/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ Miryala Kiran Kumar
నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నల్లగొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ

నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర 77వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి గారు జండా ఎగరవేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ గారు యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మున్నాసు ప్రసన్న రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మామిడి పద్మ గారు బీసీ సంఘం జిల్లా కార్యదర్శి కర్నాటి యాదగిరి బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, బీసీ సంఘం మహిళా మండల అధ్యక్షురాలు శంకర్ దుర్గ, కల్లూరు సత్యం గౌడ్ కూరెళ్ళ విజయ చారి, బక్కతట్ల వెంకన్న పున్న పాండు క్రాంతి , వలకీర్తి శ్రీనివాస్ రావిరాల వెంకట్, మల్లెబోయిన సతీష్ యాదవ్ ,రుద్ర లక్ష్మీనారాయణ, ఆంజనేయులు, , చొల్లేటి రవీంద్ర చారి , చిలుకూరి శ్రీను వనం లలిత కే చంద్రశేఖర్ గౌడ్ మూడ సైదులు గంజి రాజేందర్ ముషం శేఖర్ మొదలగు వారు పాల్గొన్నారు.

నల్గొండ 17వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నల్గొండ 17వ వార్డులో జాతీయ జెండా ఆవిష్కరించిన నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి

నేడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా నల్గొండ ఆర్జాలబావిలో జాతీయ జెండాను ఆవిష్కరించి నల్గొండ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా మనకు స్వాతంత్రం వచ్చిందని, అలాంటి స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు దేశభక్తి అలవర్చుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, కౌన్సిలర్సు, వార్డు ఆర్పి, శేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఫ్లాష్.... ఫ్లాష్... కాంగ్రెస్ పార్టీకి షాక్... తిప్పర్తి మండలంలోని తానేదార్పల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ తన అనుచరులతో కలిసి BRS లో చేరిక

ఫ్లాష్....కాంగ్రెస్ పార్టీకి షాక్..

 

తిప్పర్తి మండలం తానేదార్ పల్లి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ కొండ్ర జానయ్య... తన అనుచరులతో కలిసి ... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షం లో.... కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి బిఆరెస్ పార్టీలో చేరారు.. వీరంత కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి కార్యకర్తలు, గత శాసనసభ్యునికి విరంతా ముఖ్య అనుచరులు కావడం విశేషం... వీరి చేరికతో... మండలం లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చినట్లయింది...

 

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కొండ్ర జానయ్య, మండారి యాదయ్య, దాసరి వెంకన్న జెరిపోతుల జానయ్య, కొత్తపల్లి పిచ్చయ్య, కారే సైదులు, మేకల సైదులు...

పార్టీలో చేరినవారిలో.. కొండ్ర సుధాకర్, సుంకరబోయిన బిక్షం, సైదులు,లోకాని నవీన్ సతీష్ సురేష్ నరేష్..తదితరులు ఉన్నారు

చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న: CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్

