క్రీడల్లో విద్యార్థులు రాణించాలి: బిఆర్ఎస్ నాయకుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి
నల్లగొండ జిల్లా, నాంపల్లి:
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణిస్తే, వారి బంగారు భవిష్యత్తుకు.. క్రీడలు దోహదపడతాయని బిఆర్ఎస్ నాయకుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తనయుడు కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 50 లక్షలతో నియోజకవర్గంలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రిని అందజేస్తున్నారు.
అందులో భాగంగా శుక్రవారం నాంపల్లి మండలంలోని మోడల్ స్కూల్, జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ నాంపల్లి, జడ్పీహెచ్ఎస్ పసునూరు, జడ్పిహెచ్ఎస్ ముష్టిపల్లి పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్, షేటిల్, క్యారం బోర్డ్, చెస్ క్రీడలకు సంబంధించిన సామాగ్రిని కూసుకుంట్ల శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు క్రీడా సామాగ్రి అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న యువతకు కూడా త్వరలో క్రీడా సామాగ్రిని అందజేయనున్నట్లు తెలిపారు. విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు సకల సౌకర్యాలు ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలకు అధిరోహించి తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తేవాలని అన్నారు.
కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కుంభం కృష్ణారెడ్డి, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గుమ్మడపు నరసింహారావు, మండల అధికార ప్రతినిధి పోగుల వెంకటరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోరే యాదయ్య, మాల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కడారి శ్రీశైలం యాదవ్, నడింపల్లి యాదయ్య, ఇట్టెం వెంకట్ రెడ్డి, యంపిటీసీ రామావత్ బుజ్జి చందూలాల్ , సర్పంచ్ లు గుండాల అంజయ్య , రామావత్ సుగుణ శంకర్ నాయక్ , పిఎసిఎస్ డైరెక్టర్ బెల్లి సత్తయ్య, కుంభం చరణ్ రెడ్డి, గౌరు కిరణ్, కర్నే యాదయ్య, ఎదుళ్ల యాదగిరి, గంజి సంజీవ, ఎదుల్ల సుందర్, మేకల దేవేందర్, ఆంజనేయులు, దండిగ సాలయ్య, నాంపల్లి నాగరాజు, ఒంటెద్దు సత్తిరెడ్డి, అందుగుల దేవయ్య, ఇర్గి వెంకటయ్య, దాచేపల్లి పాండు, పంగనూరి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Aug 13 2023, 12:01