/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్ Yadagiri Goud
బాధిత మహిళకు న్యాయం జరిగేలా చూస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్

నందిహిల్స్‌ కాలనీలో నివాసముంటున్న వరలక్ష్మీపై ఎల్బీనగర్‌ పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం దారుణమని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు.

మీర్‌పేట్‌ పీఎస్‌ పరిధిలో అర్ధరాత్రి మహిళను స్టేషన్‌కు తీసుకెళ్లి థర్డ్‌డిగ్రీకి ప్రయోగించిన ఘటనపై గురువారం సాయంత్రం మంత్రి స్పందించారు.

విషయం తెలిసిన వెంటనే మంత్రి స్వయంగా రాచకొండ సీపీకి ఫోన్‌ చేసి ఘటనపై ఆరా తీశారు.

మహిళపై దాడికి పాల్పడ్డ బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ మంత్రి ఆదేశించారు.

సమగ్ర విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు అధికారులకు మంత్రి ఆదేశించారు...

కారెక్కెందుకు జగ్గారెడ్డి : సిద్ధమా ❓️

కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ ల మీద షాకులు తగులుతున్నాయి. ఒక వైపు బీజేపీ, బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలు ఉంటున్నాయని కాంగ్రెస్‌ నేతలు చెబుతుండగా, మరో వైపు సొంత పార్టీ నుంచి మరి కొందరు సీనియర్‌ నాయకులు జంప్‌ చేస్తున్నారు.

పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.

రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌ నుంచి ఇప్పటికే క్లియరెన్స్‌ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్‌ ఆయనకే ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది.

జగ్గారెడ్డి కూడా తన నియోజక వర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు కూడా పార్టీ మారుతున్న అంశాన్ని స్పష్టం చేశారని తెలిసింది. తనపై అభిమానం ఉన్నవారు రావచ్చని, తాను మాత్రం ఒత్తడి చేయనని పార్టీ కేడర్‌కు చెప్పినట్లుగా తెలిసింది.

అంతే కాకుండా ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరుడు తెల్లం వెంకట్రావ్‌ గురువారం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే.

కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో జగ్గారెడ్డికి మొదటి నుంచి పొసగడం లేదు. పార్టీ కార్యక్రమాల నిర్ణయం, అమలు విషయంలో రేవంత్‌రెడ్డి పార్టీ సీనియర్లను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదని, ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని జగ్గారెడ్డి పలుమార్లు బహటంగానే విమర్శలు చేశారు....

నేడు సిరిసిల్ల లో కేటీఆర్‌ పర్యటన

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఆయనతో పాటు ఇద్దరు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌ బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు పద్మనాయక కల్యాణ మండపంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలనుద్ధేశించి ప్రసంగించనున్నారు.

సాయంత్రం 4 గంటలకు మానేరు బ్రిడ్జి వద్ద బోటు షికారును ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు బైపాస్‌రోడ్డులో కొత్తగా నిర్మించిన కే కన్వెన్షన్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

అనంతరం జిల్లా ఏరియా దవాఖానకు చేరుకుని 40కేవీ రూప్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ను, 130 అదనపు బెడ్స్‌, క్యాన్సర్‌ బాధితుల కోసం కీమోథెరఫీ డేకేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తారు.

సర్వాంగ సుందరంగా పాపన్న జంక్షన్‌

సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్‌రోడ్డులో నర్సింగ్‌ కళాశాల ఎదురుగా వేములవాడ, సిద్దిపేట ప్రధాన రహదారిపై సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేశారు.

దీని కోసం మున్సిపల్‌ శాఖ రూ.30 లక్షల నిధులు వెచ్చించించింది. పాపన్న పేరిట అద్భుతంగా రూపుదిద్దుకుంటున్న ఈ జంక్షన్‌కు సుమారు రూ.కోటిన్నర ఖర్చు చేయనున్నారు. విగ్రహం చుట్టూ గార్డెన్‌, పౌంటేన్‌లతో సందర్శకులను ఆకట్టుకునేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు...