ఈదులూరు

 చరిత్ర మరువని యోధుడు కామ్రేడ్ బూరుగు అంజన్న 

 CPI (M-L) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు డేవిడ్ కుమార్

 తెలంగాణ సాయుధ పోరాట యోధుడు,సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ సీనియర్ నాయకుడు కామ్రేడ్ బూరుగు అంజన్న 20వ వర్ధంతి సందర్భంగా సీపీఐ (యం-యల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈదులూరు గ్రామంలో జిల్లా నాయకులు ఇందూరు సాగర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్ ) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మండారి డేవిడ్ కుమార్ ఎర్రజెండా ఎగురవేసి అంజన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం గ్రామ సర్పంచ్ ఐతగొని నారాయణ పూల మాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు డేవిడ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు కామ్రేడ్ అంజన్న భూమి,భుక్తి,విముక్తి పోరాటంలో నిజాం నవాబు, రజాకార్ల కు వ్యతిరేకంగా మట్టిమానుషులను తట్టిలేపి ఉక్కుమనుషులుగా మార్చి,బాంచెన్ దొరా నికాల్మొక్త అన్నా చేతులతోనే బందూకులు పట్టించి పొరాటలవైపు నడిపించాడని అంజన్న చరిత్ర మరువలేనిదని అన్నారు.ఎర్రజెండా వెలుగులో దున్నేవానికే భూమి నినాదంతో జరిగిన నక్సల్భరీ ఉద్యమవైపు నిలబడి రైతు కూలీలను ఐక్యం చేశాడని అన్నారు.కామ్రేడ్ అంజన్న 40 సంవత్సరాలు గ్రామ సర్పంచిగా ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని తెలిపారు.కామ్రేడ్ బూరుగు అంజన్న ఎంతోమంది విప్లవకారులకు ఆదర్శంగా నిలిచాడని,జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచాడని కొనియాడారు. అంజన్న స్పూర్తితో నేటి పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని అన్నారు.ప్రజలపై పన్నుల భారాన్ని మోపి,కార్పొరేట్ శక్తులకు ప్రజాసొమ్మును ధారాదత్తం చేస్తున్న మోడీ,కేసీఆర్ పాలకులకు బుద్దిచెప్పడమే కామ్రేడ్ అంజన్న ఆశయాలను ముందుకు తీసుకుపోతామని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఐతగొని నారాయణ, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సాగర్,రైతు-కూలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి,పుట్ట సత్యం, పివైఎల్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు, బి.వి చారి,గ్రామ పార్టీ కార్యదర్శి బూరుగు సత్తయ్య,ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులు భరత్,బింగి నర్సయ్య,వీరంజనేయులు,బీరెడ్డి సత్తిరెడ్డి, ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చింతల అంజయ్య, POW జిల్లా అధ్యక్షుడు బూరుగు లక్ష్మక్క,దణ్డంపెళ్లి చంద్రయ్య, గుడుకుంట్ల వేoకటయ్య,తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 4,5 తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు

సెప్టెంబర్ 4,5 తేదీలలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర 2వ మహాసభలు

 --- కరపత్ర ఆవిష్కరణ

  తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలు పోరాటాల పురిటి గడ్డ నల్లగొండ జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 4,5 తేదీలలో నిర్వహిస్తున్నామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గంజి మురళీధర్ తెలిపారు

         

సోమవారం ఎస్పిటి మార్కెట్ ట్రస్ట్ భవన్లో మహాసభల కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది*. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేటి తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్ర పరిశ్రమ మరియు చేనేత కార్మికుల సమస్యలపై గత 70 సంవత్సరాలుగా గల్లీ నుండి ఢిల్లీ దాకా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించామని అన్నారు. ఆనాటి బిజెపి ప్రభుత్వం చేనేత పరిశ్రమను చావు దెబ్బ తీసేందుకు సత్యం కమిటీ సిఫారసులు తీసుకొని వస్తే ఆ సత్యం కమిటీ సిఫారసులకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మిక సంఘాల మరియు చేనేత సహకార సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఐక్య ఉద్యమాలను, ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించామని అన్నారు. చేనేత సహకార సంఘాలకు మరియు చేనేత కార్మికులకు ఉన్న రుణాలను మాఫీ చేయాలని 2008లో ఐక్య కార్యచరణ ఏర్పాటు చేసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసి నాటి కాంగ్రెస్ ప్రధానమంత్రి ని కలిసి రుణమాఫీ చేయాలని పోరాడి కార్మికుల రుణమాఫీ చేయించిన చరిత్ర చేనేత కార్మిక సంఘానిదని ఆయన అన్నారు. చేనేత వస్త్ర పరిశ్రమకు ఉపయోగకరంగా ఉన్న జాతీయ చేనేత బోర్డుని, మహాత్మా గాంధీ బునకర్ భీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీం, హౌస్ కం వర్క్ షెడ్లాంటి కేంద్ర పథకాలను రద్దు చేసినందుకు చేనేత పరిశ్రమ పైన జిఎస్టి విధించిన కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న చేనేత పరిశ్రమ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనమందరం ఐక్యంగా పోరాడవలసిన అవసరం ఆసన్నమైందని అన్నారు. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు జరిపించకుండా అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా సభ్యులకు పని కల్పించలేని పరిస్థితికి నెట్టబడిన విధానాలపై పోరాడుదామని పిలుపునిచ్చారు. చేనేత మగ్గాలకు జియో టాక్ వేయకపోవడం వలన చేనేత సంఘాలు, ఉత్పత్తి చేసిన చేనేత వస్త్రాలను టెస్కో కొనుగోలు చేసి డబ్బులు చెల్లించక మరియు సంఘాలలో ఉన్న వస్త్రాలను ఖరీదు చేయకపోవడం వలన వస్త్ర నిలువలు పేరుకుపోయాయని, టెస్కో చేనేత సహకార సంఘాలకు బకాయిలు చెల్లించకపోవడం వలన సంఘాలు అప్పుల కూరుక పోయాయని, ఇటువంటి పరిస్థితుల్లో చేనేత సహకార సంఘాలు మరియు సహకారేతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మరియు చేనేత వస్త్ర పరిశ్రమ సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించడం కోసం నలగొండ పట్టణంలో సెప్టెంబర్ 4,5 తేదీలలో జరుగుతున్న చేనేత కార్మిక సంఘం రాష్ట్ర రెండవ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

