహా కృత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి లు ప్రారంభించి మొక్కలు నాటారు.
సీఎం కేసీఆర్‌కు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపిన ఆర్టీసీ సిబ్బంది
90కి పైగా గెలుస్తాం
రేషన్ కార్డు లేని వారికి గృహలక్ష్మి పథకం వర్తింపజేయాలి
రైతుబీమా పథకానికి ఐదేండ్లు పూర్తి..
Aug 19 2023, 18:46
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.6k