తిరుమలలో నేడు భక్తుల రద్దీ కొనసాగుతోంది

తిరుపతి :ఆగస్టు 18

తిరుమలలో నేడు శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది.

నేడు స్వామివారి దర్శనం కోసం 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

ఇక గురువారం స్వామివారిని 64,695 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.6 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

శ్రీవారికి 24,473 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

పద్మావతి అమ్మవారి ఆలయంలో నేడు వరలక్ష్మి వర్రతం ఈ నెల 25న తిరుచానూరులో వైభవంగా జరగనుంది. భక్తులు నేరుగా కానీ వర్చువల్‌గా కానీ పాల్గొనే అవకాశం ఉంది.......

Hyderabad: ఉక్కు వంతెనకు కార్మిక నేత పేరు.. ప్రారంభ తేదీ ఖరారు.

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో ఇందిరాపార్కు చౌరస్తా నుంచి ఆర్టీసీ బస్‌ భవన్‌ సమీపంలోని వీఎస్టీ కూడలి వరకు నిర్మించిన ఉక్కు వంతెన(Steel Bridge) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది..

ఆగస్టు 19న (శనివారం) ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నట్టు మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్‌ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

రూ.450 కోట్ల వ్యయంతో 2.63 కి.మీల పొడవైన ఈ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎస్‌ఆర్‌డీపీ) కింద జీహెచ్‌ఎంసీ నిర్మించిందని తెలిపారు.

ఈ వంతెనకు కార్మిక నేత, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు.

నాయిని.. ముషీరాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారని.. అలాగే, చాలా కాలం పాటు వీఎస్‌టీ కార్మికుల సంఘానికి సారథ్యం వహించారని ఈ సందర్భంగా కేటీఆర్‌ తెలిపారు..

మంత్రి రజిని అవినీతికి లెక్కేలేదు : మంత్రి పుల్లారావు

ధనార్జనే ధ్యేయంగా ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి రజని పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రజిని అవినీతి చిట్టాకు లెక్కే లేదని.. ఇంకా ఎంత దోచుకుంటారో తెలియదని అన్నారు.

మంత్రి ఆరోగ్యశాఖను పూర్తిగా భ్రష్టుపట్టించారని విమర్శించారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు కూడా అందుబాటు-లో ఉండట్లేదన్నారు. మంత్రి అవినీతిపై రాష్ట్రం మొత్తం కోడై కూస్తోందన్నారు.

వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ నుంచి బదిలీల వరకు అవినీతే జరుగుతోందని, భూవివాదం ఉన్నచోట తలదూర్చి సెటిల్‌మెంట్లు- చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కుటుంబీకులను ముందుపెట్టి అవినీతి వ్యవహారాలను చక్కబెడుతున్నారని, చిలకలూరిపేట మున్సిపాలిటీ-ని అవినీతికి అడ్డాగా మార్చారన్నారు.

పనులు చేయకుండానే రూ.2.70 కోట్ల బిల్లులు చేసుకున్నారని, ప్రజాధనాన్ని మంత్రి రజని సొంతానికి వాడుకుంటున్నారని విమర్శించారు.

మున్సిపల్‌ కార్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది మొత్తం మంత్రి కుటుంబీకులేనని, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీలో రూ.50 లక్షల అవినీతి జరిగిందని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.

Nitish kumar: 'ఇండియా'ను చూసే ఎన్డీయే హడావుడి భేటీలు: నీతీశ్‌ విమర్శ

పాట్నా: విపక్ష పార్టీల కూటమి 'ఇండియా'ను చూసి ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆందోళన చెందుతున్నారని బిహార్‌ సీఎం, జేడీయూ నేత నీతీశ్ కుమార్‌(Nitish kumar) అన్నారు..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 'ఇండియా' కూటమి అద్భుతమైన పనితీరు కనబరుస్తుందనే ఆందోళన ఆయనకు పట్టుకుందని విమర్శించారు. బుధవారం దిల్లీలో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీకి నివాళులర్పించిన ఆయన గురువారం పట్నాకు చేరుకున్నారు.