  

ఈ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో  చేనేత రంగంలో ప్రముఖ నాయకులు మిరియాల సోమయ్య ,రాపోలు దత్త గణేష్, జిల్లా బిక్షం ,మిర్యాల యాదగిరి, కర్నాటి యాదగిరి, జిల్లా గణేష్, దుడుగు లక్ష్మీనారాయణ, చిలుకూరు లక్ష్మీనర్సు, మిరియాల రంగయ్య ,తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కందగట్ల గణేష్, ఉపాధ్యక్షులు కర్నాటి శ్రీరంగం, నామిని ప్రభాకర్ ,రాపోలు వెంకన్న,ఏలే శ్రీనివాస్, బొల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

మాణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి

మాణిపూర్ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలి...దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలి

.ఐ.ఎఫ్.టి.యూ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొంగరాల నర్సింహా,బొమ్మిడి నగేష్ డిమాండ్

మైనారిటీ మతస్తులు మనుషులేననే కనీస ఆలోచన లేకుండా మణిపూర్ లో, మైనారిటీ ఆదివాసీ ప్రజలపై ముఖ్యంగా,కుకీ తెగకు చెందిన ముగ్గురు మహిళలను వివస్త్రలను చేసి,ఊరేగించడం,అడ్డుగా వచ్చిన తండ్రి, తమ్ముడిని చంపేయడం,మహిళలను హత్యలు చేయడం హేయమైన చర్యని ఈ ఘటనను భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) తీవ్రంగా ఖండిస్తుందని,ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అమానుషమైన దుర్మార్గానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని,నిర్లక్ష్యంగా వ్యవహరించిన మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ఐ.ఎఫ్.టి.యూ నల్లగొండ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు బొంగరాల నర్సింహా,బొమ్మిడి నగేష్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం నల్లగొండ పట్టణంలోని CPI (M-L) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయం శ్రామిక భవన్ లో ఐ.ఎఫ్.టి.యూ జనరల్ బాడీ సమావేశం జరిగింది.. ఈసందర్భంగా వారు పాల్గొని 

మాట్లాడుతూ...ఈ ఘటన మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కదిలించిందని,మనో వేదనకు గురిచేసిందని,ప్రధాని మోడీకి మాత్రం కనీస బాధ గానీ,చలనం గానీ లేకుండా మొద్దు నిద్రలో ఉందిని,మౌనాన్ని ప్రదర్శిస్తున్నారని, ఈ మౌనమే దేశానికి ప్రమాదమని అన్నారు. 

సర్వ మతాలకు అనుకూలంగా రాజ్యాంగంలో అవకాశం ఉన్నప్పటికీ,హిందూ మతం పేరుతో అకృత్యాలకు పాల్పడుతూ దాడులు చేయడం సమాజానికి మంచిది కాదని అన్నారు,సర్వ మతాలకు నిలయం ఈ దేశమని మరిచిపోయిన, ఆర్ ఎస్ ఎస్, బీ జే పీ ఇతర మతోన్మాద శక్తులు, మైనారిటీ ప్రజలపై దాడులు, మారణకాండ ను కొనసాగించడం దుర్మార్గపు ఆలోచన అని అన్నారు. భారత్ మాత గురించి నిత్యం మాట్లాడుతున్న వీళ్ళు భారతీయ మహిళలను మరీ ముఖ్యంగా అడవిని నమ్ముకొని జీవిస్తున్న అడవి బిడ్డలైన ఆదివాసీ మహిళలను వివస్త్రలను చేసి,ఊరేగించడం అనాగరిక సమాజంలో కూడా జరగలేదని,ఇంత అన్యాయానికి పాల్పడడం దారుణమని అన్నారు.

మనుషులను,మైనారిటీ లను చంపి,మానవతా విలువలను మంటగలుపుతున్న హిందూ మనుధర్మ శాస్త్ర,మతోన్మాద శక్తుల సమాజ తిరోగమన విధానాలను అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా త్రిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు.ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు విచారణ చేపట్టకపోగా మౌనంగా ఉండడం అల్లరి మూకలకు కొమ్ముకాయడమేనని అన్నారు.వెంటనే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టి.యూ నాయకులు కత్తుల చంద్రశేఖర్,రావుల వీరేశ్,దాసరి నర్సింహా,కల్లూరు అయోధ్య, జానపాటి శంకర్, అంజి,టోపి రాజు,అశోక్, స్వామి,ముత్తు,గౌస్,అంబెడ్కర్,చౌగోని నాగరాజు,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడ లో సి.సి. రోడ్ల శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

మర్రిగూడ లో సి.సి. రోడ్ల శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కంచర్ల...

పట్టణంలోని 13&14 వార్డులో మర్రిగూడ రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నుండి బొడ్రాయి వరకు రూ. 60 లక్షల రూపాయల వ్యయంతో డబల్ సి.సి.రోడ్ల పనులకు ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ మర్రిగూడ లో డబల్ సిసి రోడ్లు, వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నామని.. గత పాలకుల నిర్లక్ష్యంతో నల్లగొండ పట్టణం ఎంతో వెనుకబడి ఉందన్నారు.. కానీ నేడు రాష్ట్రం ఎవరు ఊహించని విధంగా కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో మూడు నెలల్లో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. అదేవిధంగా మరొక్కసారి అత్యధిక మెజారితో గెలిపిస్తే మర్రిగూడ ను ఇంకా మీరు ఊహించని విధంగా అభివృద్ధి చేస్తానని, మీకు ఏ ఆపద వచ్చినా నేను ఉన్నానని ధైర్యంగా ఉండాలన్నారు..

అనంతరం మర్రిగూడ లో సుమారు 100 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ మరియు బిజెపి నుండి జేరిపోతుల అశోక్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి సమక్షంలో గుమ్ముల శ్రీధర్ రెడ్డి, మోత్కూర్ శంకర్, బొజ్జ గోవర్ధన్, బుర్ర మల్లేష్, బొజ్జ స్వామి, జేరిపోతుల శ్రీధర్, బాలకోటి ప్రేమకుమార్, మహేష్, గణేష్ తదితరులు.. బిఆర్ఎస్ పార్టీ లో చేరారు..

మరియు

బిజెపి నుండి బీపంగి వినోద్ కుమార్ (చంటి) ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సమక్షంలో వి.మల్లేష్, వి. సైదులు, ప్రశాంత్, రఘు, మహేష్, ప్రశాంత్, శివమణి, బబ్ల్యూ, వినయ్,ప్రేమ్ కుమార్, ప్రభాస్, వంశీ తదితరులు బిఆర్ఎస్ పార్టీ లో చేరారు..

ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఊట్కూరి వెంకట్ రెడ్డి, జేరిపోతుల భాస్కర్ గౌడ్, రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, బొజ్జ వెంకన్న, కో ఆప్షన్ మెంబర్ గున్ రెడ్డి రాధిక యుగెందర్ రెడ్డి, సందినేని జనార్దన్ రావు, తుమ్మల గోవింద్ రెడ్డి, తుమ్మల శంకర్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, బీపంగి కిరణ్, మధుసూదన్ రెడ్డి, మందడి వెంకట్ రెడ్డి, కడారి యాదయ్య, బొజ్జ యాదయ్య, బీపంగి కిరణ్, సుంకరబోయిన సత్యనారాయణ, సుంకరబోయిన రవి, బొజ్జ నాగయ్య గార్లు మరియు మర్రిగూడ నాయకులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు..

కేంద్రంలో రాబోయేది సంకీర్ణ‌మే.. మ‌న బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధాని కాలేరు : మంత్రి కేటీఆర్

కేంద్రంలో రాబోయేది సంకీర్ణ‌మే.. మ‌న బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధాని కాలేరు : మంత్రి కేటీఆర్

 కేంద్రంలో త‌ప్ప‌కుండా సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డ‌త‌ది.. మ‌న బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధాన‌మంత్రి అయ్యే ప‌రిస్థితి అక్క‌డ ఉండ‌దు అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ అభివృద్ధి పనులకు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డితో క‌లిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్‌లో నిర్వ‌హించిన‌ చేనేత వారోత్సవాల్లో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.