ఈ సందర్భంగా నీతీశ్‌ విలేకర్లతో మాట్లాడారు. వైద్య పరీక్షల కోసమే తాను దిల్లీ వెళ్లినట్టు చెప్పారు. అయితే, తాను ఎంతగానో అభిమానించే దివంగత నేత వాజ్‌పేయీ వర్థంతి అదే రోజు కావడం యాదృచ్ఛికమేనన్నారు. గతేడాది భాజపాతో బంధానికి గుడ్‌బై చెప్పి బిహార్‌లో కాంగ్రెస్‌, ఆర్జేడీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నీతీశ్‌.. వాజ్‌పేయీ సారథ్యంలోని ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేసినప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

వాజ్‌పేయీ ఏదోఒకరోజు ప్రధాని అవుతారని తాను ముందే ఊహించానని.. అదే నిజమైందన్నారు. 1999లో వాజ్‌పేయీ సారథ్యంలోని కూటమికి ఎన్డీయే అని పేరు పెట్టారని గుర్తు చేసుకున్నారు.

అలాగే, ప్రధాని మోదీ పేరును ప్రస్తావించకుండానే నీతీశ్‌ పరోక్షంగా పలు విమర్శలు చేశారు. ఎన్డీయే సంకీర్ణ ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉన్న సమయంలో ఏనాడూ సమావేశాల గురించి పట్టించుకోలేదన్న నీతీశ్‌.. 'ఇండియా' కూటమి సమావేశాలు నిర్వహిస్తుండటంతో హడావుడిగా సమావేశాలు నిర్వహిస్తోందని నీతీశ్‌ వ్యాఖ్యానించారు.

మోదీ హయాంలో భాజపా తన మిత్రపక్షాలను గౌరవించడమే మానేసిందని నీతీశ్‌ ఆరోపించారు. రెండు నెలల క్రితం పట్నాలో జరిగిన విపక్ష కూటమి తొలి సమావేశానికి నీతీశ్ సారథ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే, 'ఇండియా' కూటమి సారథ్యం వహించిన నీతీశ్‌ రెండు నెలల క్రితం విపక్ష కూటమి తొలి సమావేశం జరగ్గా.. ఇండియా కూటమిని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ మోదీ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి పనితీరు అద్భుతంగా, దేశానికి శుభసూచికంగా ఉంటుందని నీతీశ్ అన్నారు..

టీపీసీసీ రేవంత్ రెడ్డి సెక్యూరిటీ తొలగించిన ప్రభుత్వం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సర్కారు షాక్ ఇచ్చింది. రేవంత్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించింది.

నిన్నటి నుంచి సెక్యూరిటీ లేకుండానే రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు.

ఇటీవల 4+4 భద్రతను 2+2కు ప్రభుత్వం కుదించింది.

ఇప్పుడు పూర్తిగా భద్రతను ప్రభుత్వం తొలగించడం హాట్ టాపిక్ గా మారింది.

2 నెలల క్రితం తనకు భద్రత కల్పించాలని రేవంత్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు.

ఎలాంటి కారణాలు లేకుండానే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గన్ మెన్లను తొలగించడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి......

TSRTC: ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్‌

హైదరాబాద్‌: ఆర్టీసీ బిల్లుపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై న్యాయ సలహా కోరారు.

ఈమేరకు ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపారు..

గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్‌ అడిగారు.

తన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? నిర్ధారించాలన్నారు.

న్యాయశాఖ కార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్‌ వర్గాలు తెలిపాయి.

దురుద్దేశంతో చేసిన తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజలకు గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు..

Moon Mission: చంద్రుడిని ముందుగా చేరేదెవరు..? చంద్రయాన్‌-3 Vs లూనా25పై ఉత్కంఠ!

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టేందుకు (Moon Mission) ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన 'చంద్రయాన్‌-3' (Chandrayaan-3)..

తాజాగా కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి విజయవంతంగా విడిపోయిన ల్యాండర్‌ మాడ్యూల్‌ (Vikram, Pragyan).. కొన్ని రోజుల్లో చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు సిద్ధమైంది.