కేంద్ర ప్ర‌భుత్వం ఆలిండియా హ్యాండ్లూమ్ బోర్డు, ఆలిండియా ప‌వ‌ర్ లూమ్ బోర్డు, ఆలిండియా హ్యాండిక్రాఫ్ట్ బోర్డు ర‌ద్దు చేసింద‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. హౌసింగ్ క‌మ్ వ‌ర్క్ షెడ్డు కార్య‌క్ర‌మాన్ని కూడా ర‌ద్దు చేసింది. ప‌నికొచ్చే ప‌థ‌కాన్ని ఉంచ‌కుండా ర‌ద్దు చేసింది మోదీ ప్ర‌భుత్వం. 75 ఏండ్ల‌లో ఏ కేంద్ర ప్ర‌భుత్వం చేయ‌ని త‌ప్పు ఈ ప్ర‌ధాని చేస్తున్నారు. చేనేత ఉత్ప‌త్తుల‌పై 5 శాతం జీఎస్టీ విధించిన దుర్మార్గ‌మైన ప్ర‌ధాని మోదీ. మునుగోడు ఎన్నిక‌ల సంద‌ర్భంగా వేల సంఖ్య‌లో ఉత్త‌రాలు రాశాం. జీఎస్టీ ఎత్తేయాల‌ని కోరాం. కేసీఆర్ కూడా చండూరు వేదిక‌గా మోదీకి అభ్య‌ర్థించారని కేటీఆర్ గుర్తు చేశారు.

రాష్ట్రంలో మ‌న‌మే గెలుస్తాం.. అందులో అనుమాన‌మే లేదు..

రాష్ట్రంలో మ‌నమే గెలుస్తాం. అందులో అనుమాన‌మే లేద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ మూడోసారి ముచ్చ‌ట‌గా మీ అంద‌రి ఆశీర్వాదంతో సీఎం అవుతారు. చేనేత‌పై జీఎస్టీ విధించిన మోదీని ఓడించాలి. కేంద్రంలో కూడా మ‌నం ఉండాలి. కేంద్రంలో త‌ప్ప‌కుండా సంకీర్ణ ప్ర‌భుత్వ‌మే ఏర్ప‌డ‌త‌ది. మ‌న బ‌లం లేకుండా ఎవ‌రూ ప్ర‌ధానమంత్రి అయ్యే ప‌రిస్థితి అక్క‌డ ఉండ‌దు. కేంద్రంతోని కొట్లాడే వాళ్లు కావాలి. కేంద్రం మెడ‌లు వంచే నాయ‌కుడు కావాలి. కేసీఆర్ లాంటి నాయ‌కుడు ఇక్క‌డ ఎవ‌ర్ని నిల‌బెట్టినా గెలిపించాలి. పార్ల‌మెంట్‌లో మ‌న మాట నెగ్గించుకోవాలి. నెగ్గించుకోక‌పోతే మ‌న నేత‌న్న‌ల బ‌తుకులు బాగు ప‌డ‌వు. మోదీ ఉన్నంత‌కాలం.. ఆయ‌న ఆడిచ్చే డూడూ బ‌స‌వ‌న్న‌లు ఉన్నంత‌కాలం, ఢిల్లీకి బానిస‌లు ఉన్నంత కాలం ప‌రిస్థితులు మార‌వు. త‌ప్ప‌కుండా మ‌న పాత్ర ఢిల్లీలో ఉండాలి. కేసీఆర్ లాంటి ద‌మ్మున్న ద‌క్ష‌త క‌లిగిన నాయ‌కుడు రేపు కేంద్రంలో పాత్ర పోషించే ప‌రిస్థితి రావాలి. రావాలంటే మీ ఆశీర్వాదం ఉండాలి. ప‌ద్మ‌శాలి సోద‌రుల కోసం కోకాపేట‌లో రెండున్న‌ర ఎక‌రాల స్థ‌లంలో భ‌వ‌నం క‌ట్టిస్తున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

చేనేత రుణాల మాఫీ.. కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం..

హ్యాండ్లూమ్, ప‌వ‌ర్ లూమ్ కార్పొరేష‌న్లు ఏర్పాటు చేసుకున్నాం అని కేటీఆర్ తెలిపారు. టెస్కోను బ‌లోపేతం చేస్తున్నాం. సొసైటీకి ఎన్నిక‌లు కావాలంటే వెంట‌నే పెడుతాం. మాకేం అభ్యంత‌రం లేదు. కార్మికులు బాగుప‌డాల‌నేది మా ఆలోచ‌న‌. మ‌న‌సున్న నాయ‌కుడు మంచి సీఎం ఉంటే అన్ని ప‌నులు అవుతాయి. రైతు రుణ‌మాఫీ అవుతదా అనుకున్నారు. కేసీఆర్ క‌రోనా వ‌ల్ల న‌ష్ట‌పోయిండు.. రుణ‌మాఫీ చేయ‌డని కాంగ్రెసోళ్లు అనుకున్నారు. కేసీఆర్ మాటిచ్చిండు అంటే.. త‌ప్ప‌డు కాబ‌ట్టే.. 19 వేల కోట్ల‌తో రెండోసారి రైతు రుణ‌మాఫీ చేస్తున్నారు. చేనేత రుణ‌మాఫీ కూడా ఇది వ‌ర‌కు చేశాం. మ‌ళ్లీ చేనేత రుణాల మాఫీ విష‌యాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని కేటీఆర్ తెలిపారు.