ఇదే సమయంలో రష్యా ప్రయోగించిన లూనా-25 (Luna) కూడా జాబిల్లి దక్షిణ ధ్రువం వైపు అడుగులు వేస్తోంది. ఇలా.. భారత్‌, రష్యాలు వేర్వేరుగా ప్రవేశపెట్టిన ల్యాండర్లలో ఏది ముందు చంద్రుడిపై దిగనుందనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ రెండూ స్వల్ప వ్యవధి తేడాతోనే జాబిల్లిపై దిగే అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ.. సురక్షితంగా దిగడమే ప్రధాన అంశమని నిపుణులు పేర్కొంటున్నారు..

భారత్‌కు 40.. రష్యాకు 11 రోజులే..

జులై 14న ప్రయాణాన్ని మొదలుపెట్టిన చంద్రయాన్‌-3.. చంద్రుడికి చేరువయ్యేందుకు మొత్తంగా 40 రోజులకు పైగా ప్రయాణించాల్సి వస్తోంది. మరోవైపు.. దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత చంద్రుడిపై పరిశోధనల కోసం ఆగస్టు 10న రష్యా ప్రయోగించిన లూనా-25.. 11 రోజుల్లోనే జాబిల్లిని చేరుకోనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద ఆగస్టు 23న చంద్రయాన్‌-3ను సురక్షితంగా దించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తుండగా.. లూనా-25 మాత్రం ఆగస్టు 21- 23వ తేదీల్లోనే దిగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇస్రో ఇప్పటికే స్పష్టతనిచ్చినప్పటికీ.. రష్యా అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ మాత్రం కచ్చితంగా ఏ సమయంలో దిగుతుందనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. వీలైతే ఈ రెండూ ఒకేరోజు చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది..

సామర్థ్యంలోనూ భారీ తేడాలు..

తక్కువ బరువుతోపాటు భారీ ఇంధన సామర్థ్యం.. లూనా-25 వేగంగా చంద్రుడి దగ్గరకు చేరేందుకు దోహదపడుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లూనా-25 మొత్తం బరువు 1750 కిలోలు కాగా.. చంద్రయాన్‌- 3 మాత్రం 3900 కిలోలు. ఇందులో పేలోడ్‌ బరువు సుమారు 1800 కిలోలు (ల్యాండర్‌, రోవర్‌లు కలిపి) కాగా, లూనా-25 పేలోడ్‌ కేవలం 31 కేజీలు మాత్రమే. చంద్రయాన్‌-3 కంటే తక్కువ ద్రవ్యరాశి ఉన్నందువల్లే లూనా-25 స్వల్ప సమయంలో వెళ్లేందుకు సాధ్యమవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు లూనా-25కి ఇంధన నిల్వ సామర్థ్యం భారీగా ఉండటం వల్ల చంద్రుడిపైకి నేరుగా వెళ్లేందుకు దోహదపడుతోందని.. చంద్రయాన్‌-3లో ఇంధన సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఎక్కువసార్లు కక్ష్యలో తిరుగుతూ వెళ్లాల్సి వచ్చిందని ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కే శివన్‌ వెల్లడించారు.

అందుకే దీన్ని ప్రయోగించిన 22 రోజుల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిందని అన్నారు.

సూర్యకాంతే కీలకం..

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపడుతోన్న ఈ మిషన్‌లు చంద్రుడిపై దిగే సమయాన్ని సూర్యకాంతి ప్రభావితం చేస్తుందని నిపుణులు పేర్కొన్నారు. దక్షిణ ధ్రువంపై దిగే సమయంలో అక్కడ వెలుగు ఉండాలన్నారు. చంద్రుడిపై ఆగస్టు 23 నుంచి పగలు మొదలవుతుంది. ఇలా స్వల్ప సమయం తేడాతో భారత్‌, రష్యాలు ప్రయోగించిన వ్యోమనౌకలు చంద్రుడిపై దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో యావత్‌ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ మిషన్‌లు విజయవంతంగా జాబిల్లిపై దిగితే.. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-3 మొత్తంగా 14 రోజులు పనిచేయనుండగా.. లూనా-25 మాత్రం ఏడాది పాటు పరిశోధనలు జరపనుంది..