16న కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగే ఎస్సి వర్గీకరణ సదస్సును విజయవంతం చేయండి: బకరం శ్రీనివాస్ మాదిగ

పెద్ద కొత్తపల్లి మండలం,

కొల్లాపూర్ నియోజక వర్గం,

నాగర్ కర్నూల్ జిల్లా.

షెడ్యూల్డ్ కులాల ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం ఈనెల 16న కొల్లాపూర్ నియోజకవర్గంలో నిర్వహించబోయే నాగర్ కర్నూల్ జిల్లా సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని ఈరోజు పెద్ద కొత్తపల్లి మండలంలోని పెద్ద కార్పాముల MRPS నూతన గ్రామ కమిటీకి 

ముఖ్య అతిధిగా: MRPS, MSP 

నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జ్ బకరం శ్రీనివాస్ మాదిగ హాజరు కావడం జరిగింది.

మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం: గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి

మంత్రి జగదీష్ రెడ్డితోనే అభివృద్ధి...ఆదరించండి అందరం ఆనందంగా ఉంటాం

- రోజులో 20 గంటలు ప్రజల కోసం కష్టపడే నాయకుడు మంత్రి జగదీష్ రెడ్డి

- 9,8 వార్డులో కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసిన ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి

ఒక రోజులో 20 గంటలు ప్రజల కోసం కష్టపడే నాయకుడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అని ఎస్ ఫౌండేషన్ చైర్మన్ గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 9 మరియు 8 వార్డులో జగదీష్ అన్న కప్2023 కోలాటం మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. 2014లో తాము ప్రజల వద్దకు వస్తే సమస్యలు చెప్పారని నేడు మంత్రి జగదీశ్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి చెబుతుంటే ఆనందంగా ఉందన్నారు. 2014లో సూర్యాపేట పట్టనం ఇప్పుడు ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రం రూపురేఖలు మార్చిన ఘనత మంత్రి జగదీష్ రెడ్డిదే అన్నారు. ముఖ్యంగా హరితహారంలో మొక్కలను బాగా పెంచి సూర్యాపేట జిల్లాలో అటవీశాతాన్ని పెంచడం అభినందనీయమన్నారు. సూర్యాపేట జిల్లాలో ఇంతటి అభివృద్ధి మంత్రి జగదీష్ రెడ్డి నాయకత్వంలోనే జరిగిందన్నారు. ప్రతినిత్యం ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఆలోచించే రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిని ప్రజలంతా ఆదరించాలని అప్పుడే మనమంతా ఆనందంగా ఉంటామని ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటామని అన్నారు.

 సూర్యాపేట పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఎప్పుడు ఏం కావాలో తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించే మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట ప్రజల అదృష్టం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంగా మార్చి పాలన దగ్గర చేయడంతో పాటు రెండు మినీ ట్యాంక్ బండ్లు, మెడికల్ కళాశాల, 21 స్మశానవాటికలు మహాప్రస్థానం, మూసి మురికి నీటి నుంచి విముక్తి కల్పించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలు అభివృద్ధి చేసిన ఘనత మంత్రి జగదీశ్ రెడ్డి కే దక్కుతుందన్నారు. అంతేకాకుండా సీఎంఆర్ఎఫ్ తో వైద్య సదుపాయానికి, నిరుపేదల విదేశీ విద్యకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డిని మరోసారి గెలిపించి హ్యాట్రిక్ విజయం అందించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు కడారి సతీష్ యాదవ్, గంగ లింగారెడ్డి, మచ్చ రాము,బొడ్డు దుర్గయ్య, బండమీది రజిత, రజిని పందిరి సువర్ణ,అనుములపురి వినయ్, నవీన్, మహిళ నాయకురాలు కరుణశ్రీ,అంజమ్మ విజయ,మహేశ్వరి,పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.